శుక్రవారం నాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ లెవనెత్తిన అంశాలన్నింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవేశపడకుండా, దుర్భాషలాడకుండా, రాజకీయంగా సమాధానం చెప్పాలని సీనియర్ జర్నలిస్టు డాక్టర్ నాటుబాంబుల సుధాకర్ రెడ్డి అంటున్నారు. డాక్టర్ సుధాకర్ రెడ్డి సైకాలజిస్టు, సోషల్ యాకివిస్టే కాకుండా జర్నలిస్టుగా కూడా పనిచేశారు. నిర్మొహమాటంగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం సుధాకర్ రెడ్డి స్వభావం. రాజకీయాలు ప్రజాస్వామికంగా ప్రాక్టీస్ చేయాలని ఆయన అంటున్నారు. పవన్ వర్సెస్ వైఎస్ ఆర్ సిపి మీద ఆయన వ్యాఖలివి:
కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదు అని వైసీపీ ప్రభుత్వం మరోసారి ప్రకటించాలి pic.twitter.com/pTwV8WL6vt
— JanaSena Party (@JanaSenaParty) July 24, 2020
పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు సరైన సమాధానాలు చెప్పలేని స్థితిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పడిందని, దీనికి ఆ పార్టీ విధానాలే కారణమని సుధాకర్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీలో బలముందని ఈ పార్టీ నేతలు పార్టీని, పరిపాలన మీద విమర్శులుచేసేవారందరిమీద దుర్భాషలాడటం అలవాటుగా పెట్టుకున్నారని సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చివరకు ఈ పార్టీ అభిమానులనే వాళ్లు కోర్టు తీర్పులను కూడా సహించలేక కోర్టు ధిక్కార పూరితంగా మాట్లాడటంతో కేసులు పెట్టాలని కోర్టుల ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలా కోర్టులు నోరు కట్టేయడంతో వైసిపి అభిమానులు గతంలో లాగా పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు సమాధానమీయక లేకపోతున్నారని ఆయన అన్నారు.పార్టీ ప్రముఖులకు కరోనా సోకడం కూడా పార్టీ మూగవోయేందుకు కారణమని ఆయన అంటున్నారు. ఆయనేమంటున్నారో వీడియో చూడండి