లాక్ డౌన్ ఎత్తేయడానికి తొందర పడటం కాదు, ఎపుడెత్తేయాలని ఓపికగా ఎదురు చూసి సకాలంలో లాక్ డౌన్ ఎత్తేసిన ప్రతి దేశంలో కరోనా పారిపోతున్నది. ప్రపంచ చాలా దేశాలన్నింటి కరోనా లాక్ డౌన్ తర్వాత పరిస్థితులు సాధారణ స్థాయికి వస్తున్నాయి. ఒక్క నాలుగు దేశాలలతో తప్ప . ఆ దేశాలు, అమెరికా, బ్రెజిల్ , భారత్, రష్యా .
యూరోపియన్ యూనియన్ లోని చాలా దేశాలలో కరోనా ఎపిడమిక్ అదుపులోకి వచ్చినట్లు సిఎన్ ఎన్ కనుగొనింది. దీనికి భిన్నంగా ఆమెరికా, బ్రెజిల్, రష్యా, ఇండియాలలో పరిస్థితి తలకిందులయినట్లు ఈ వార్త సంస్థ కనుగొనింది.
దీనికి కారణమ్ 1. ఈ దేశాలు లాక్ డౌన్ నే సరిగ్గా అమలుచేయకపోవడం లేదా 2. పరిస్థితి పరిపక్వానికి రాకముందే లాక్ డౌన్ ఎత్తేయడం, అని సిఎన్ ఎన్ అభిప్రాయపడింది.
భారతదేశంలో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ప్రయాణికులను అనుమతించే పరిస్థితి లేదు. చాలాచోట్ల స్థానిక లాక్ డౌన్ పూర్తిగానో పాక్షికంగా నో విధిస్తూనే ఉన్నారు. పరీక్షలు వాయిదా వేశారు.
అయితే యూరోప్ లో ని 15 దేశాలు మంగళ వారం నుంచి తమ దేశాల మధ్య రాకపోకలు కొనసాగించాలని నిర్ణయించాయి. ఈ జాబితలోకి ఏదైన ఒకదేశం రావాలంటే, అంటే యూరోప్ లోకి ప్రయాణించే అనుమతి ఒక దేశానికి రావాలంటే రోజూ ప్రతిలక్ష జనాభాకు వస్తున్న కొత్త కరోనా కేసులెన్ని, గత 14 రోజులలో అంతకు మునుపటి 14 రోజులతో పోల్చినపుడు ప్రతి రోజు క్రమం తప్పకుండా కరోనా కేసులు తగ్గుతూ ఉండాలి. ఈ లెక్కన యూరోప్ లికి యాత్రికలను గాని, విమానాలను గాని పంపించేందుకు భారత్ కు ఇప్పట్లో అర్హత రాదు. ఎందుకంటే, భారత్ తో ప్రతి రోజు కొత్త కరోనా కేసుల విషయంల్ ఒక కొత్త రికార్డే. శుక్రవారం నాడు 20,900 కొత్త కరోనా కేసులతో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక మరణాలు 379.
ఇపుడు ప్రయాణికులకు సురక్షితమయిన దేశాలనుకుంటున్న ప్రతిచోట లాక్ డౌన్ కరోనాకేసులు రోజు రోజుకు తగ్గుతున్న సమయంలో లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తేశారు. ఇపుడు కరోనా వైరస్ కేసులు తగ్గుతన్న దేశాలన్నింటికి ఒక కామన్ లక్షణం. లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా చితికిపోతున్నా ఈ దేశాలన్నీ ఓపికగా కేసులు తగ్గు ముఖ పట్టేదాకా ఎదురుచూసి , తగ్గు ముఖం పట్టగానే లాక్ డౌన్ ఎత్తేశాయి. ఇది మంచి ఫలితాలిచ్చింది. లాక్ డౌన్ ఎత్తేయడంలో కూడా ఈ దేశాలన్ని చాలా జాగ్రత్తగా దశల వారీ విధానం పాటించాయి.
భారత్, అమెరికా, బ్రెజిల్ దేశాలు తొందరపాటు ప్రదర్శించి లాక్ డౌన్ అనువుగాని సమయంలో ఎత్తేయడంతో కరోనా అక్కడ లాక్ డౌన్ ఎత్తేశాక విజృంభిస్తూ ఉంది.
యూరోపిన్ దేశాలు కాకుండా లాక్ డౌన్ జాగ్రత్తగా ఎత్తివేసి, ఆ తర్వాత కరోనా తగ్గుముఖంపడుతున్న దేశాలు: ఆస్ట్రేలియా, కెనడా, జార్జియా,జపాన్, న్యూజిలాండ్, సౌత్ కొరియా, ధాయ్ లాండ్, టునిషియా, ఉరుగ్వే, చైనా
యూరోప్ 15 దేశాలను సురక్షిత ప్రయాణానికి అనువైన దేశాలుగా గుర్తించింది. అవి : చైనా, అల్జీరియా, ఆస్ట్రేలియా, కెనడా, జార్జియా, జపాన్, మాంటెనెగ్రో, మొరాకో, న్యూజీలాండ్, రువాండా, సౌత్ కొరియా, థాయ్ లాండ్, ట్యునిషియా, ఉరుగ్వే.