రిజిస్ట్రేషన్ చేసి ఇంటి పట్టాలు ఇవ్వడమేంటే ఆస్తి పంచినట్లే: జగన్

 రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల మంది పేదలకు ఆగస్ట్ 15 వ తేది స్వాతంత్ర దినోత్సవం రోజున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలనుకుంటున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మంగళవారం   వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఈ ప్రకటన చేశారు.
అనివార్య కారణాల వల్ల ఈ నెల 8 న జరగాల్సిన ఇండ్ల స్థలాల కార్యక్రమాన్ని ఆగస్ట్ 15 న పంపిణీ చేయాల్సి వస్తున్నదని, ఆరోజు దేశ స్వాంతంత్య్రంలాగా పేదలకు ఇళ్లులేని పరిస్థితి నుంచి విముక్తి లభిస్తుందని ఆయన  తెలిపారు.
పేద వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇంటి పట్టాలు వారి చేతికి ఇస్తే వారికి ఆస్తి ఇచ్చినట్లు,  ఇండ్ల స్థలాల పంపిణీ వాయిదా పడడంతో ఈ కార్యక్రమం మరింత మెరుగ్గా చేయడానికి అవకాశం ఏర్పడిందని ముఖ్యమంత్రి అన్నారు.
జిల్లాలలో ఇంటి స్థలాల పంపిణీ కారణంగా జిల్లా కలెక్టర్ల పేర్లు చిర స్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు. ఇళ్ల స్థలాల పంపిణీ కోసం దాదాపు 62 వేల ఎకరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. 20 వేల కోట్ల రూపాయలు 30 లక్షల కుటుంబాల చేతుల్లో ఆస్తుల రూపంలో పెడుతున్నామని చెప్పారు. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం అనేది రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప కార్యక్రమం అన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
లే ఔట్లలో చెట్లను నాటించే కార్యక్రమం చేపట్టాలి. ఇంటి స్థలాల పట్టా డాక్యుమెంట్ ట్లో ఫోటోలు పెట్టడడం, ప్లాట్ నెంబర్, హద్దులు పేర్కొనడం చేయాలి. అర్హత ఉండి ఎవరికైనా ఇంటి స్థలం రాకుండా ఉంటే వారు ధరఖాస్తు చేసుకున్న 90 రోజుల లోపే కొత్త స్థలం కొని ఇంటి స్థలం ఇచ్చే కార్యక్రమం చేపడతాం. వర్షాలు పడుతున్నందు వల్ల అవసరమైన ఇసుక స్టాక్ ను అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వ కార్యక్రమాలైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం, నాడు-నేడు పనులు తదితర ప్రభుత్వ పనులకు ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టాలి. నాణ్యత గల ఇసుకను సరఫరా చేయాలన్నారు. అడిగిన వారందరికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను కల్పించాలి. గ్రామ సచివాలయాలు అన్ని కూడా ఆగస్ట్ 31 వ తేది లోగా పూర్తి కావాలి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు సంబందించి సైట్ లను గుర్తించాలి. అంగన్ వాడి కేంద్రాలకు సొంత బిల్డింగ్ లు, స్థలాలు లేని వాటికి స్థల సేకరణ చేపట్టాలి.
కోవిడ్ -19 లో భాగంగా 10 లక్షలకు పై గా టెస్ట్ లను చేయగలిగాము. ఈ కార్యక్రమం అందరి భాగసౌమ్యంతో జరగడం జరిగింది.  ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్లను, వైధ్యాదికారులను అభినందిస్తున్నాను. హోమ్ ఐసోలేషన్ అన్నది చాలా ముఖ్యమైనది, హోమ్ ఐసోలేషన్ కు రెఫర్ చేసిన వారిని భాగా చూసుకుంటున్నారా, వారికి మందులు సరిగ్గా అందుతున్నాయా లేదా అనేది పరిశీలిస్తూoడాలి.
జిల్లా స్థాయిలో ఉన్న కోవిడ్ కంట్రోల్ రూమ్ భాగా పనిచేయాలని తెలిపారు. అలాగే హోమ్ ఐసోలేషన్ పైన జిల్లా కలెక్టర్లు దృష్టి పెట్టాలి.  కోవిడ్ కేర్ సెంటర్ లలో నాణ్యమైన సేవలైన ఆహారం, బాత్ రూమ్ సౌకర్యం, బెడ్ ల సౌకర్యం, వైధ్యుల పర్యవేక్షణ, తదితర అంశాల పై దృష్టి కేంద్రీకరించాలి. రాష్ట్ర స్థాయి కోవిడ్ ఆసుపత్రులు అలాగే జిల్లాల్లోని కోవిడ్ ఆసుపత్రులలో క్వాలిటీ పైన దృష్టి పెట్టండి. కోవిడ్ పై ప్రజల్లో భయాందోళనలు తొలగిపోయేలా అవగాహన కల్పించాలి.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త, ఎస్.పి శెందిల్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ మార్కండేయులు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) వీరబ్రహ్మo, డి.ఆర్.ఓ రాజశేఖర్, జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాదికారి డాక్టర్ పెంచలయ్య, డి.సి.హెచ్.ఎస్.డాక్టర్ సరళమ్మ, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.