ఆంధ్రప్రదశ్ లో మళ్లీ లాటరీ ల చర్చ మొదలయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దయిన ధ్రప్రదేశ్ ప్రభుత్వ లాటరీని రద్దు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది. పూర్వం రాష్ట ప్రభుత్వం ‘భాగ్యలక్ష్మి’ పేరుతో లాటరీ నడిపేది. ఈసారి ఇపుడున్న ఒరవడి తగ్గట్టు దానికి పేరు పెట్టే అవకాశాలున్నట్లుసమాచారం.
కేంద్రం నుంచి నిధుల విడుదల బాగా తగ్గిపోవడం,కరోనా లాక్ డౌన్ ఆర్థికార్యకలాపాలు స్థంభించిపోవడం, జిఎస్ టి అమలులోకి వచ్చాక నిధుల సమీకరణ మార్గాలు తగ్గిపోవడంతో దిక్కుతోచని జగన్ ప్రభుత్వం లాటరీని పునరుద్ధరిచాలని అనుకుంటున్నట్లు లైవ్ మింట్ రాసింది. రాష్ట్రంనిధుల సమీకరణ మార్గాలన్నింటిని అన్వేషిస్తూ ఉంటుందని,ఇందులో భాగంగా లాటరీ పునరుద్ధరణ గురించి ఆలోచిస్తున్నారు. రాష్ట్రంలో పన్నులు వసూలూ పడిపోయింది. ఇదే విధంగా కేంద్రం వనరులు తగ్గిపోవడంతో రాష్ట్రానికి రావలసిన నిధులు తగ్గిపోయాయి. దీనితో ఆంధ్రప్రదేశ్ చెంపదెబ్బ,గోడదెబ్బ రెండూతగిలాయి. ఈమధ్య ఈ నిధుల కొరత ఎదుర్కొనేందుకే మద్యం మీద 75 శాతం పన్ను విధించింది. లాటరీ పునరుద్ధరణ గురించి సమాచారాన్ని ధృవీకరించుకునేందుకు ముఖ్యమంత్రి కార్యాలయాని చేసిన అభ్యర్థనలకు స్పందన లేదని కూడా లైవ్ మింట్ రాసింది.
రాష్ట్రంలో లాటరీలను పునరుద్ధరించాలన్ని ఆలోచన ఇపుడు కొత్తగా వచ్చింది కాదు. 2015లో తెలుగుదేశం ప్రభుత్నానికి నిధుల కొరత రావడంతో లాటరీలను పునరుద్ధరించడం ఒక మార్గమని భావించింది. లాటరీని ప్రారంభిస్తే ఏటా రాష్ట్రానికి రు. 12,000 కోట్ల దాకా రాబడి ఉంటుందని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భావించింది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రవేటులాటరీలను 1968 లో ఒక చట్టం తీసుకువచ్చి రద్దు చేశారు. Andhra Pradesh Lotteries Act, 1968 ఈ చట్టం ప్రకారంరాష్ట్రంలో ఆన్ లైన్ లాటరీలను ప్రారంభించే అవకాశం లేదు. ఈచట్టాన్ని ఆధారం చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం రాయల్ భూటాన్ ప్రభుత్వం లాటరీలను నిషేధించింది.
తర్వాత ప్రభుత్వం తనే ఒక లాటరీని భాగ్యలక్ష్మి లాటరీని తీసుకువచ్చింది. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగ్యలక్ష్మిలాటరీని 1987 మార్చి ఒకటో తేదీనుంచినిలిపివేసింది. దీనిమీద బద్దం బాల్ రెడ్డి, వి .శ్రీరాములు, సిహెచ విద్యాసాగర్ రావులు అడిగిన ఒకప్రశ్నకు సమాధానమిస్తూ అప్పటి ఆర్థికమంత్రి ప్రటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి దీని వల్ల వస్తున్న ఆదాయం ఏమంతగా లేదని ఆర్థిక మంత్రి 1987డిసెంబర్ 18న సమధానామిచ్చారు. (Source: AP Assembly debates)