పదిరోజుల్లో చౌకగా మార్కెట్లోకి వస్తున్న కరోనా మాత్రలు, ధర రు. 68

ఫార్మష్యూటికల్ కంపనీ సిప్లా  చౌకగా కరోనా మందును మార్కెట్లోకి విడుదల చేయబోతున్నది.ఫేవిపరివిర్ ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఈ కంపెనీ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) అనుమతి లభించింది.
సిప్లెంజా బ్రాండ్ నేమ్ మార్కెట్ లోకి రానున్న ఈ మందును కూడా ఎమర్జన్సీలో డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. ఒక టాబ్లెట్ ధర రు. 68. దేశంలో విపరీతంగా జనం కరోనా మందుకోసం ఎదురుచూస్తూ ఉండటంతో సిప్లా  ఆగస్టు మొదటి వారంలోనే  ఈ మాత్రలను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నది.
బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు నివారించేందుకు ఈ మాత్రలను మొదట నేరుగా ఆసుప్రతిచానెల్స్ ద్వారానే సప్లయి చేయాలనుకుంటున్నారు. అది కూడా కేస్ లోడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రయారిటీ మీద పంపిస్తారు కంపెనీ వెబ్ సైట్ లో విడుదల చేసిన ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.
ఈ మందును కూడా సిప్లా-సిఎస్ ఐఆర్-ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) లు సంయుక్తంగా రూపొందించాయి.ఫావిపరవిర్ ను చౌకగా సులభంగా తయారుచేసే మార్గాన్ని ఐఐసిటి రూపొందించిందని,ఇలా తయారయని యాక్టలివ్ ఫార్మష్యూటికల్ ఇంగ్రేడియంట్ (API) కరోనా మందుతయారుచేసి మార్కెటింగ్ చేసే నిమిత్తం సిప్లాకు బదలాయించినట్లే ఈ కంపెనీ పేర్కొంది.
As part of this partnership, CSIR-IICT has successfully developed a convenient and cost-effective synthetic process for Favipiravir. The entire process and Active Pharmaceutical Ingredient (API) of the drug has been transferred to Cipla to manufacture and market the drug at scale.
ఇది నోట్లో వేసుకునే గోలీలు కాబట్టి దీనిని తీసుకోవడం సులభం. ఒక మాదిరి కోవిడ్ లక్షణాలున్నపుడు ఈ మాత్రలు వేసుకుంటే కోలుకునే సమయాన్ని వేగిరం చేస్తుందని ప్రెస్ నోట్ లో సిప్లా పేర్కొంది.

tablets picture source : wikimediacommons