GVK కృష్ణారెడ్డి, కొడుకు సంజయ్ రెడ్డి మీద సిబిఐ కేసు, వాళ్లేంచేశారంటే…

జివికె గ్రూప్  ఆఫ్ కంపెనీస్ కు చెందిన వెంకటకృష్ణారెడ్డి, కొడుకు  జివి సంజయ్ రెడ్డిల మీద సిబిఐ కేసు నమోదు చేసింది. సంజయ్ రెడ్డి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్  మేనేజింగ్  డైరెక్టర్. ఈ విమానాశ్రయం నడపడంలో  రు. 705 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు వాళ్ల మీద ఆరోణలు వచ్చాయి. ఎయిర్ పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ) జివికె ఎయిర్ పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్  లు  కలసి ఒక జాయింట్ వెంచర్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ను  ఏర్పాటు చేశాయి. ముంబై ఎయిర్ పోర్ట్ ఆధునీకరించేందుకు ఏర్పాటయిన సంస్థ ఇది. అయితే, విమానాశ్రయాన్ని నిర్వహించడంలో భాగస్వామికి నష్టం కలిగేలా జివికె అధినేతలు   నిధులు మళ్లించడం, ఇష్టాను సారం ఖర్చుచేయడం చేశారని, తమకు సంబంధించిన కంపెనీలకు బాగా లబ్ది చేకూర్చారని సిబిఐ ఆరోపిస్తున్నది.
 2006లో ఈ జాయింట్ వెంచర్ ఒప్పందం ఒప్పందం జరిగింది. అయితే, జాయింట్ వెంచర్ కంపెనీ ఎంచేసిందంటే, ఎఎఐ అధికారులతో కుమ్మక్కయి రకరకాల పేర్లతో జివికె గ్రూప్ జాయింట్ వెంచర్ నిధులను పక్కదారి మళ్లించింది.  బోగస్ పనులు సృష్టించి 2017-2018లో  వాటి కాంట్రాక్టులను 9 కంపెనీలకు కట్టబెట్టి   పూర్తి చేసినట్లు చూపి కంపెనీ రు. 310 కోట్లు నష్టం కలిగించినట్లు సిబిఐ ఆరోపిస్తున్నది.
అంతేకాదు,  రు. 395 కోట్ల జాయింట్ వెంచర్ రిజర్వు  నిధులను తమ కంపెనీలలో పెట్టబడులు పెట్టేందుకు మళ్లించినట్లు సిబిఐ ఆరోపిస్తున్నది.
 వీటి మీద విచారణ సిబిఐ విచారణ జరుపుతున్నది. అంతేకాదు,ముంబై ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్  సిబ్బందికి చెల్లింపులును ఖర్చులను బాగా పెంచి చూపించారని, ఈ జాయింట్ వెంచర్ తో సంబంధం లేని కంపెనీలకు కూడా మొత్తాలు చెల్లించారని, దీనితో ఎఎఐకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని సిబిఐ చెబుతూ ఉంది.
జివికె చేసిన అవకతవకల్లో మరకొటి: తమకు సంబంధించిన కంపెనీలతో ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఒప్పందాలేవో కుదుర్చుకోవడం, వాటిని అమలుచేయడంలో భాగంతా ఆకంపెనీల సిబ్బంది, వారి కుటుంబాల ఖర్చలుకు జాయింట్ వెంచర్ నిధులు వెచ్చించడం. కృష్ణారెడ్డి, సంజయ్ రెడ్డి తో పాటు మరొక తొమ్మిది కంపెనీల మీద,కొంతమంది అధికారుల మీద కూడా సిబిఐ కేసులు నమోదు చేసింది.