ముఖ్య మంత్రి అవ్వడం కోసం ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రత్యేక హోదా అంశాన్ని రాజకీయంగా అన్ని విధాలుగా వాడుకున్న జగన్ ముఖ్య మంత్రి అయ్యాక హోదాని పూర్తి గా మర్చిపోయారు.
నాకు ముఖ్య మంత్రి హోదా వచ్చింది..ఇక రాస్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే ఎంటీ, రాకపోతే నాకేంటి అన్నట్లు జగన్ వ్యహరించటం సిగ్గుచేటు. ప్రతిపక్షంలో ఉన్నపుడు హోదా మన హక్కు,ఎందుకు ఇవ్వరు?ఇవ్వడం కేంద్రం భాధ్యత.హోదా ఇవ్వకపోతే చేతులు కట్టుకుంటామా ? దేబిరిస్తామా ?దేబిరించే,చేతులు కట్టుకొని కూర్చునే జాతేనా తెలుగుజాతి అంటూ అనేక వేధికల పై గంభీర ప్రసంగాలు చేసిన జగన్ ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదు ?
25 మంది ఎంపిలను ఇస్తే కే0ద్ర0 మెడలు వంచి హోదా తెస్తా అన్న జగన్ నేడు ప్రధాని ముందు కనీసం తన మెడలు ఎత్తి హోదా అనే పదం కూడా పలకలేని స్తితి లో ఎందుకు ఉన్నారు? మీ 30 మంది ఎంపీ ల వల్ల రాష్ట్రానికి ఉపయెగమెంటి? రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి పార్లమెంటులో ఎంపిలు ఏనాడైనా మాట్లాడారా? ఏడాది కాల0లో కే0 ద్ర0 నుంచి ఏ0 సాధించారు? ఒక్క ప్రా జెక్టు అయినా తెచ్చారా లేక కనీసం ఒక్క కిలోమీటర్ రోడ్డు అయినా వేశారా?
ఒక పక్కన హోదా ముగిసిన అధ్యాయం అని బిజెపి నాయకులు మాట్లాడుతున్నా దాని పై ఎందుకు మాట్లాడరు? హోదా కోసం కేంద్రం పై ఎందుకు పోరాటం చేయడం లేదు?ప్రత్యేక హోదా వస్తే 13 జిల్లాలలో వున్న ప్రతి పట్టణo మరొక హైదారాబాద్ అవుతుందని ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చారు.
హోదా వస్తే పెట్టుబడులు భారీగా వస్తాయి,ప్రరిశ్రమలు వస్తాయని పెద్ద ఎత్తున ఉధ్యోగాలు వస్తాయని ఆశపడిన యువత దగా పడింది. హోదా రాకుండా మీ ముఖారవిందం చూసి పెట్టుబడులు వస్తాయా అని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి వెటకారాలు చేశారు.మరి ఈ రోజు ప్రత్యేక హోదా లేకుండా ఎవరి ముఖారవిందం చూసి పెట్టుబడులు పెడతారు? ప్రతిపక్షంలో వున్నప్పుడు హోదాపై చెప్పిన మాటలకు కట్టుబడి వుంటే హోదా మా హక్కు అని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా ఎందుకు మాట్లాడరు? గట్టిగా నిలదీస్తే తన ఆర్ధికనేరాల కేసుల విచారణ స్పీడు అవుతుందన్నభంయంతో చేతులు కట్టు కుంటున్నారా?
(కిమిడి కళా వెంకట్రావు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ )