భారత్-చైనా సరిహద్దుల్లో ఎపుడూ ఉద్రికత్త ఉంది గాని, అది రక్తపాతానికి దారి తీసిన సందర్భాలు తక్కువ. 1962 యుద్ధం తర్వాత పెద్ద ఎత్తున ఉద్రిక్తత రాకుండా చూసుకునేందుకు చాలా ఒప్పందాలు జరిగాయి. అయినా ఘర్షణ వాతావరణ నెలకొనడం, కొట్టుకోవడం, మళ్లీ వెనక్కుతగ్గడం జరుగుతూనే ఉంది. లదాక్ ప్రాంతంలోని గాల్వన్ లోయ భారత్ చైనా సరిహద్దువివాదంలో చాలా ప్రముఖమయింది. నిజానికి సోమవారం రాత్రి గాల్వాన్ లోయలో జరిగిన దుర్ఘటన 1962 యద్ధం తర్వాత మొదటిది.ఈ ఘటనలో 20 మంది దాకా భారతీయ సైనికులు అమరలయ్యారు. ఇందులో తెలుగువాడు కర్నల్ సంతోష్ బాబు చనిపోవడం చాలా బాధకరం.
సరిహద్దు వద్ద వచ్చే తగాదాలను తీర్చుకునేందుకు 1993లో భారత్ చైనా ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం సరిహద్దుల్లో కాపలకోసం గస్తీ తిరిగేటపుడు ఆయుధాలు ధరించరాదు. అయినా సరే, సోమవారం రాత్రి రెంండుదేశాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆయుధాలత కాకుండా, రాళ్ళతో, ఇనప రాడ్లతో కొట్టుకున్నారని వార్తలొచ్చాయి. దానికి కారణం ఈ ఒప్పందమే.
సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో భారత్, చైనా సైనికులు ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదని (No Shots were fired) రెండు దేశాలుచెబుతున్నట్లు బిబిసి (BBC) కూడా రాసింది. కాల్లులు లేకుండా జరిగిన ఘర్షణలో ఇంత మంది చనిపోవడం చాలా ఆశ్చర్యకరమయిన విషయం. అయితే సైనికులు ఒకరినొకరు కొట్టి చంపుకున్నట్లు (beaten to death) స్థానిక మీడియా చెబుతున్నట్లు కూడా బిబిసి రాసింది.
Like this story? Share it with a friend to promote quality journalism
లదాక్ ప్రాంతంలోని ప్యాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో మొదట మె 5,6 తేదీలలో ఘర్షణ మొదయిందని తెలుస్తున్నది. లదాాక్ నుంచి టిబెట్ దాకా విస్తరించిన సరస్సు ఇది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తలో ఈ సరస్సు తరచూ వినబడుతూ ఉంటుంది.
రెండుదేశాల మధ్య ఉన్న గొడవ ల చరిత్ర ఇది.
1947-1962
చైనా సిన్సియాంగ్ (Xinjag) నుంచి టెబెట్ దాకా 1,200 కి.మీ (750 మైళ్ల (రోడ్డు వేసింది. ఇందులో 179 కి.మీ(111 మైళ్లు) జాన్సన్ లైన్ దక్షిణంగా అక్సాయి చిన్ ప్రాంతం గుండా వెళ్తుంది. ఇది తమ భూభాగ మని భారత్ వాదిస్తున్నది.
దీనికికారణం రెండు దేశాల మధ్య సరిహద్దు మీద అంగీకారం లేకపోవడమే. 1865 లో WH జాన్సన్ అనే సర్వేఅధికారి భారత్ చైనాల మధ్య సరిహద్దు రేఖ గీశారు. అదే జాన్సన్ లైన్. ఆయన అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కాశ్మీర్ లో కలిపాడు. అందుకే చైనా ఈ లైన్ ను అంగీకరించడం లేదు. అయితే, భారత్ తో ప్రపంచంతా జాన్సన్ లైన్ నే రెండు దేశాల మధ్య సరిహద్దుగా భావిస్తున్నాయి.
ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు చైనా ప్రధాని చౌ ఎన్ లై కి మధ్య ఒక ఒప్పందం ప్రకారం 1960 లో సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అధికారుల స్థాయి చర్చలు జరిగాయి. ఈచర్చలు సఫలం కాలేదు. విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అదే 1962 అక్టోబర్ లో ఇండో చైనా యుధ్దానికి దారి తీసింది. అపుడు భారత్ వైపు నుంచి 3,000 మంది సైనికులు చనిపోయారు. చైనా వైపు నుంచి ఎందరు చనిపోయారోతెలియదు గాని,అంతర్జాతీయ మీడియా 700 అని రాస్తూ వచ్చింది.
1967
నాథు లా (Nathu La), చో లా (Cho La) కనుమల్లో గొడవలు తలెత్తాయి. 1967 సెప్టెంబర్ 11 గొడవలు వచ్చాయి. తూర్పు సిక్కింలోని నాథు లా లోయలో ఉన్న ఒక భారత మిలిటరీ పోస్టు మీద చైనా సైనికులు దాడి చేయడంతో ఘర్షణ మొదలయింది.
