బంగారానికి క్యారట్ ఎలా కొలమానమో ఆరోగ్యం బంగారంలా ఉండటానికి తినే క్యారెట్ అంతే అవసరం.
1. క్యారెట్లో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరచడానికి, చర్మ సౌందర్యాన్ని ఇనుమడింప చేయడానికి తోడ్పడుతుంది.
2. క్యారెట్ తింటే కాన్సర్ ను నిరోధించవచ్చు.
3. క్యారెట్ గుండె పోటును, పక్షవాతాన్ని కూడా నివారిస్తుంది.
4. విటమిన్ A లోపం వలన రేచీకటి, జీరప్తాల్మియా, కెరటో మలేసియా(karetomalacia), బైటాట్ స్పాట్స్ (Bitot’s spots), ఫ్రెనోడెర్మా వంటి వ్యాధులు వస్తాయి.
5.క్యారెట్ పెరుగుతో తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్ లో ఉండే బీటా కెరోటిన్ కళ్లకు మేలు చేస్తుంది. రేచీకటిని నివారిస్తుంది. ఒక వేళ ఆ సమస్య అప్పటికే ఉంటే దానిని తగ్గిస్తుంది.
6.సంతాన సాఫల్యతకు కూడా క్యారెట్ చాలా ఉపయోగకరం.
7.క్యారెట్ యాంటీ ఏజెనింగ్ కారకం. క్యారెట్ జ్యూస్ లా కాని, అలానే తినడం వలన కాని చర్మ కాంతి పెరిగి, వృద్థాప్య ఛాయలు తొలగిపోతాయి.
8.మెరిసే ముఖ సౌందర్యం కోసం క్యారెట్ తో ఒక చిన్న చిట్కా
నాలుగు స్పూన్ల క్యారెట్ జ్యూస్ లో, రెండు స్పూన్ల బొప్పాయి జ్యూస్, కొద్దిగా పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంట అయ్యాక చల్లటి నీటితో కడగాలి.
9.యాంటి ఏజింగ్ లుక్ కోసం క్యారెట్ తో టిప్
రెండు టీ స్పూన్ల క్యారెట్ రసంలో, కొంచెం అరటి పండు గుజ్జు , గుడ్డులోని తెల్లసొన, నాలుగు చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని వలయాకారంగా రుద్దుతూ 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగెయ్యాలి.
ఇలా చేయడం వలన ముఖం మీద ముడతలు తగ్గి చర్మం యవ్వనంగా ఉంటుంది.
10. ముఖం తాజాగా మెరవడానికి
ఒక టీ స్పూన్ క్యారెట్ రసంలో, కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి పావుగంట తర్వాత కడిగెయ్యాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది.
11. ముఖంపై మొటిమలు తగ్గడానికి
రెండు స్పూన్ల క్యారెట్ రసంలో ఒక స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి కలిపి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడగాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గుముఖం పట్టి మోము కాంతివంతంగా ఉంటుంది.
photo credits: wikimedia commons