ఆదోని: కర్నూలు జిల్లా ఆదోనిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఈ రోజు ఆదోని లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు కు అవసరమయిన స్థలాన్ని పరిశీలించారు.
డిప్యూటీ సిఎం వెంట మంత్రులు బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, ఆదోని శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వీర పాండ్య న్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఉన్నారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ఉద్దేశం ప్రకారం కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన అదోనిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలన్న మహదాశయం ఈ కాలేజీల ఏర్పాటు వెనక ఉన్నదని డిప్యూటీ సిఎం నానిచెప్పారు.
డిప్యూటీ సింఎం ఇంకా ఏమన్నారంటే…
‘రానున్న 3సంవత్సరాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన. ఈ కాలేజీల ఏర్పాటుతో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు మొదలవుతాయి. వైద్య రంగం అభివృద్ధికి 16వేల కోట్లు రూపాయలు కేటాయించడం జరిగింది. దీనితో పాటు భోధన హాస్పిటల్స్ లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రములో ప్రస్తుతం ఉన్న 11ప్రభుత్వ మెడికల్ కాలేజీ లకు అధనంగా మరో 16మెడికల్ కాలేజీ లు ఏర్పాటు చేస్తున్నాం. ఆగష్టు లో టెండర్లు పిలవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
రాష్ట్రము లో కరోనా నివారణకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు చేపట్టాం. రాష్ట్రములో ప్రతి కుటుంబానికి 90రోజులలో సమగ్ర స్క్రీనింగ్, పరీక్షలు నిర్వహణకు ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి క్షేత్ర స్థాయి చర్యలు చేపట్టాలని అదేశించారు. ప్రతి నెలలో కనీసం ఒకసారి గ్రామాలలో 104ద్వారా వైద్య సేవలు అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 60సంవత్సరాలు,పై బడ్డ వారిని, అలాగే 40ఏళ్ళు దాటి దీర్ఖకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికీ కరోనా టెస్ట్ ల్లో ప్రాధాన్యత ఇస్తున్నాo.
కరోనా మరణాలు తగ్గించడానికి ఈ విధానాన్ని అమలుచేస్తున్నాం. కరోనా పై ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించడం ద్వారా వ్యాధిని నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. జులై 1న రాష్ట్ర వ్యాప్తంగా 104, 108 వాహనాలు 1016 దాకా అందుబాటులోకి రానున్నాయి. ప్రతి మండలానికి 104వాహనాన్ని అందించి కరోనా నిర్దరనకు శాంపిల్స్ సేకరించే సదుపాయం వాహనాలలో కల్పించాలని నిర్ణయం.
పట్టణ ప్రాంతాలలో జనాభా ను దృష్టిలో పెట్టుకొని అర్బన్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్నయించింది.