ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మూడు ముక్కలాటలా మారింది!: నవీన్ రెడ్డి

(Naveen Kumar Reddy*)
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మూడు ముక్కలాటలా మారింది!!
1) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు
2) ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని ఎన్నికల సమయంలో చందమామ కథలు చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తుంది
3) మూడు రాజధానుల బిల్లు సిఆర్డిఏ బిల్లులను గవర్నర్ రద్దు చేయడం వెనక బిజెపి అధినాయకత్వం కుట్ర దాగి ఉంది
4) మూడు రాజధానుల కథ తిరిగి హైకోర్టుకు వెళ్లడం తథ్యం
5) కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది మరోపక్క కరోనా వైరస్ బాధితుల మరణాల సంఖ్య దేశంలో గణనీయంగా పెరుగుతుంది వీటన్నిటి నుంచి దేశ,రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించడానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 5 కోట్ల మంది ప్రజలతో దాగుడుమూతలు ఆడుతున్నారు!
రాయలసీమకు హైకోర్టు ఇస్తే అభివృద్ధి జరిగిపోతుందా అన్నదానిపై సీమ ప్రాంత అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలి!
రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కావాల్సింది పరిశ్రమల స్థాపనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు,నిధులు,నీళ్లు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అన్న విషయాన్ని పాలకులు గుర్తించాలి!!
Naveen Kumar Reddy
(Naveen Kumar Reddy, Congress  Leader; Convener, Rayalaseem Porata Samiti;  Hon. President Dist INTUC )