ఏపీ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా “వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్” ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లా స్థాయిలో 13, నియోజకవర్గాల స్థాయిలో 147, ప్రాంతీయ స్థాయిలో 4 వైఎస్ఆర్ అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది.
విశాఖ, గుంటూరు, ఏలూరు, తిరుపతి నగరాల్లో 4 ప్రాంతీయ ల్యాబ్స్ ఏర్పాటు కానున్నాయి.
ఈ ల్యాబ్స్ లలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల క్వాలిటీ  పరిశీలించేందుకు పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలలో కింది విషయాలను పరిశీలించి క్వాలిటీ నిర్ధారిస్తారు.

*Seed Testing: Physical Purity, Moisture, and Germination Tests.
*Fertilizer Testing: Availability of Nitrogen, Phosphorus &
Potash, Boran, and Sulphur.
*Pesticide Testing: Shall act as a Collection point and sample will
be sent to the District Lab and results will be communicated to
the Farmers.

విత్తనాలువిఫలమయినట్లు రైతులు ఫిర్యాదు చేస్తే ల్యాబ్ సిబ్బంది పొలాలను సందర్శించి మొక్కల శ్యాంపిల్స్ ను ఇండస్ట్రియల్ ధర్మల్ ఫ్లాస్క్ లో కలెక్ట్ చేసి డిఎన్ ఎ  పరీక్షల కోసం పంపిస్తారు.
రైతులను మోసగించే కంపెనీల చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు కమిషనరేట్ లో లీగల్ సెల్ కూడా ఏర్పాటుచేస్తున్నారు.
ఇందుకు సంబంధించి రూ.197 కోట్లతో ప్రాజెక్టు రిపోర్టును ఏపీ సర్కార్ నాబార్డుకు సమర్పించింది. నాబార్డు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద రూ.150 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేసింది.