కరోనా సోకిన తల్లిని బ్రతికించుకోవడానికి ఒక తనయుడు పడరాని పాట్లు పడుతున్నసంఘటన అనంతపురంజిల్లాలో తాడిపత్రి సమీపంలో వెలుగులోకి వచ్చింది. ఇక్కడి పుట్లూరు మండలం మడుగుపల్లికి చెందిన వృద్ధురాలిని క్వారంటైన్లో చేర్చుకోవాలని ప్రాధేయపడుతున్నాడు. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఈ పోస్టుని ఆంధ్రప్రదేశ ప్రభుత్వం దృష్టికి వెళ్లాలనే ఉద్దేశంతో పబ్లిష్ చేస్తున్నాం.
తల్లి వయసు అరవై నాలుగేళ్ళ. ఆమె కరోనా పాజిటివ్. అయితే, ఆ వృద్ధురా లిని చేర్చుకునేందుకు బెడ్లు లేవంటూ ఎస్కే యూనివర్సిటీ క్వారంటైన్ కేంద్రం వారు తిరస్కరించారు . అక్కడ కనిపించిన వచ్చిన ప్రతి వైద్యున్ని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమిలాడుతున్నా ప్రయోజనం శూన్యం అంటున్నాడు ఆమె కుమారుడు మన్మధ రెడ్డి.
వారిది వ్యవసాయ కుటుంబం. వారు నేల తల్లిని నమ్ముకుని బతికి వాళ్లకు పట్టణం గురించి కూడా పెద్దగా తెలియదు. అయితే ఒక వేడుకకు హాజరు కావడంతో తండ్రి ఆదిరెడ్డికి (వయస్సు70) కరోనా వ్యాధి సోకి మరణించారు. వెంటనే స్థానిక డాక్టర్లు అతని భార్య, అతని కొడుకులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్ అని తేలింది.
ఎస్కే యూనివర్సిటీ లోని క్వారంటైన్ కు వెళ్ళమని స్థానిక వైద్యులు తెలిపారు. అక్కడికి అష్టకష్టాలు పడి వెళ్ళగా అరవై సంవత్సరాల వయస్సు పైబడిన వారిని చేర్చుకోలేమని తేల్చిచెప్పారు.
తండ్రి మరణంతో ఇప్పటికే తీవ్ర దుఃఖంతో ఉన్న కొడుకు మన్మథ రెడ్డి కనీసం తన తల్లినైనా చేర్చుకోవాలని కాళ్ళా వేళ్ళా పడుతున్నా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోతోంది. తనకు పాజిటివ్ వచ్చిందని తన ప్రాణాలు పోయినా పర్వాలేదు తన తల్లి కి చికిత్స చేయండని అందరినీ ఆయన వేడుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్భాటంగా ఏం సహాయం కావాలన్నా మేమున్నాం అంటూ ప్రచారం చేస్తోందని తమకు మాత్రం న్యాయం జరగడంలేదని ఆయన దు:ఖిస్తున్నాడు.
క్వారంటైన్ బయట చికిత్స కోసం ఎదురు చూస్తున్న వృద్ధురాలికి జిల్లా అధికార యంత్రాంగం ఏవిధంగా సహాయం చేయాలని ఆయన కోరుతున్నాడు. తాడిపత్రి వైకాపా నాయకులు సాంబశివా రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని క్వారంటైన్ లో చేర్పించాలని ఆ వృద్ధురాలి మన్మథరెడ్డి కోరుతున్నాడు.
(అనంతపురం జిల్లాకు చెందిన జర్నలిస్టులు షేరు చేస్తున్న ఈ పోస్టులో ఇంతకు మించి వివరాలు లేవు)