తెలంగాణ బాలలు ఒక మంచి మిత్రుని కోల్పోయారు. కష్టాల్లో ఉన్న బాలలను అదుకునేందుకు రేయింబగలు పనిచేస్తూ వచ్చిన బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అధ్యక్షుడు అచ్యతు రావు కరోనాతో చనిపోయిపట్లు సమాచారం అందింది. ఆయన రెండు రోజుల కిందట కోవిడ్ -19తో మలక్ పేట యశోదా ఆసుప్రతిలో చేరారు. కొద్ది సేపటి కిందట చనిపోయినట్లు తెలిసింది. వివరాలు అందాల్సి ఉంది.
స్కూళ్లలో హింసకు, కుటుంబ హింసకు,యజమానుల హింసకు బలవుతున్న బాలలెందరినో అచ్యుత రావు అదుకున్నారు. బాలలు కష్టాల్లో ఉన్నారని తెలియగానే వారిని ఆదుకునేందుకు రంగంలోకి దూకే వారు. నిమిషాలు కష్టాల్లో చిక్కుకున్న బాల గురించి అధికారులకు సమాచారమీయడం వారిని అదుకోవడంలో అచ్యుతరావు నాయకత్వంతోని తెలంగాణ బాలల హక్కుల సంఘం ముందుండేది.
ఆయన ఎంత మంది పిల్లలను ఆదుకున్నారో లేక్కేలేదు.బాలలను హింసించిన ఎంతో మంది మీద కేసులు పెట్టేవారు. నిధులేమీ లేకపోయినా ఆయన తన కార్యక్రమాలను ఎపుడూ తగ్గించుకోలేదు. అధికారులు కూడా బాలల హక్కుల సంఘం నుంచి ఫిర్యాదురాగానే స్పందించేవారు.
ఆయన ఈనాడు దినపత్రిక కార్టూనిస్టు శ్రీధర్ సోదరుడు.
బాలల హక్కుల పోరాటానికి అచ్యుత రావు మరణం తీరనిలోటు.
సిపిఐ నారాయణ నివాళి
అచ్యుత తరావు కోవిడ్ రక్కసికి అహుతయిపోయారు . చాలాబాధాకరం . సాంఘిక కార్యకలాపాలలో ముఖ్యంగా బాలల సంరక్షణార్థం చురుకయినపాత్ర పోషించారు . అచ్యుత తరావు సేవలు మరువలేనివి . వారులేని లోటు తీరదు. వారికుటుంబంతోకూడా నాకు సన్నిహిత సంబంధం ఉంది. ఇది నాకు తీవ్రవ్యధ . వారిమరణంపట్ల ప్రఘాడసంతాపం తెలియజేస్తూ , వారికుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు.