కొంతమందికి ఎంత ట్రై చేసినా రాత్రిళ్ళు సరిగా నిద్రపట్టక అవస్థలు పడుతుంటారు. అలాంటివారికోసమే ఈ చిట్కాలు. సమయానికి త్వరగా నిద్రపోవాలంటే ఇలా చేస్తే చిటికెలో నిద్రముంచుకు వస్తుందని తెలుపుతున్నారు శాస్త్రజ్ఞులు . ప్రతిమనిషికి ఎనిమిదిగంటల నిద్రఅవసరం. నిద్రపోయేందుకే నిద్ర కాదు, నిద్ర శరీరంఅని ప్రతి అవయవాన్ని యాక్టివ్ గా ఉంచుంది.నిద్ర పోతే ఇవన్నీ కూడా వీక్ అవుతాయి. అందుకే బాగా నిద్రపోవాలి.
చిటికెలో నిద్రపట్టాలంటే..
1. పడుకునే ముందు సాక్సులు వేసుకుని పడుకొండి
2. గదిలో తక్కువ ఉష్టోగ్రత ఉండేలా చూసుకొండి
3. ఫోన్ దూరంగా పెట్టుకొని పడుకొండి. వీలైతే స్విచ్ ఆఫ్ చేయడం మేలు. మొబైల్ వంటి ఎలెక్ట్రానిక్ పరికరాలనుంచి వచ్చే బ్లూ లైట్ మెదడును మాయ చేస్తాయి. బ్లూలైట్ ప్రభావంలో మెదడు, ‘ఓహో ఇది నిద్రాసమయం కాదా’ అని మైండ్ ని నిద్ర ఉపక్రమించకుండా చేస్తుంది.అంటే, ఈ బ్లూలైట్ వల్ల నిద్రా తీసుకువస్తే రసాల ఉత్పత్తిలో ఆగిపోతుంది.
4. చల్లటి నీటిలో 30 సెకన్ల పాటు ముఖాన్ని ఉంచండి
5. రాత్రిళ్ళు కాఫీ, టీలు మానేయడం బెటర్. ఎందుకంటే వీటివలన నిద్ర ఆలస్యం అవుతుంది. బాగా నిద్ర పోవాలనుకున్న వాళ్ల కాఫీ తీసుకోరాదు. ఎందుకంటే, కాఫిలోని కెఫిన్ ఉత్తేజం కల్గించే రసాయనం.దీని హాఫ్ లైఫ్ ఆరుగంటలు. అంటే ప్రతిగంటలకు శరీరంలో ఉన్న కెఫిన్ లో సగం మాత్రమే తరగిపోతుంటుంది. పొద్దున కాఫి తాగినా దాని ప్రభావం మెదడులో ఆర్ధరాత్రి కూడా కొద్ది ఉంటుంది. మీరు నిద్రపోవాలనుకున్నపుడు అది అడ్డు చెబుతుంది.
6. గోరు వెచ్చని పాలు తాగడం అలవాటు చేసుకోండి. పాలు తాగితే త్వరగా నిద్ర పడుతుంది.
7. ప్రతి రోజు ఒకే టైం కి నిద్ర పోయేలా టైమింగ్స్ సెట్ చేసుకోండి. ఆ టైముకి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి రోజూ ఒకే టైం కి నిద్రపోయేలా ఫిక్స్ అవండి.
8. పగటి నిద్రను పక్కన పెట్టేయండి. మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి త్వరగా నిద్రపట్టదు.
9. నచ్చిన సంగీతం లేదా పుస్తకాలు చదవడం వలన కూడా త్వరగా నిద్ర పట్టే అవకాశం ఉంది. చిన్న చిట్కా, నిద్ర ఎంతకురాపోతే,రిఫ్రిజిరేటర్ మాన్యువల్ లేదా టెలిఫోన్ మాన్యువల్ వంటి బోర్ కొట్టే పుస్తకాలు చదివినా నిద్దరొస్తుంది. మంచి పుస్తకాలు చదివితే ఒక్కొక్క సారి వస్తున్న నిద్ర ఆగిపోవచ్చు.
10. అనవసరమైన విషయాలు ఆలోచించకుండా ప్రశాంతంగా మీకు నచ్చిన వారిని ఊహించుకుని కళ్లు మూసుకొండి.
అలాగే మెల్లిగా మెల్లిగా నిద్రలోకి జారుకొండి. ఈ చిట్కాలు పాటిస్తే చిటికెలో మీకు నిద్రపట్టడం ఖాయం.