ఆంధ్రలో మండల స్థాయి హైస్కూళ్లన్నీ జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ విద్యార్థుల ఉన్నత చదవులకు వెళ్లేందుకు ప్రధాన  సమస్యగా ఉన్న ‘ప్రయాణం’ సమస్యను పరిష్కరించబోతున్నది.ఇది ఎన్నో యేళ్లుగా విద్యార్థులను, తల్లితండ్రులను పీడించిన సమస్య. నిజానికి బాలికలు ఉన్నత  విద్యకు  వెళ్లలేకపోయేందుకు ప్రధాన కారణం కూడా దూరం,  దానికి సరిపోయే ప్రయాణ వసతి లేకపోవడం. ఈ సమస్యను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. పరిష్కరించేందుకు నిర్ణయించింది. గ్రామీణ విద్యార్థులిక ముందు జూనియర్ కాలేజీలకుఎక్కడో దూరాన ఉన్న పట్టణాలకు వెళ్లాల్సిన పనిలేకుండా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  ప్రభుత్వం  చర్యలు తీసుకుంటూ ఉంది.

ఈ వార్త మీకు నచ్చిందా, మీ మిత్రులకు షేర్ చేయండి

గ్రామీణ విద్యార్థులకు  టెన్త్ పాసయ్యక జూనియర్ కాలేజీలకు వెళ్లడం ఎపుడూ సమస్యగా ఉంటుంది. సమీపంలోని పట్టణాలలోని జూనియర్  కాలేజీలలో చేరితే, అక్కడ వసతి, భోజనం  కష్టం. ఇది కుటుంబాల మీద బాగా ఆర్థిక భారం కూడా మోపుతుంది. అందువల్ల చాలా మంది విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు టెన్త్ తర్వాత చదువు మానేస్తుంటారు. తమ కూతుర్లు పట్టణాలకు వెళ్లిజూనియర్ కాలేజీలో చదవడానికి తల్లిండ్రులు కూడా  ఇష్టపడరు. ఆర్థిక భారమేకాదు, అభద్రత కూడా సమస్యే. ఈ డ్రాప్ అవుట్ చాలా సామాజికి అనర్థాలు వస్తున్నాయ్. బాలికలలో బాల్యవివాహాలు కూడా ఎక్కువవుతున్నాయి. ఆంధప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం అమలయితే ఈ సామాజిక రుగ్మత పరిష్కారమయ్యేందుకు కూడా వీలవుతుంది.

