విప్లవరచయిత వరవరరావు ఆరోగ్యం బాగాలేదు అని మేమంతా భాధపడుతున్నాము. ఎన్ని సార్లు కోర్టులు ఆశ్రయించినా, అధికారులనుఅభ్యర్థించినా, ప్రజాప్రతినిధులను కలిసినా ప్రయోజనం ఉండటంలేదని వరవర రావు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి తెలంగాణకోసం తొలి నుంచిసైద్ధాంతికంగా కట్టుబడిన కవి వరవరరావు. ఇలాంటి వ్యక్తిని మహారాష్ట్ర పోలీసులు చావుబతుకుల్లోకి నెడుతూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి పట్టించుకొనకపోవడం చాలా విచారకరం. ఆయనను జైలు నుంచి విడుదలచేయించేందుకు కుటుంబ సభ్యులతోపాటు, దేశంలోని మేధావులెందరో ప్రయత్నిస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్యంతో ఉన్న ఆయనను విడుదచేసేందుకు కోర్టు వెనకాడటం బాధాకరం నేపథ్యంలో ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణించినట్లు పోలీసులకుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఈ రోజు వరవర రావు భార్య హేమలత, కూతుర్లు సహజ, ప్రవన లు వరవరరావు పరిస్థితి మీద వెబ్ మీడియా కాన్ఫరెన్స్ లో ప్రసంగించారు.
ప్రస్తుతం ముంబై జైలులో ఉన్న వరవరరావు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది, ఆయన నడవలేని పరిస్థితిలో, సరిగ్గా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారని తమకు సమచారం అందిందని వారు ఆందోళనవ్యక్తం చేశారు.
ఆయన భార్య హేమలత చెప్పిన విషయాలు:
నేను నిన్న ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తే నన్ను గుర్తు పట్టడం లేదు. ఎప్పుడో మరణించిన తన తల్లిదండ్రులు మళ్ళీ చనిపోయారు అని వరవరరావు మాట్లాడుతున్నారు! మే 26న జేజే హాస్పిటల్ కి తరలించినట్లు పోలీసులు సమాచారం ఇచ్చారు.మేము వెళ్లాలంటే మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. జూన్-24వ తేదీ నుంచి మాతో మాట్లాడటం బంద్ చేశారు! ప్రతి వారం మాతో మాట్లాడాల్సిన వరవరరావుతో ఇపుడు మాట్లాడించడం లేదు!
తెలంగాణ-మహారాష్ట్ర-కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని పిటిషన్స్ వేసినా పట్టించుకోవడం లేదు. 19969 నుంచి తెలంగాణ కోసం వరవరరావు పోరాటం చేసి పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నారు. సీఎం కేసీఆర్ కి ఎన్ని లేఖలు రాసిన కనీసం రిప్లై ఇవ్వడం లేదు. దయచేసి నా భర్తను కనీస చికిత్స అందించండి.
కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా గతంలో అప్రోచ్ అయ్యాము–నిన్న కూడా ఆయనతో ఫోన్ లో మాట్లాడాను కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు.
వరవరరావు కూతురు పవన
వరవరరావు కు వెంటనే చికిత్స అందించాలి. సరైన ట్రీట్మెంట్ అందించకపోతే బ్రెయిన్ దెబ్బతినే అవకాశం ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఆరోగ్యం క్షిణింస్తుంది. కేంద్ర హోమ్ శాఖ కావాలనే వరవరరావు పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుంది. తెలంగాణ సీఎం కు ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా కనీస స్పందన లేదు! కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి కి వరవరరావు గురించి తెలుసు! కిషన్ రెడ్డి వరవరరావు విషయంలో కలుగజేసుకొని ఆయనకి కనీస ట్రీట్మెంట్ ఇప్పించాలి!
సోషల్ మీడియాలో ఆందోళన
SOS: #VaraVararao is seriously ill. Called up wife Hemalatha today, has been hallucinating about death of his long gone parents. Person with him in jail told family over phone that VV is in #verybadshape. Delirious. Unable to walk or brush teeth! #RT for urgent hospitalization. pic.twitter.com/PJtMrCSG7Z
— Meera Sanghamitra (@meeracomposes) July 11, 2020
#AmitabhBachchan will get the best medical treatment by a team of the best doctors. You don’t need to worry. #VaravaraRao meanwhile is older than him, has been denied bail and is in prison for speaking against the govt. He’s being denied medical care. He needs your attention more pic.twitter.com/aK75JjmCIH
— Bil 🔗 ✊ Dissent is not a crime! its patriotism ✊ (@bachpan215) July 11, 2020
Don’t kill people’s poet #VaravaraRao in Jail! Provide him with proper treatment. Vararava Rao is in jail for over two years without trial. His bail petitions denied even with his deteriorating health, age and COVID infections in Mumbai’s Taloja Jail. pic.twitter.com/46g0Iyljb2
— Kawalpreet Kaur (@kawalpreetdu) July 12, 2020
77 year old #AmitabhBachchan is Shifted to hosp with Covid symptoms.
77 year old #VaraVararao is refused medical attention in jail despite worsening condition.#ReleaseVaraVararao pic.twitter.com/dQa0VVV5s6— Rakshith Shivaram/ರಕ್ಷಿತ್ ಶಿವರಾಂ (@bkrs100) July 12, 2020