జగన్నాథ రథయాత్ర ఆపడం మంచిదికాదు: శంకరాచార్య

కరోనా వైరస్ సాకుగా పూరీ జగన్నాధుని రథయాత్రను అడ్డుకునేందుకు ఒక ప్రయత్నం జరుగుతూ ఉందని పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి వ్యాఖ్యానించారు.
జూన్23న ప్రారంభం కావలసిన రథయాత్రను సుప్రీంకోర్టు ద్వారా నిలిపివేయించినందుకు ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
రథయాత్రను నిలిపివేస్తూ జూన్ 18న సుప్రీకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని అనేక సంస్థలు వ్యతిరేకించాయి. కోర్టు తన నిర్ణయాన్ని సమీక్షించి కోవిడ్ అంక్షలు అమలుచేస్తూనే రథయాత్రను నిర్వహించేందుకు అనుమతించాలని ఈ సంఘాలు వేసిన పిటిషన్ రేపుకోర్టు పరిశీలనకు వస్తున్నాయి. తాజాగా బిజెపినాయకుడు సంబిత్ పాత్ర కూడా ఒక పిటిషన్ వేశారు.

https://trendingtelugunews.com/english/features/muslim-devotee-aftab-hossen-petition-in-supreme-court-for-conduct-of-puri-rath-yatra/

‘పూరి రథయాత్రను అడ్డుకోవడం సరికాదు. దేవతలు రథమెక్కేందుకు సుప్రీంకోర్టు అనుమతించాలి. కావాలంటే పూరీలో ప్రజలెవరూ గుమికూడ కుండ ఆంక్షలు విధించవచ్చు. రథోత్సవాన్ని లైవ్ ప్రసారం చేయవచ్చు, ’ అని శంకరాచార్య సూచించారు.