ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని వికేంద్రీకరణ ప్రతిపాదించారు. రాజధాని మూడు భాగాలు చేసి మూడు ప్రాంతాలకు మార్చాలనుకున్నారు. ఇందులో భాగంగా పరిపాలనా రాజధానిని విశాఖకు మార్చాలని ముఖ్యమంత్రి జగన్ భావించారు.అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా, కర్నూలు జ్యుడిషియల్ రాజధానిగా మారతాయి.
అయితే, దీనికి రాజకీయ అడ్డంకులు ఎదురవుతున్నాయి. బిజెపి, టిడిపితో పాటు అన్నిరాజకీయా పార్గీలువ్యతిరేకిస్తున్నాయి.
ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న రాజకీయ శక్తులు జగన్ పథకం తక్షణం అమలుకాకుండా అడ్డుకున్నాయి. వ్యవహారం కోర్టు కెళ్లింది. బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. అమరావతిని మార్చకుండా చూడాలని కేంద్రం మీద వత్తిడి తెస్తున్నది. గవర్నర్ ఆమోదానికి పంపిన బిల్లులు న్యాయసలహాకోసం వెళ్లాయి. గవర్నర్ బిల్లులను తిప్పిపంపిస్తారా లేక సంతకం చేస్తారా అనే టెన్షన్ వైసిపి వర్గాల్లో ఉంది. తిప్పి పంపితే, జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే ఏమవుతంది? అది ప్రతిక్షాలకు ఎదురు దెబ్బ అవుతుందా? అపుడుకోర్టులేంచేస్తాయి. మొత్తానికి ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానాలు పథకం ప్రస్తుతానికి వాయిదా పడినట్లే. దాని చుట్టూ ఆనిశ్చిత పరిస్థితి నెలకొంది.
ఏందుకంటే, ఈ విషయం రాష్ట్రపతి భవన్ కు వెళ్లింది. రాష్ట్ర బిజెపిని కాదని కేంద్రం ముందుకు వెళ్తుందనేది అనుమానే. అందువల్ల కేంద్రం కూడా ఏదో విధంగా రాజధాని వ్యవహారం తెలకుండా చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల ప్రతిపాదన ఒక కలగా మిగిలిపోవడమేకాదు, ముఖ్య మంత్రి జగన్ కు మానసిక అశాంతినే మిగిలిస్తుందని తిరుపతికి చెందిన సీనియర్ జర్నలిస్టు ఎన్ బి సుధాకర్ రెడ్డి అంటున్నారు. వీడియో చూడండి.