మీ వూరి కొత్త రోడ్డు ఒక్క వానకే కొట్టుకు పోయిందా…జర్నలిస్టు సుధాకర్ రెడ్డి విశ్లేషణ

కొత్తగా వేసిన రోడ్డు ఒక్కవానకే కొట్టుకుపోతుంది. గుంటలు పడతాయి. నీళ్లు నిడబడతాయి. ఆ రోడ్డు మీద నవడం చాలా కష్టమవుంది, వాహనాలకు కూడా కష్టమే.  ఇది ఒక వూరనకుండా దేశంలో అన్ని వూర్లో ఇదే పరిస్థితి.పూర్వం సార్వకాలిక రోడ్లు వేసే వాళ్లు. ఒక రోడ్డు వేస్తే పది పన్నెండు సంవత్సరాలు వచ్చేవది. ఇపుడు ఒక సీజన్ రోడ్డు ను కనిపెట్టారు. అలా వేస్తారు. ఇలా కొట్టుకుపోతుంది. అయినా ఎవరూ పట్టించుకోరు. కాకపోతే, కొద్ది రోజులు తర్వాత బడ్జెట్ రాగాన, మరొక సీజన్ రోడ్డేస్తారు.ఒక్క వానకే రోడ్లెందుకు కొట్టుకుపోతాయని ప్రభుత్వం విచారించిన దాఖలా లేదు. ఎందుకంటే ఇలాంటి రోడ్ల మీద న్యూస్ పేపర్లలో నివేదికలేవీ రావడం లేదు. రోడ్డెందుకు ఇంత బలహీనంగా  ఉంటున్నది?
పల్లెల్లోనే కాదు, నగరాలలో కూడా రోడ్ల పరిస్థితి ఇంతే, ఆ మధ్య హైదరాబాద్  రోడ్ల మీద తరగలేకి కడుపు మండి జి సత్యనరేష్ కుమార్ అనే వ్యక్తి  జిహెచ్ ఎంసి వైఫల్యం మీద హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు.
చంద్రుడి మీది క్రేటర్ల లాగా ఉన్న బెంగుళూరు రోడ్ల గుంటల మధ్య జాగ్రత్తగా అడుగేసి చంద్రుడి మీద నడుస్తున్నట్లుందని వీడియో తీసి సోషల్  మీడియాలో పోస్టు చేసి  కలకలం సృష్టించాడొక పెద్దమనిషి

ఇస్రో కంటే ముందే మూన్ వాక్, అధికారులకు చెమటలు పట్టించిన వీడియో

ఒక రోడ్డు కాంట్రాక్టులో అందరికీ పంచగా రోడ్డుకు మిగిలేదేంటో తెలుసుకుంటే రోడ్డు బలహీనతకు కారణం తెలుస్తుంది.
ఈ వీడియో చూస్తే, మీ వూర్లో వేసే రోడ్డు ఒక వానకే ఎందుకు కొట్టుకుపోతుందో అర్థమవుతుంది. రోడ్డు అవినీతి ఏమిటో కూడా తెలుస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ రోడ్లు  ఎప్పటిలాగానే అధ్వాన్నంగా తయారవుతున్నాయి. అధికారుల అవినీతి, పాలకుల నిర్లక్ష్యం వల్ల రోడ్లు నాసిరకంగా తయారవుతున్నాయని తిరుపతి కి చెందిన సీనియర్ జర్నలిస్టు డాక్టర్ నాటుబాంబుల సుధాకర్ రెడ్డి చెబుతున్నారు.
విశాఖ జిల్లా కుంకుంపూడి ఆది వాసీ గ్రామానికి వేసిన తారు రోడ్డు వారానికే పాడై గుల్లతేలిపోయిన వార్త సోషల్ మీడియాలో వైరలయ్యా గుండె తరుక్కుపోయి రోడ్డు అలా ఎందుకు కొట్టుకుపోతుందో తనకు తెలిసిన విషయాన్ని ఆయన నలుగురితోపంచుకునేందుకు ఈ వీడియో తయారుచేశారు. నిజనాన్ని నిర్భయంగా, నిస్సంకోచకంగా చెప్పడం, ఈచిత్తూరు రెడ్డి హాల్ మార్క్. పేరులో నాటుబాంబులున్నా, మనిషి నిలువెత్తు మానవత్వం, నిజాయితి. సరళ స్వభావం. సైకాలజీ డాక్టరేట్ చేశాడు. జర్నలిజంలో కూడా ప్రవేశించారు.
రాష్ట్రంలో పలు కుంకుంపూడి రోడ్లలాగా తయారయ్యాయేనేది ఆయన ఆవేదన. అవినీతికి చోటు లేదంటున్న ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో, రోడ్ల నిర్మాణంలో చోటుచేసుకుంటున్నదని కూడా ఆయన ఆవేదన చెందుతున్నారు.  రోడ్లేయడం అవినీతి ఎలా ఉంటుంది, అందులో గ్రామీణ జర్నలిజం పాత్ర కూడా ఆయన వెల్లడిస్తున్నారు.  ఇదే డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి విశ్లేషణ..

 

ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి