అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలలో కరోనా మహమ్మారి విజృంభిస్తూ ఉంది. గత 24 గంటలలో అన్ని జిల్లాలలో కరోనా తీవ్రంగా నమోదయింది. ఏ జిల్లాల్లో కూడా 50 తక్కువగా కేసులు నమోదు కాకపోవడం విశేషం. నిజానికి అతి తక్కువ కేసులు (51) నమోదయింది ఒక్క నెల్లూరు జిల్లాలోనే. ఇలాంటి రాష్ట్రమంతా కరోనా ఇంత బలంగా కనిపించడం కొత్త ట్రెండ్.
మిగతా 12 జిల్లాల ట్రెండ్ చూస్తే ఆందోళన కలుగుతుంది. 208 కేసులతో చిత్తూరు జిల్లా టాపర్ అయింది. ఇంతవరకు ఈ జిల్లాలో 2209 కేసులు నమోదయ్యాయి.19మంది చనిపోయారు. ఇపుడు 1133 కేసులు యాక్టివ్. 191కేసులతో అనంతపురంజిల్లా రెండో స్థానంలో ఉంది. ఈ జిల్లాలో ఇంతవరకు 22 మంది కోవిడ్ తో మరణించారు. తూర్పుగోదావరి జిల్లాల్లో 169 కేసులు నమోదయ్యాయి. ఇది మూడో స్థానం.
ఇక ఇతర జిల్లాకేసులీవిధంగా ఉన్నాయి. గుంటూరు 136, కడప 91, క్రిష్ణా 80, కర్నూలు 144, ప్రకాశం110, శ్రీకాకుళం 80, విశాఖపట్నం 86,శ్రీకాకుళం 80, వియనగరం 86, వీటికితో ఇతర రాష్ట్రాలనుంచి,ఇతర జిల్లాలనుంచి వచ్చి నవారిలో మరొక 32 కేసులు కనిపించాయి. మొత్తంగా నిన్న ఆంధ్రప్రదేశలో 1608 కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
నేటికిది ఆంధ్ర కరోనా పరిస్థితి :
రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,422
గడచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ తో 15 మంది మృతి
ఇప్పటి వరకు 292 మంది కరోనా పాజిటివ్ తో మృతి
గడిచిన 24 గంటల్లో మొత్తం 21,020 శాంపిల్స్ పరీక్ష
రాష్ట్రంలో కరోనా కోసం చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 11,936
ఇప్పటివరకు 13,194మంది కరోనా నుంచి కోలుకోనీ డిశ్చార్జ్