రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు జిల్లాల వారీగా మంజూరు చేస్తున్న వేల కోట్ల నిధుల దుర్వినియోగమవుతున్నాయని, దాని మీద విచారణకు ఆదేశించాలని రాయలసీమ పోరాట సమితి నాయకుడు నవీన్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం కరోనా నివారణకు ఇప్పటికే రాష్ట్రానికి 8 వేల కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు! అమరావతిలో నిన్న జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో కరోనా చికిత్స కు అదనంగా వెయ్యి కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు!! మరి ఈనిధులతో రాష్ట్రంలో కరోనా ట్రీట్ మెంటు మెరుగుపడలేదా? మెరుగు పడితే, కరోనా బారిన పడిన చిత్తూరు జిల్లా రాజకీయ ప్రముఖులు వారి కుటుంబ సభ్యులు స్టేట్ కోవిడ్ సెంటర్ తిరుపతి పద్మావతి వైద్య కళాశాలలో వైద్యం చేయించుకోకుండా ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళుతున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.
అంటే మన రాష్ట్ర కోవిడ్ సెంటర్ లో వైద్య సౌకర్యాలు సక్రమంగా ఉన్నట్లా లేనట్లా? ప్రముఖులంగా ఇతర రాష్ట్రాలకు పోతే, మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి?? వాళ్ల ప్రాణాల మీద గౌరవం లేదా ఆయన అడుగుతున్నారు.
తిరుపతి పద్మావతీ కళాశాలో కోవిడ్ సెంటర్ వ్యవహారమంతా ఒక స్కామ్ అని ఆయన చెబుతున్నారు.
ఎందుకంటే…
1) తిరుపతి పద్మావతి వైద్య కళాశాల కోవిడ్ సెంటర్ లో కరోనా వైరస్ బాధితులకు అత్యవసరంగా అందించాల్సిన ఆక్సిజన్ గ్యాస్ పైప్ లైన్ యూనిట్ లేకపోవడంతో అనేకమంది ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి స్టేట్ కోవిడ్ సెంటర్ గా ప్రకటించి రెండు నెలలు గడుస్తున్నా వైరస్ బాధితులకు సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ అందించడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట!!
2) రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ ప్రకారం కరోనా వైరస్ బాధితులకు ఒక్కొక్కరికి డ్రై ఫ్రూట్స్, పౌష్టికాహారం కొరకు “500” రూపాయలు విడుదల చేస్తుండగా నాసిరకం భోజనాలు సరఫరా చేయడం డ్రై ఫ్రూట్స్ ఇవ్వకపోవడం పై దృష్టి సారించాలి పౌష్టికాహారం బాధితులకు అందేలా చూడాలి!!
3) పద్మావతి స్టేట్ కోవిద్ సెంటర్ కు టీటీడీ విడుదల చేసిన సుమారు 29 కోట్ల నిధులతో వెంటిలేటర్లు ఇతరత్రా కొనుగోలు చేశారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిత్తూరు జిల్లాకు ఇప్పటివరకు ఎంత నిధులు వచ్చాయి? ఎక్కడ? ఎంత ఖర్చు చేశారు? అన్నదానిపై జిల్లా కలెక్టర్ శ్వేతపత్రం విడుదల చేయాలి!!
4) పద్మావతి స్టేట్ కోవిద్ సెంటర్ లో ఉన్న పేషెంట్లకు తగ్గట్లుగా వైద్యులను అందుబాటులో ఉంచాలి స్విమ్స్ వైద్యులను పద్మావతి స్టేట్ కోడ్ సెంటర్ లో పని చేసేలా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాల ఇవ్వాలి!!
5) రాష్ట్ర ప్రభుత్వం పీపీ కిట్ల కొనుగోలుకు చెల్లిస్తున్న 950 రూ”లో జరుగుతున్న అవినీతిపై విచారణకు ఆదేశించాలి!!
6) పారామెడికల్ కిడ్స్ పరీక్షలకోసం ప్రైవేట్ ల్యాబ్ లకు ఒక్కొక్కరికి 2700 రూ”అధిక ధర ప్రభుత్వం చెల్లించడం పై పునరాలోచించాలి!!
7) కరోనా వైరస్ వైద్య పరికరాలను తిరుపతిలోని స్థానిక ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయడం విరమించుకొని నేరుగా కంపెనీల నుంచి కొనుగోలు చేసేలా జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా కాపాడాలి!!
8) చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులలో సైతం కరోనా వైరస్ పేషెంట్లకు వైద్యం అందించాలని కలెక్టర్ నిర్ణయించడం శుభపరిణామం! 9)ప్రైవేటు వైద్యశాలలో కరోనా వైరస్ వైద్య పరీక్షల ధరల నియంత్రణ బాధ్యత జిల్లా కలెక్టర్ గారిపై వుంది!!
9) కరోనా వైరస్ బాధితుల నుంచి ప్రైవేటు ఆసుపత్రులు వైద్యం కోసం అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తే బాధితుల నుంచి అలాంటి ఫిర్యాదులు వస్తే వెంటనే ఆ ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేసేలా జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి!!