చదువు ఆర్థిక భారం 

ఈ మధ్య CRY అనే స్వచ్ఛంద సంస్థ నాలుగు రాష్ట్రాలలో బాలికలు ఎందుకు టెన్త్ తర్వాత చదువు మానేస్తున్నారనే విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ తో సహా నాలుగు రాష్ట్రాలలో అధ్యయనం చేసింది.  మిగతారాష్ట్రాలు బీహార్,గుజరాత్, హర్యానా. ఈ స్టడీ కోసం మూడు వేల మంది తల్లితండ్రలును ఇంటర్వ్యూ చేశారు.  వాళ్లుచెప్పిన వివరాల  ప్రకారం 62 శాతం మంది ఇంటర్ మీడియట్ చదవు ఖరీదైన వ్యవహారం అయిందనా కూతర్లను చదువు మానిపించేస్తున్నారు. 66 శాతం తొందరగా పెళ్లి చేయాలని చదువు పించేస్తున్నారు. 66 శాతం మంది ఇంట్లోపనుల కోసమని చదువు మానిపిస్తున్నారు. ఇవన్నీ కూడా సామాజి క జాఢ్యాలే. అమ్మాయిలు ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తే, తొందరగా పెళ్లి చేయడం ఆగిపోతుంది. అదే విధంగా దగ్గిర లో జూనియర్ కాలేజీలు ఉంటే తల్లితండ్రులు భద్రత గురించి ఆలోచించరు. అమ్మాయిలు చదువుకున్నందున వాళ్లు స్వంతంత్రగా జీవించడం నేర్చుకుంటారు. దీనితో వాళ్ల ఆరోగ్య సమస్యలు కూడ పరిష్కారమవుతాయని  CRY నేవేదిక చెప్పింది.
విద్యార్థినుల డ్రాప్ అవుట్ పెరుగుతూ ఉంది
బాలికల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ లో డ్రాప్ అవుట్ (మధ్యలోనే చదువు మానేస్తున్నవారు) రేటు పెరుగుతు ఊంది. తొమ్మిదో తరగతి స్థాయిలో డ్రాప్ అవుట్ 2.89 శాతం నుంచి  6.72 శాతానికి పెరిగింది. ఇక  టెన్త్ స్థాయిలో డాప్ అవుతున్నవారి సంఖ్య12.65 శాతం నుంచి 15.43 శాతానికి పెరిగింది.
ఢిల్లీ కి చెందిన ఇన్ స్టిట్యూట్ ఫర్  పాలసీ రీసెర్చ్ స్టడీస్ (PRS)  కూడా ఇదే విషయం వెల్లడించింది.ఇండియలో  టెన్త్ లో 77 శాతం విద్యార్థులు చేరుతూ ఉంటే ఇంటర్ లోచేరుతున్నవారి సంఖ్య 52 శాతమే.
అందువల్ల  ఈ సమస్యను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరిస్తూ హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుమార్చాలని నిర్ణయించడం అభినందనీయం.
అపుడు ఇంటర్ చదివేందుకు విద్యార్థులకు కష్టమనిపించదు, తల్లితండ్రులు అభద్రత గురించి భయపడాల్సిన ఉండదు. త్వరలో మండల కేంద్రాలలలోని హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ఒక  చారిత్రక నిర్ణయం కానుంది.
ఈ మధ్య విద్యాశాఖమంత్రి అదిమూలపు సురేష్ ఇంటర్ బోర్డు అధికారులో నిర్వహించిన సమావేశంలో గ్రామీణప్రాంతాలలో టెన్త్ పాసయ్యాక, ఇంటర్ చదివేందుకు విద్యార్థులెందుకు  ముందుకు రావడంలేదనే అంశం చర్చకు వచ్చింది.టెన్త్ పాసవుతున్న వారు చాలా మంది వారున్నారు. కానీ, ఇంటర్ చేరుతున్న వారు తక్కువ. మిగతావాళ్లెందుకు ఇంటర్ చేరడంలేదని విషయం మంత్రి గమనించారు
అపుడు ‘దూరం, ప్రయాణం’ సమస్య సమావేశం ముందుకు వచ్చింది. దూనానికి,ప్రయాణానికి భయపడి చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలను ఇంటర్ చేర్పించడం లేదని అధికారులు చెప్పారు. దీనికి పరిష్కారం మండల స్థాయిలో జూనియర్ కళాశాలను ఏర్పాటుచేస్తే సరిపోతుందని అధికారులు సూచించారు. అపుడు మండల పరిధిలో ఉన్న హైస్కూళ్ల విద్యార్థుంతా కాలేజీలలో చేరవచ్చు. మండల కేంద్రం ఏదీ గ్రామాలకు 20కి.మీ దూరం కంటే. జిల్లా కేంద్రంలో ఉన్న కార్పొరేట్ జూనియర్ కాలేజీలోవిద్య చాలా ప్రియం. ఫీజులు గ్రామీణ కుటుంబాలు భరించలేనంతగా ఉంటాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు తక్కువగా ఉంటాయి. మిగతా ఎక్కడ చేరిన ప్రయాణించడం సమస్య. అందువల మండల కేంద్రాలలో జూనియర్ కాలేజీలు అందుబాటులోకి వస్తే  ఈ దూరానికి విద్యార్థులు ఆర్టీ సి బస్సులను ఉపయోగించుకోవచ్చు. లేదా ఇతర వాహనాలను కూడా వాడవచ్చు. అధికారులు చేసిన ప్రతిపాదనకు మంత్రి ఆమోదం తెలిపినట్లు సాక్షి రాసింది.
ఉదహరణకు అనంతపురం జిల్లాను తీసుకుందాం. ఈ జిల్లాలో 63  మండలాలు ఉన్నాయి. ఇందులో 25 మండలాల్లో మోడల్ పాఠశాలలున్నాయి.  ప్రభుత్వం నిర్ణయం కనీసం 37 హైస్కూళ్లు జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ అవుతాయి.  కార్పొరేట్ కాలేజీలు తరగతికి  40 మందికి మించి అనుమతించవు. అందువల్ల చాలా మంది వాటిలో సీటు ఖరీదవడమే కాదు, దొరకడం కూడా కష్టం.  అందువల్ల ఉన్నత పాఠశాలలను అప్ గ్రేడ్ చేయడం వల్ల ఈ సమస్య పరిష్కారమవుతుంది.
అనంతపురం జిల్లాలో అప్ గ్రేడయ్యే హైస్కూళ్లివే…
ఆత్మకూరు, బత్తలపల్లి, బొమ్మనహల్, బ్రహ్మ సముద్రం, బుక్కరాయసముద్రం,చెన్నేకత్త పల్లి,  గాండ్ల పెంట, గార్లదిన్నె,  గుడిబండ, గుమ్మఘట్ట, హాల్కూర్, కంబదూరు, కణేకల్, కుందుర్పి, లేపాక్షి, ముదిగుబ్బ,  నల్ల చెరువు, నల్లమాడచ నంబులపూలకుంట, ఓడిచెరువు, పరిగి,  పెద్దపప్పూరు, పెద్దవడుగూరు,, పుట్లూరు, రామగిరి, రాప్తాడు, రొద్దం,రోళ్ల,  శెట్టూరు, శింగనమల, సోమందే పల్లి, తాడిమర్రి, తనకల్లు,  వజ్రకరూర్, విడపనకల్లు, యాడికి,  యల్లనూరు. ఇక్కడ వచ్చే విద్యాసంవత్సరం నుంచే హైస్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.