శుభవార్త, కరోనాకు ఇండియాలో మందొచ్చింది, మాత్ర ధర రు.103

భారతదేశ మార్కెట్లోకి మొట్టమొదటి కోవిడ్ మందు విడుదలవుతూ ఉంది. ఇది యాంటివైరల్ మందు ఫ్యావిపిరవిర్ (Favipiravir) గా జపాన్ లో వాడుతున్నదే. దీనినే  ఫ్యాబిఫ్లూ (FabiFlu) బ్రాండ్ నేమ్ తో ఇండియా మార్కెట్లో విడుదల చేయబోతున్నారు.
చాలా తొందర్లోనే తయారయి మార్కెట్లలోకి వస్తున్నది. ఇండియాలో ఈ మందును గ్లెన్ మార్క్ ఫార్మష్యూటికల్స్ కంపెనీ తయారు చేస్తున్నది. అయితే, దీనికీ లిమిటేషన్స్ ఉన్నాయి. మైల్డ్ నుంచి మాడరేట్  కోవిడ్ -19 ఉన్న పేషంట్లలో ట్రీట్ మెంట్ కు మాత్రమే ఇది పనిచేస్తుందని తయారీ దారులు చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఈ మందు నోట తీసుకునే మాత్రల రూపంలో అందుబాటులోకి వస్తున్నది. కాబట్టి ఇతర వైద్యపద్ధతులకంటే సుళువుగా ఉంటుంది.
ఎలా పనిచేస్తుంది?
Favipiravir అనే యాంటి వైరల్ డ్రగ్ ని జపాన్ లో నాలుగయిదు సంవత్సరాలుగా వాడుతున్నారు. ఇన్ ఫ్లుయంజాకు విరుగుడుగా దీనిని ప్రధానంగా వాడుతున్నారు.ఇది RNA polymerase ను అడ్డుకుంటుంది.  వైరస్ పునురుత్పత్తి (Replication) కి RNA polymerase చాలా అవసరం. దీనిని అడ్డుకోవడమంటే వైరస్ సంఖ్య పెరగకుండాచూడటం. అంటే రోగి మీద వైరస్ లోడ్ తగ్గిపోయి ఉపిరాడని పరిస్థితి రాకుండా ఉంటుంది. Favipiravir మాలెక్యులార్ ఫార్ములా C5H4FN3O2.    (6-fluoro-3-oxo-3,4- dihydropyrazine-2-carboxamide). దీనిని మొదట తయారు చేసిన కంపెనీ జపాన్ కు చెందిన తయామ కెమికల్ కంపెనీ లిమిటెడ్ (Toyama Chemical Company Limited).
Favipiravir is a pyrazinecarboxamide derivative with activity against RNA viruses. Favipiravir is converted to the ribofuranosyltriphosphate derivative by host enzymes and selectively inhibits the influenza viral RNA-dependent RNA polymerase, అని ఇది పనిచేసే తీరుగురించి pubchem రాసింది.
రష్యాలో కూడా ఆమోదం
ఇదే మందుకు రష్యా కూడా జూన్ మొదటి వారంలో ఆమోదం తెలిపింది. జపాన్ లో మంచిఫలితాలురావడం, అమెరికాలో కూడా క్లినికల్ ట్రయల్స్ తో ఉండటంతో రష్యా ఆరోగ్య శాఖ కూడా Favipiravir  కరోనా మందుగా వాడేందుకు ఆమోదం తెలిపింది. అక్కడ  Avifavir గా అక్కడ అందుబాటులోకి వస్తుంది.
భారతదేశానికి  కొంత ఉపశమనం
ముంబాయికి ఈ కంపెనీకి ఈ మందు తయారుచేసేందుకు,మార్కెట్ చేసేందుకు శుక్రవారంనాడు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DGCA) అనుమతినిచ్చింది. దేశంలో కరోనా కేసులు బాగా పెరుగుతున్న సమయంలో, ప్రజలంతా ఏదోఒక మందో మాకో తొందరగా వస్తే బాగుంటుందని ఎదురుచూస్తున్న సమయంలో ఫ్యాబిఫ్లు మార్కెట్లోకి వస్తున్నది. సకాలంలో భారతదేశంలో కోవిడ్ బారిన పడినవారిక ఉపశమనంకల్గించేలా ఈ మందు అందుబాటులోకి వస్తున్నదని ఈ కంపెనీ సిఎండి గ్లెన్ సల్తానా చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ మోడరేట్ కోవిడ్ పేషంట్ల మీద ప్రయోగించినపుడు మంచి ఫలితాలువచ్చాయని కూడా ఆయన చెప్పారని హిందూస్తాన్ టైమ్స్ రాసింది.
ధరఎంతో తెలుసా?
ఈమాత్రలు సులభంగా అందరికి అందుబాటులోకి వచ్చేందుకు కంపెనీ ప్రభుత్వం, ఆసుప్రతులతో కలసి పనిచేస్తుందని చెబుతూ ఒక మాత్ర ధర రు. 103 రుపాయలంటుందన సల్దానా చెప్పారు. రోజుకు రెండు సార్లలో మొత్తం 1800 మిల్లీ గ్రాముల మాత్రలు 14 రోజుల పాటు తీసుకోవలసి ఉంటుంది. షుగర్, బిపి, గుండె జబ్బుల వంటి కోమార్బిటీస్ ఉన్న కరోనా రోగులు కూడా ఈ మాత్రలు తీసుకోవచ్చు.
