ఏపీ ప్రభుత్వంపై స్టే ట్ ఎలెక్షన్ కమిషన్ చీఫ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రేపు కోర్టు ధిక్కార పిటిషన్ వేయనున్నారా? ఈ మేరకు రేపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారని ఆయన తరఫున్యాయవాది జంద్యాల రవిశంకర్ సూచన ప్రాయంగా వెల్లడించారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కారణంగా రమేష్ కుమార్ పదవికాలం అర్ధాంతరంగా ముగిసింది. అయితే, ఈ ఆర్డినెన్స్ చెల్లదని హైకోర్టు కొట్టి వేసింది. అందువల్ల రమేష్ కుమార్ ఆటోమేటిక్ గా పునర్నియమితులయ్యారు. అయితే, దీనికి కోర్టు ఉత్త్వర్వులను అమలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయన ను విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులీయాలి.ఇవ్వలేదు. తర్వాత హైకోర్టు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూ హైకోర్టు ఉత్తర్వుల మీద స్టే కోరింది. స్టే రాలేదు. అందువల్ల ఆయనను తప్పనిసరిగా ఆ పదవిబాధ్యతలు స్వీకరించేందుకు ఉత్తర్వులీయాలి.
ఇలా ఉత్తర్వులీయనందుకు ఆయన ప్రభుత్వం మీద కోర్టు ధిక్కారం పిటిషన్ వేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం పై రమేష్ కుమార్ ధిక్కార పిటిషన్ వేస్తారా అని సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ట్వీట్ చేశారు.
కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం రేపటిలోగా అమలు చేస్తుందా..? అంటూ జంధ్యాల రవిశంకర్ ట్వీట్
Is @Nimmagadda #SECAP filing @contempt against #StateofAP and @chiefsecretaryAP tomorrow!? Are they going to implement court order by tomorrow?@GovernmentAp @governorap @ysjagan @tv5newsnow @TV9Telugu @NtvTeluguLive @hmtvnewslive @bbcnewstelugu @abntelugutv @etvandhraprades
— Ravi Shankar Jandhyala (@RaviSha64106690) June 21, 2020