విజయవాడ: కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 3 నిబంధనల మార్పు చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనికి అనుగణంగా ఆంక్షలను సడలిస్తూ ఉంది. అన్ లాక్-3 ప్రకారం ఆంధ్రప్రదేశ్ సరిహద్దు చెక్ పోస్టుల్లో రాకపోకల మీద ఉన్న ఆంక్షలుండవు. కాకపోతే, ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించే వారు స్పందన వెబ్ సైట్ లో నామమాత్రంగా దరఖాస్తు చేసుకోవాలి.
ఇలా దరఖాస్తు చేసుకుంటే ఆటోమాటిక్ గా ఈ పాస్ మొబైల్, ఈ మెయిల్ కి వస్తుంది. దానిని చెక్ పోస్టులో నమోదు చేయించుకుని ఏపీలోకి రావచ్చు. ఈ నమోదు వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమే నని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
ప్రయాణికులు నమోదు చేసుకున్న వివరాల ప్రకారం, ఆ తర్వాత ఆరోగ్య కార్యకర్తలు వారి ఆరోగ్యంపై దృష్టి ఉంచుతారు. రేపటి నుంచి ఈ విధానం అమలు లోకి వస్తుందని రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ అండ్ ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం.టి కృష్ణ బాబు తెలిపారు.