ఆంధ్రలో ప్రభుత్వ లాటరీ పునరుద్ధరణ? మళ్లీ చర్చ!

ఆంధ్రప్రదశ్ లో మళ్లీ లాటరీ ల చర్చ మొదలయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దయిన ధ్రప్రదేశ్ ప్రభుత్వ లాటరీని రద్దు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది.   పూర్వం రాష్ట ప్రభుత్వం ‘భాగ్యలక్ష్మి’ పేరుతో లాటరీ నడిపేది. ఈసారి ఇపుడున్న ఒరవడి తగ్గట్టు దానికి పేరు పెట్టే అవకాశాలున్నట్లుసమాచారం.
కేంద్రం నుంచి నిధుల విడుదల బాగా తగ్గిపోవడం,కరోనా లాక్ డౌన్ ఆర్థికార్యకలాపాలు స్థంభించిపోవడం,  జిఎస్ టి  అమలులోకి వచ్చాక నిధుల సమీకరణ మార్గాలు తగ్గిపోవడంతో దిక్కుతోచని జగన్ ప్రభుత్వం లాటరీని పునరుద్ధరిచాలని అనుకుంటున్నట్లు లైవ్ మింట్  రాసింది. రాష్ట్రంనిధుల సమీకరణ మార్గాలన్నింటిని అన్వేషిస్తూ ఉంటుందని,ఇందులో భాగంగా లాటరీ పునరుద్ధరణ గురించి ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో పన్నులు వసూలూ పడిపోయింది. ఇదే విధంగా కేంద్రం వనరులు తగ్గిపోవడంతో రాష్ట్రానికి రావలసిన నిధులు తగ్గిపోయాయి. దీనితో ఆంధ్రప్రదేశ్ చెంపదెబ్బ,గోడదెబ్బ రెండూతగిలాయి.  ఈమధ్య ఈ నిధుల కొరత ఎదుర్కొనేందుకే మద్యం మీద 75 శాతం పన్ను విధించింది. లాటరీ పునరుద్ధరణ గురించి సమాచారాన్ని ధృవీకరించుకునేందుకు ముఖ్యమంత్రి కార్యాలయాని చేసిన అభ్యర్థనలకు స్పందన లేదని కూడా లైవ్ మింట్ రాసింది.
రాష్ట్రంలో లాటరీలను పునరుద్ధరించాలన్ని ఆలోచన ఇపుడు కొత్తగా వచ్చింది కాదు. 2015లో తెలుగుదేశం ప్రభుత్నానికి నిధుల కొరత రావడంతో లాటరీలను పునరుద్ధరించడం ఒక మార్గమని భావించింది. లాటరీని ప్రారంభిస్తే ఏటా రాష్ట్రానికి రు. 12,000 కోట్ల దాకా రాబడి ఉంటుందని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భావించింది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రవేటులాటరీలను 1968 లో ఒక చట్టం తీసుకువచ్చి రద్దు చేశారు. Andhra Pradesh Lotteries Act, 1968 ఈ చట్టం ప్రకారంరాష్ట్రంలో ఆన్ లైన్ లాటరీలను ప్రారంభించే అవకాశం లేదు. ఈచట్టాన్ని ఆధారం చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం రాయల్ భూటాన్ ప్రభుత్వం లాటరీలను నిషేధించింది.
తర్వాత ప్రభుత్వం తనే ఒక లాటరీని  భాగ్యలక్ష్మి లాటరీని తీసుకువచ్చింది. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగ్యలక్ష్మిలాటరీని  1987 మార్చి ఒకటో తేదీనుంచినిలిపివేసింది. దీనిమీద బద్దం బాల్ రెడ్డి, వి .శ్రీరాములు,  సిహెచ విద్యాసాగర్ రావులు అడిగిన ఒకప్రశ్నకు సమాధానమిస్తూ అప్పటి ఆర్థికమంత్రి ప్రటించారు.  రాష్ట్ర ప్రభుత్వానికి దీని వల్ల వస్తున్న ఆదాయం ఏమంతగా లేదని ఆర్థిక మంత్రి 1987డిసెంబర్ 18న  సమధానామిచ్చారు. (Source: AP Assembly debates)