ప్రభావం
ఈ మాత్రం ప్రభావం నాలుగురోజుల్లోనే తెలిసిపోతుంది. నాలుగురోజుల్లోనే శరీరంలో కరోనా లోడ్ తగ్గుతుంది. తర్వాత రోగలక్షణాల నుంచి రోగి మెరుగుపడతాడు. మైల్డ్ నుంచి మాడరేట్ కోవిడ్ -19 రోగులలో ఈ మందును ప్రయోగించినపుడు 88 శాతం రోగులలో మంచిఫలితాలు కనిపించాయి. ఈ మందును గ్లెన్ మార్క్ సొంత ఆర్ అండ్ డి ల్యాబ్ లలోనే రూపొందించారని చెబుతున్నారు. దీనిని రూపొందించాక  క్లినికల్ ట్రయల్స్ కి డిజిసిఎకి దరఖాస్తు చేశారు. ఆపైన మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కి అనుమతిపొందారు. ఇలా ఈ దశ దాకా వచ్చి మొట్టమొదటి భారతదేశపు కంపెనీ గ్లెన్ మార్క్ గుర్తింపు పొందింది.
నిజానికి ఇది కూడా సరికొత్త మందేమీ కాదు. Favpiravir 2014 నుంచే నావెల్, కొన్నిరకాల ఇన్ ఫ్లుయంజా వైరస్ దాడికి వాడుతూనే ఉన్నారు. గత నెలలో తాను రెండు రకాల యాంటివైరల్ Favipiravir, Umifenovir లను కలిపి ఆసుప్రతులలో మాడరేట్ కోవిడ్-19రోగుల్లో వాడి పరీక్షిస్తున్నట్లు గ్లెన్ మార్క్ ప్రకటించింది. ఇవన్నీ మంచిఫలితాలు ఇవ్వడంతో ఇపుడిది తయారీ దశకు చేరుకుంది.
యాంటివైరల్ యాంటిబ్యాక్టిరియల్ డ్రగ్స్ కి తేడా
Dr Ragahava Gundavarapu
యాంటి వైరల్ డ్రగ్ Favipiravir పనితీరు ఇతర యాంటి వైరల్ డగ్ర్ తో పోల్చడానికి వీల్లేదని, యాంటివైరల్ డ్రగ్స్  యాంటి బ్యాక్టిరియల్ డ్రగ్స్ లాగా సమర్థవంతంగా పనిచేయవని గ్లెన్ మార్క్ ప్రకటనకు స్పందిస్తూ ఒంగోలు కు చెందిన ప్రముఖ డాక్టర్ రాఘవ గుండవరపు వ్యాఖ్యానించారు.
యాంటివైరల్ డ్రగ్స్ నిదానంగా పునరుత్పత్తి అయ్యే వైరస్ ల విషయంలో బాాగా పనిచేస్తాయని ఆయన చెప్పారు. హెచ్ ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి వైరస్ ఈ కోవలోకి వచ్చే వైరస్ లని అంటూ  వ్యాక్సిన్ క్యూర్ ఈ వైరస్ లలో ఎక్కువగా ఉందని డాక్టర్ రాఘవ ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్ ’కు చెప్పారు.
అయితే, కోవిడ్ వైరస్   ఫ్లూ వైరస్ లాంటి స్లో రెప్లికేటింగ్ వైరస్  కాదు,  అది  చాలా ఫాస్ట్ గా రెప్లికేట్ అవుతుందని ఆయన చెప్పారు.
 ఈకార ణం వల్లనే యాంటి వైరల్ డ్రగ్స్  కోవిడ్ విషయంలో సమర్థవంతంగా పనిచేస్తాయని అనుకోలేమని ఆయన అన్నారు.  కోవిడ్ -19 విషయంలో Favipiravir అద్భుతాలు సృష్టిస్తుందనుకుని ఇతర నివారణ పద్ధతులను నిర్లక్ష్యం చేయవద్దని డాక్టర్ రాఘవ హెచ్చరిస్తున్నారు.
భౌతిక దూరం పాటించడం,మాస్క్ ధరించడం, శానిటైజర్ వినియోగించడం కరోనాను దూరంగా పెట్టెందుకు ఎప్పటికి సమర్థవంతమయి పద్ధతులని ఆయన చెప్పారు.
Anti- Virals are different from Anti-Bacterials. Anti-Bacterials have definitive action and the cure rate is excellent. Anti-Virals are effective for the slow replicating viruses, like HIV, Hepatitis B, hepatitis C. So definitive treatment, with a high cure rate is found for these viruses.
All the flu viruses are fast replicating virus and the antiviral effect of the drugs is not as effective as against the slow replicating ones.
Favipiravir is the new drug approved for COVID 19. Don’t expect wonders. Still, physical distancing, face mask, and hand wash are the most effective ways of fighting the pandemic: Dr Raghava Gundavarapu