కేరళ రాజధాని లో లాక్ డౌన్ మరొక వారం పొడిగింపు

కేరళ రాజధాని తిరువనంతపురంలో లాక్ డౌన్ మరొక  వారం రోజులు పొడిగించారు. శుక్రవారం నాడు ఈ విషయం ప్రకటించారు. శుక్రవారం నాడు కేరళలో   416 కొత్త కేసులు కనిపించాయి. దీనితో మొత్తం కేసులు 6,950కి చేరాయి. ఇందులో యాక్టివ్ కేసులు 3,099. ఇంతకు ముందు ఒక రోజున కనిపించిన అత్యధిక కేసులు 339 మాత్రమే.
తిరువనంతపురంలాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి పనరయి విజయన్ ప్రకటించారని హిందూస్తాన్ టైమ్స్ రాసింది. రాజధానిలో కంటైన్ మెంట్ ప్రాంతాలలో ట్రిపుల్ లాక్ డౌన్ విధిస్తారని కూడా ఆయన ప్రకటించారు.
కరోనా వ్యాప్తి కమ్యూనిటీ వ్యాప్తిగా మారుతున్నదేమో ననే ఆందోళన ఆచన వెలిబుచ్చారు. కమ్యూనిటీ ట్రాన్సిమిషన్ స్థాయికి కరోనా వ్యాప్తి చేరితే చాలా ప్రమాదకరమయిన వేగంగా కోవిడ్ జబ్బు అంటుకుంటుంది. రాజధానితో పాటు అనేక ప్రాంతాలలో పెద్దఎత్తున కేసులు కనిపిండంతో ఈ అనుమానాలువ్యక్తమవుతున్నాయి. శుక్రవారం నాడు తిరువనంతపురం లో 129 కేసులు నమోదయ్యాయి. ఇందులో వంద కేసులు పూన్ ధురా, మాణిక్కవైలకోం, ఫూధెన్ పల్లి, అంబలతారప్రాంతాలనుంచి వచ్చాయి.