పుదీనా ఆరోగ్యానికి ఖజానా… పుదీనా పచ్చడి, పుదీనా రైస్, పుదీనాతో ఆహారాలపై గార్నిష్ ఇలా ఏదొక రూపంలో పుదీనాను ఆహారంలో చేర్చుకుంటే మంచిదని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
అజీర్ణం, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు తగ్గటానికి ఒక స్పూన్ పుదీనా రసం, ఒక స్పూన్ తేనే కలిపి తీసుకుంటే తగ్గుతుంది.
పుదీనా పచ్చడి తినటం వలన గర్భిణులకు వచ్చే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవు.
దంత సమస్యలకు, చిగుళ్ల సమస్యలకు, నోటి దుర్వాసనకు పుదీనా ఆకులు నమిలితే సమస్య తగ్గుతుంది.
పుదీనా కషాయానికి ఉప్పు కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి నుండి విముక్తి పొందవచ్చు. స్వర పేటిక ఆరోగ్యం కాపాడుతుంది.
జలుబు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలకు కూడా పుదీనా ఔషధంగా ఉపయోగ పడుతుంది.
అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారికి రెండు చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే స్మారక స్థితిలోకి వస్తారు.
నిద్రలేమికి, మానసిక ఒత్తిడికి, నోటి దుర్వాసనకు గ్లాస్ వేడి నీటిలో పుదీనా ఆకులు వేసి మూత పెట్టి అరగంట తర్వాత తాగితే ఉపశమనం కలుగుతుంది.
పుదీనా ఆకులు ఎండబెట్టి పొడి చేసి కొంచం ఉప్పు కలిపి పళ్ళు తోముతులు ఉంటె చిగుళ్లు గట్టి పడతాయి. దంత వ్యాధులు కూడా రావు.
పుదీనా ఆకులను గ్లాస్ నీళ్లలో మరగబెట్టి, అందులో కండ చక్కర కలిపి సేవిస్తే చర్మం మీద దురదలు, దద్దుర్లు తగ్గుతాయి.
గొంతులో గరగర ఉన్నవాళ్లు ఒక కప్పు పుదీనా టీ తాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
మంచి స్వరం కోసం పుదీనా రసం అపుడప్పుడు సేవిస్తుంటే మధురమైన స్వరం మీ సొంతం.
తల నొప్పిగా ఉన్నప్పుడు పుదీనా ఆకుల పేస్ట్ ను నుదుటి పైన ఉంచితే తగ్గుతుంది.
మొహంపైన బ్లాక్ హెడ్స్ ఉంటే 2 స్పూన్ల పుదీనా రసంలో కొంచం పసుపు కలిపి అవి ఉన్న ప్రాంతంలో అప్లై చేసి ఆరాక వేడి నీళ్లతో కడగాలి. ఇలా మూడు రోజులు చేస్తే మచ్చలు తగ్గిపోతాయి.
పుదీనా ఆకుల పేస్ట్ కి కొంచం పేస్ట్ కి కొంచం పసుపు కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే మొహం మృదువుగా కాంతివంతంగా ఉంటుంది.
మొటిమలు తగ్గాలంటే పుదీనా ఆకుల పేస్ట్ ఇంకా గుడ్డులోని తెల్ల సోనా కలిపి ముఖానికి రాసుకుని తర్వాత శుభ్రమైన నీటితో కడిగేస్తే సరి..
కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోవాలంటే పుదీనాను మెత్తగా నూరి కొంచం నిమ్మరసం చేర్చి రోజు వాటిపై రాస్తూ ఉంటె త్వరగా తగ్గిపోతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం పుదీనా వాడి ఎంచక్కా బోలెడన్ని ప్రయోజనాలు పొందెయ్యండి మరి!!
photo credits: wikimedia common