జూమ్ యాప్ కు ప్రత్యామ్నాయం వచ్చేస్తాంది. దానిపేరు లిబెరో టూల్. డెవలప్ చేసిందెవరోకాదు తెలుగు కుర్రవాడు.ఆయన పేరు వంశీ కురమ(Vamsi Kurama). సోల్ పేజ్ ( Soulpage) కంపెనీలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పని చేస్తున్నాడు. చైనాతో గొడవ వచ్చాక భారతద దేశం 59 యాప్ లను నిషిధించిన సంగతి తెలిసిందే. ఆదేసయయంలో దేశీయ టెక్నాలజి ప్రోత్సహించాలని కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది.
దీనికోసం వీడియో కాన్ఫరెన్సింగ్ జూమ్ యాప్ కు భారత ప్రత్యామ్నాయం కోసం వెదకడం మొదలుపెట్టింది. తమ దగ్గిర ఉన్న జూమ్ యాప్ ప్రత్యామ్నాయాలుంటే పంపాలని కేంద్ర ఎలక్ట్రానిక్, కమ్యూనికేషన్స్ శాఖ భారత్ దేశంలో ని స్టార్ట్ అప్ లను కోరింది.
దీనికి స్పందిస్తూ 2000 మంది దరఖాస్తులు పంపారు. ఇందులో నుంచి భాతర ప్రభత్వం 40 కంపెనీలను షార్ట్ లిస్టు చేసింది. వీటిని నుంచి 12 కంపెనీలను జూమ్ కు ప్రత్యామ్నాయ అవకాశాలున్న కంపెనీలుగా వడపోసింది, ఇందులో నుంచి కూడా మరొక మేటి 5 కంపెనీలను ఆఖరుగా సెలెక్ట్ చేసిందని డెక్కన్ క్రానికల్ రాసింది.
ఈ అయిదింటిలో లిబెరో టూల్ (Libero Tool) ఒకటి. జూమ్ కు ప్రత్యామ్నాయంగా ఈ యాప్ ను ఇంకా ముందుకు తీసుకువెళ్లేందుకు రు.15 లక్షల అవార్డు కూడా ప్రకటించింది.
వంశీ (25) హైపర్ ఫామెన్స్, సెక్యూర్ కంప్యూటర్ సిస్టమ్స్ డెవెలప్ చేయడంలో దిట్ట. అంతేకాదు, పైధాన్ ప్రోగ్రామింగ్ మీద “Python Programming: A Modern Approach” పుస్తకం కూడా రాశాడు. ఇపుడాయన నెక్స్ట్ జనరేషన్ ఇంటర్నెట్ ప్రాడక్ట్స్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేస్తున్నారు. తన యాప్ వీడియో కాన్ఫరెన్సింగ్ బాగా పనికొస్తుందని, ఎక్కువ ప్రయోజనాలు నెరవేరుస్తుందని కూడా వంశీచెప్పాడు.
తనయాప్ ప్రొటొటైప్ డెమాన్ స్ట్రేషన్ ను 25 మంది న్యాయనిర్ణేతల ముందు ఇచ్చానని,అది కూడా తాను డెవెలప్ చేసిన లిబెరో వీడియో యాప్ ద్వారానే ఇచ్చానని ఆయన చెప్పారు. దీని వల్ల సెక్యూరిటీకి సంబందించి ఎలాంటి సమస్య రాదని కూడా వంశీ చెబుతున్నాడు. వంశీ తూర్పుగోదావరి జిల్లాలోని సూరం పాళెం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు. ఆయ తండ్రి కాకినాడ జెఎన్ టియు లో పనిచేస్తున్నారు.