భక్తుల్లేకుండా సాగిన పూరీ రథయాత్ర

ప్రపంచంలోనే అతిపెద్ద రథోత్సం పూరీ జగన్నాథ రథోత్సవం భక్తుల్లేకుండడా సాగింది. కరోనా కారణంగా ప్రజలెవరూ రాకుండా కర్ఫ్యూ విధించారు. ఫలితంగా దాదాపు ఎలాంటి సంరంభం లేకుండా నిశబ్దంగా మొదలయింది. వ్యాపిస్తున్న కరోనా కారణంగా మొదట నిషేధం విధించినా తర్వాత, భక్తుల వత్తిడితో సుప్రీంకోర్టు నిషేధాన్ని ఎత్తి వేసి , యాత్రను కరోనా ప్రోటోకోల్ మేరకు జరపేందుకు చర్యలు తీసుకోవాలని ఒదిషా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఈ జగన్నాధుడు,బలభద్రుడు, సుభద్రల రథయాత్ర మొదలయింది. ఆలయ పురోహితులు, సెక్యూరిటీ సిబ్బంది, కొంతమంది అధికారులు తప్ప యాత్రలోకి భక్తులెవరని అనుమతించలేదు.
సాధారణంగా పది నుంచి పన్నెండు లక్షల మంది ప్రపంచనలుమూల లనుంచి వచ్చి ఈ యాత్రను తిలకిస్తుంటారు. అయితే, రథయాత్ర లైవ్ ప్రసారాన్ని కోట్లాది మంది తిలకించారు.
ఈ ఉత్సవాలు తొమ్మిదిరోజులు పాటు సాగుతాయి. ఈ రోజు తొలిరోజున జగన్నాథ సోదరుడు సోదరి గుండిచా ఆలయానికి చేరుకుంటారు.