ఈ మహామర్రి చరిత్ర ఇదే…

మొన్నటి ప్రశ్న
ప్రపంచంలో అత్యంత విశాలమయిన మర్రి చెట్టు ఇది. వయసు 250 సం. విస్తీర్ణం 330 మీ. ఇదెక్కడుంది?
నేడు జవాబు : కొల్ కతా
వివరణ : ఈ మర్రిచెట్టు కోల్ కతా సమీపంలోని శిబ్ పూర్ లో ఉన్న ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానిక్ గార్డెన్స్ లో ఉంది.
ఈ తోటకి ఈ మహామర్రి (Ficus Benghalensis)యే చిహ్నం. ప్రపంచంలో అత్యంత విశాలమయిన మర్రి చెట్టు ఇది. వయసు 250 సం. విస్తీర్ణం 330 మీటర్లు.
ఈ గార్డెన్ ని బ్రిటిస్ ఈస్టిండియా కంపెనీకి చెందిన కర్నల్ రాబర్ట్హ కైడ్ (Col Robert Kyd) 1787 లో ఏర్పాటుచేశారు.
మొదట్లో ఈ ఉద్యాన వనాన్ని బాగా కమర్షియల్ విలువ ఉన్న టేకు, మహగొని,రబ్బర్ , అపుడే చైనానుంచి పరిచయమయిన టీ తోటలను పెంచేందుకు ఉద్దేశించారు. తర్వాత దీనిని సుమారు 2,50,000 వేల రకాల మొక్కలు పెంచే హర్బేరియంగా మార్చారు.
తేయాకు పంటని భారతదేశంలో వ్యాప్తి చేసింది ఈ తోటయే.1860 దశాబ్దంలో ఈ తోటలో సింకోనా  (Cinchona Officinalis, family: Rubiaceae) చెట్ల పెంకపకం మొదలు పెట్టారు. ఆరోజుకి వాళ్లకి తెలుసోతెలియదో కాని, తర్వాత ఈ చెట్టుబెరడు నుంచి మలేరియా మందు క్వినైన్ తయారయింది.
వేలాది రకాల చెట్ల పచ్చదనంతో, వాటి ఆకుల కొమ్మల, రెమ్మల  సవ్వడితో,  వాటి మీద నివసించే పక్షల కిలకిలారావాలతో, రకరకాల జంతువుల సంచారాలతో బయోడైవర్సిటీ విశ్వరూపం ఈ ఉద్యానవనంలో చూడవచ్చు.
మొదట్లో దీనిని కంపెనీ బాగన్ (Company Bagan) అని పిలిచేవారు. తర్వాత ఇదే ఇండియన్ బొటానిక్ గార్డెన్ ఆపైన  కలకత్తా బొటానిక్ గార్డెన్ అయింది. ఆ తర్వాత 2009లో  ప్రఖ్యాత వృక్ష భౌతిక  శాస్త్రవేత్త సర్ జగదీష్ చంద్రబోస్ గౌరవార్థం ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానిక్ గార్డెన్  అని దీనికి పేరు మార్చారు.

BEST OF LUCK

Like this post? Please share it with friends!