కౌన్సిల్ లో గొడవలకు కారణం లోకేషే: మంత్రి వెల్లంపల్లి

తాడేపల్లి : ఆంధ్ర ప్రదేశ్ శాసన  మండలిలో నిన్న జరిగిన దాడులకు గొడవకు ప్రధాన కారణం నారా లోకేశ్‌ చౌదరునని  దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కౌన్సిల్ లో జరిగిన సంఘటనల మీధ ఆయన ఈ రోజు వివరణ ఇచ్చారు.
 రాష్ట్ర ప్రజలు లోకేశ్‌ను తిరస్కరించారని, ఆయనని ఓడించారని రాష్ట్ర ప్రజలపై టీడీపీ నేతలు కక్ష కట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
అసలు లోకేశ్ ప్రవర్తన చూస్తుంటే మండలికి వెళ్లాలేని  పరిస్థితి ఏర్పడిందని  ప్రతిదీ సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి లోకేష్  బయటకు పంపిస్తున్నారని ఆయన అన్నారు. అదేంటని ప్రశ్నిస్తే  చంద్రబాబు కొడుకు నని కార్డు వాడుకుంటాడని మంత్రి అన్నారు.
సభలో   వీడియోలు రికార్డ్‌ చేయొద్దని డిప్యూటీ ఛైర్మన్ సైతం చెప్పారు. అయినా లోకేశ్ ఆగకపోతే రికార్డు చేయవద్దని చెప్పేందుకు నేను వెళ్లాను.  అలా వెళ్లిన నామీద ఇతర మంత్రులపై టీడీపీ వారు  దాడి చేశారు, అని ఆయన ఆరోపించారు.
వెల్లంపల్లి ఇంకా ఏమన్నారంటే…
‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ కి కుమారుడు లోకేశ్. మంగళగిరిలో ఓటమి చెందాడు. రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయి గతంలో మంత్రి అయ్యారు.  డి శాసనసభ, మండలికి రూల్స్‌ ఉంటాయి. అవి పాటించకుండా టీడీపీని ఓడించారని ప్రజలకు ఈ ప్రభుత్వం ద్వారా మంచి జరగకూడదని, ఏ సంక్షేమ పథకం అమలు కాకూడదని, ఉద్యోగుల జీతాలు రాకూడదని బిల్లును టీడీపీ నాయకులు మండలిలో అడ్డుకున్నారు. ఎన్నాళ్లు అడ్డుకుంటారు. ఎంత సేపు అడ్డుకుంటారు. ప్రజల చేత గెలిచిన అసెంబ్లీ కన్నా.. మండలిలో ఎంత కాలం ఆపుతారు. 15 రోజులు ఆపుతారు, ఒక నెల ఆపుతారు, రెండు నెలలు ఆపుతారని వెల్లంపల్లి తెలిపారు. ఇంతకంటే టీడీపీ నేతలు ఏం చేయలేరు.
సభకు రాకుండా చంద్రబాబు ఉసి గొల్పుతున్నాడు
ఏదో ఇక్కడ అమరావతిలో కృత్రిమ ఉద్యమాన్ని ఏదో కాపాడుకుంటున్నానని చంద్రబాబు షో చేస్తున్నారు.  చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా లాంజ్‌లో కూర్చొని రౌడీయిజం, గూండాయిజం చేయాలని ఉసి గొల్పుతున్నాడు.  ప్రజల కష్టాలు తెల్సిన వాళ్లం కాబట్టి ప్రజా ప్రయోజనాలు కోసం వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టే మీరు చేసిన దాడులు తట్టుకుంటున్నాం, మీ తిట్లను భరాయిస్తున్నాం.
 అదే మేం తిరగబడితే మీరు ఎక్కడైనా ఉండగలరా? ప్రజలకు మంచి చేయాలని తలవొంచుకొని ఉంటే..ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, తిట్టడం, మామీద దాడులు చేయటాన్ని ఖండిస్తున్నాము.
ఈ దాడులకు ప్రధాన కారణం నారా లోకేశ్‌ చౌదరి గారే. వారి నేతృత్వంలో దీపక్‌ రెడ్డి, బీదా రవిచంద్ర లాంటి వారు గూండాలులాగా ప్రవర్తిస్తున్నారు. డిప్యూటీ ఛైర్మన్‌ చూస్తున్నా ఆయన వాటిని ఖండించలేదు.
టీడీపీ చేసే గూండాయిజం, రౌడీయిజం మండలిలో చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇప్పటికే ప్రజాకోర్టులో చంద్రబాబు దోషిగా నిల్చున్నారు. తప్పకుండా రేపు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ డిపాజిట్ లేకుండా పోతుంది.
మండలిలో నామీద (వెల్లంపల్లి), అనిల్ కుమార్ యాదవ్, కన్నబాబు, ఇతర మంత్రులపై దాడులు చేయటానికి  ముందుకు వచ్చారు. మండలిలో ఇలాంటి చర్యలు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.
మండలిలో దీపక్‌ రెడ్డి తీరు సరికాదు
టిడిపి ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి వెల్‌లోకి వచ్చి మంత్రులను బయటకు నెట్టేయాలని, దౌర్జన్యంగా మాట్లాడారు. రూల్స్‌కు విరుద్ధంగా మంత్రులను బయటకు వెళ్లిపోవమనడం కరెక్టా? రూల్స్‌కు విరుద్ధంగా లోకేశ్‌ సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డ్‌ చేయటం కరెక్టా? పైగా టీడీపీ నేతలే దాడులు చేస్తున్నారు. అవన్నీ మీడియా వారు లాంజ్‌లో నుంచి చూశారేు. తప్పకుండా లోకేశ్, దీపక్‌ రెడ్డి, బీదా రవిచంద్ర మీద డిప్యూటీ ఛైర్మన్ చర్యలు తీసుకోవాలి.చర్యలు లేకపోతే పునరావృతం అవుతుంటాయని ఇది మంచి సాంప్రదాయం కాదని డిప్యూటీ ఛైర్మన్‌కు తెలియజేస్తున్నానని వెల్లంపల్లి తెలిపారు.