దేశంలో బాగా పెరుగుతున్న కరోనా రికవరీ

కరోనా కేసులు పెరుగుతున్నా భారతదేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతూ ఉంది. ఇది ఆత్మస్థయిర్యాన్ని చ్చే వార్త.
ఎందుకంటే, భారతదేశంలో కరోనా కంటే కరోనా భయం బాగా వేగంగా వ్యాపించింది. వైరస్ కంటే  భయానికి ఎక్కువగా అంటుకునే స్వభావం ఉన్నట్లు చేసింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వవిధానాలు,  మీడియా  రెండుకలపి కరోనావైరస్  మీద జ్ఞానం కంటే భయం బాగా ప్రచారం చేశాయనిపిస్తుంది.
ఇలాంటపుడు కోవిడ్-19 తో ఆసుపత్రులలో  చేరి కోలుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరిగింది. ఇది 60.73  శాతానికి పెరిగిందని భారత ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దేశంలో కరోనా కేసుల దినసరి పెరుగుదల ఇపుడు  20 వేలు దాటింది. దీనితో మొత్తం కేసుల సంఖ్య 6,25, 544 కు చేరి భయపెడుతూ ఉంది. మరణించిన వారి సంఖ్య 18,213కు చేరింది.
అయితే, ఇదే సమయంలో తొందరగా జబ్బును గుర్తించి ట్రీట్ మెంట్ అందించడంతో జబ్బు నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య బాగా పెరుగుతున్నది.గత 24 గంటలలో కోలుకున్నవారి సంఖ్య 20,033. అంటే పాజిటివ్ కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందన్నమాట. ఇంతవరకు కోలుకున్న వారి  సంఖ్య 3,79,891కి చేరింది. ఇపుడు దేశం యాక్టివ్ కేసులు 2,27,439.
ఐసిఎం ఆర్ అందిస్తున్న సమాచారం ప్రకారం జూలై 2 దాకా 92,97,749 పరీక్షలు నిర్వహించారు. గురువారం నాడు 2,41,576 పరీక్షలు నిర్వహించారు. దేశంలో ఇపుడు 1,074 ల్యాబొరేటరీలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో 775 ప్రభుత్వ ల్యాబ్ లు , 299 ప్రయివేటుల్యాబ్ లు అని ఐసిఎం ఆర్ తెలిపింది.