అనంతపురంలో పెట్రోలు, డిజిల్ ధరలు రెగ్యులర్ పెంచుతూ పోతుండటాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఖండించింది. ఇది మోసమని, ప్రజలను పెట్రోలు ధరలతో పీక్కుతింటున్నారని పిసిసి అధ్యక్షుడు డాక్టర్ శైలజానాథ్ విమర్శంచారు. ధరలను తగ్గించాలని, పేద మధ్య తరగతి ప్రజలు మీద ఆర్థిక భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ టూవీలర్ వాహనాన్ని ఇలా కూరగాయల బండిమీద ఊరేగిస్తూ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. దీనికి ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాధ్ నాయకత్వం వహించారు.
దేశంలో 22 రోజు లుగా ప్రతిరోజూ పెరుగుతున్న పెట్రోలు డిజిల్ ధరలు వెంటనే తగ్గించాలని నినాదాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు అనంతపురం వీథుల్లో తిరిగారు. ప్రధాని మన్కీబాత్ లో కాదు ప్రజలతో మాట్లాడాలని శైలజానాధ్ అన్నారు.
పరిపాలన అంటే ప్రజలు అని తెలుసుకో వాలన్నారు.ప్రజల బాధలు తెలుసుకో వాలన్నారు.కరోనా , లాక్ డౌన్ లతో ఆదాయాలు కో ల్పొయి కష్టాల్లో ఉన్న వారు పెట్రోలు డిజిల్ ధరలు పెరగడంతో నిత్యావసరాల ధరలు పెరిగడంతొ అల్లాడుతున్నారన్నారు. ఇప్పటివరకూ 200లక్షలకొట్లు పెట్రోలు డిజిల్ ధరలు పెంచడం ద్వారా వసూళ్లు చేశారన్నారు. ఈ డబ్బులు ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు.
అంతర్జాతీయ ముడి చముడరు (క్రూడాయిల్ ) ధరలు 20 డాలర్లకు పడిపోతే, భారత్ లో మాత్రం ఎక్స్ యిజ్ సుంకం, వ్యాట్ తగ్గించకండా పెంచి, పెట్రోలు ధరలు పెరిగేలా చేసి ప్రభుత్వాలు ముక్కు పిండివసూలు చేసుకుంటున్నాయని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.
బిజెపి ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నది ఇప్పటికే రవాణారంగం కుదేలైందన్నారని ధరలు పెంచడం మానకొనకపోతే, ప్రజలు రోడ్ల మీదకు వస్తారని వారు హెచ్చరించారు.