 

 

నిజానికి భూటాన్ లాటరీటికెట్లను భారత-భూటాన్ మధ్య కుదిరిన ఒక వాణిజ్య ప్రకారం భారత్ భూ
భాగంలో విక్రయించవచ్చు. అయితే, ఇదొక దురలవాటు అని, ఆంధ్రప్రదేశ్ లో అనుమతించేదిలేదని ప్రభుత్వం రద్దు చేసింది.రాయల్ భూటాన్ లాటరీ స్టాకిస్టు దీనిని చాలెంజ్ చేశారు. హైకోర్టు కు వెళ్లారు. పిటిషనర్ల వాదనను కొట్టివేసి రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని హైకోర్టు జస్టిస్ బిఎస్ రెడ్డి బెంచ్ (Sanjay Jayantilal & Co. And … vs Government Of Andhra Pradesh, … on 15 March, 1999) కొట్టి వేసింది.
మొదట్లో ఏడాదికి రెండుసార్లు మాత్రమే డ్రా తీసేవారు. తర్వాత  1970-71లో 11 డ్రాలకు పెంచారు. 1973-74లో 24 డ్రాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో చట్టవ్యతిరేక గ్యాంబ్లింగ్ చాలా ఎక్కువ. పేకాట గ్యాంబ్లింగ్ డెన్స్ రాష్ట్రంలోకోస్తాలో చాలాఎక్కువ అని చెబుతారు. రాష్ట్రంలో నిషేధం ఉన్నందున చాలా మంది చెన్నై దాకా వెళ్లి పేకాడుతుంటారని చెబుతారు. పోలీసుల జరిపిన దాడులలో మహిళలు కూడా గ్యాంబ్లింగ్ డెన్ లు నిర్వహిస్తున్నట్లు వెల్లడయింది. లాటరీలను ప్రారంభించడం వల్ల దీనికి కొంతవరకు చెక్ పెట్టవచ్చని ప్రభుత్వంలో ఆలోచన ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే, సమాజంలో మాత్రం లాటరీలను ఒక దురలవాటుగానే భావిస్తున్నారు. ఒక వైపు మద్యపానం దురలవాటు మాన్పించేందుకు చర్యలంటూ ఇంకొక వైపు లాటరీలను ప్రారంభించడం ఎలాంటి విమర్శలకు తావిస్తుందోననే చర్చకూడా ప్రభుత్వం సాగుతూ ఉందని తెలిసింది.
2015 లో సుప్రీంకోర్టు ఆన్ లైన్  లాటరీలను నిషేధించింది. ఆన్ లైన్ లాటరీ ఫలితాలను తారు మారు చేయవచ్చనిచెబుతూ కేరళ  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఆన్ లైట్ లాటరీలు సాధారణంగా జరిగే గ్యాంబ్లింగ్ కంటే చాలా ప్రమాదమయినదని,  గ్యాంబ్లింగ్ కొద్ది మంది వ్యక్తులే నష్టపోతారని, కాని ఆన్ లైన్ లాటరీలు ప్రభావం సమాజంలోని అన్ని వర్గాల మీద పడుతుందని జస్టిస్ దత్తు నాయకత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల వాటిని నిషేధించే  హక్కు రాష్ట్రాలకు ఉందని స్పష్టం చేసింది.  దేశమంతా నిషేధం లేదు. ఇపుడు చిన్న పెద్ద రాష్ట్రాలతోకలిపి 13 రాష్ట్రాలలో లాటరీలు నడుస్తున్నాయి. అవి: కేరళ, గోవా, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, పంజాబ్, పశ్ఛిమబెంగాల్, అస్సాం,అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, సిక్కిం, నాగాలండ్,మిజోరం లు.