అక్టోబర్ 1975
ఇది భారీ ఘర్షణ అని చెబుతారు. ఈశాన్యభారతంలోని అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ జిల్లాలోని తులుంగ్ లా (Tulung La) వద్ద ఘర్షణ జరిగింది. ఇందులో నలుగురు భారతీయ సైనికులు చనిపోయారు. తర్వాత ఇది పొరపాటని రెండు దేశాలు ప్రకటించుకున్నాయి. దట్టంగా పొగ మంచు ఉండటంతో గస్తీదళాలుదారి తప్పి సరిహద్దులు దటాయని ప్రటించుకున్నాయి.
ఏప్రిల్ 2013
రెండు దేశాల మధ్య సరిహద్దుగా ఇప్పటికి భావిస్తున్న యాక్చవల్ లైన్ ఆఫ్ కంట్రోల్ (AOC) కి 10 కి.మీ దూరాన ఉన్న భారతీయ భూభాగంలో దౌలత్ బేగ్ ఓల్డి సెక్టర్ లో చైనా సైనిక శిబిరం ఏర్పాటుచేసిందని భారత్ ఆరోపించింది. తర్వాత ఆది 19 కిమీ దూరం అని సవరించారు. అక్కడ రెండు సైన్యాలు క్యాంపులను ఏర్పాటుచేసుకున్నాయి.ఉద్రిక్తత పెరిగింది. అయితే మే నెలలో ఇరు దేశాలు అక్కడి నుంచి వెనుదిరగడంతో శాంతియుత వాతావరణం నెలకొంది.
సెప్టెంబర్ 2014
సరిహద్దు సమీపాన ఉన్న డెమ్చోక్ (Demchok) గ్రామంలో ఒక కాలువ తవ్వేందుకు భారత్ ప్రయత్నించింది. చైనా నిరసన తెలిపింది. సరిహద్దల్లోకి సైన్యాలను తరలించారు. ఘర్షణ వాతావారణ నెలకొంది. మూడువారాలు యద్ధవాతావరణం నెలకొనింది. తర్వాత రెండు దేశాలు సైన్యాలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాయి. వెనుదిరిగాయి. ఆ గొడవ అంతటితో ముగిసింది.
సెప్టెంబర్ 2015
ఉత్తర లదాక్ ప్రాంతంలో భారత్ చైనా సైనికులు ఘర్షణకు తలపడ్డారు. చైనా వాళ్లు భారత్ భూబాగంలో ఏర్పాటు చేసుకున్న ఒక వాచ్ టవర్ ను బారతీయసైనికులు ధ్వంసం చేయడంతో ఈ ఘర్షణ మొదలయింది. జూన్ 2017 డోక్లామ్ ప్రాంతంలో డోకా లా (Doka La) కనుమ వద్ద ఇరుదేశాల సైనికులు ఘర్షణకు దిగారు. ఈ ప్రాంతం సిక్కిం, భూటాన్ సరిహద్దుల్లో ఉంటుంది. డోక్లామ్ ఎవరిదనే వివాదం చాలా కాలం సాగుతూ వస్తున్నది.
ఆగస్టు 2017
సముద్రమట్టానికి 4,350 మీటర్ల (14,271 అడుగుల) ఎత్తున ప్యాంగాంగో త్సో (Pangong Tso) ఒక సరస్సు ఉంది. ఇక్కడ రెండు దేశాల సైన్యాలకు ఘర్షణకు దిగాయి. సైనికులు గాయపడ్డారు. భారత్ వైపు నుంచి 72 మంది గాయపడినట్లు సమాచారం.
మే 5, 2020
పాంగాంగ్ త్సో సరస్సు వద్ద మరొక సారి భారత్,చైనా సైనికులు ఘర్షణకు దిగారు. ఈ సరస్సు చాలా పెద్దది. లదాక్ నుంచి టిబెట్ దాక విస్తరించి ఉంటుంది. రెండు దేశాల మధ్య LAC ఈ సరస్సు మధ్యనుంచే పోతుంది. రెండు దేశాల సైనికులు ముష్టి యుద్ధాలకు, రాళ్లు రువ్వుకోవడానికి తలపడినట్లు ప్రచారంలోకి వచ్చిన వీడియోల వల్ల తెలుస్తుంది. 150 మంది సైనికులు ఈ గొడవల్లో పాల్గొన్నట్లు మీడియా కథనాలున్నాయి.
మే 21,2020
లదాక్ ప్రాంతంలోని గాల్వాన్ (Galwan) నది లోయలోకి చైనా సైన్యాలు ప్రవేశించాయి. ఈ ప్రాంతంలో భారత్ రోడ్డు నిర్మిస్తున్నదని, దానిని అడ్డుకునేందుకే తాము ప్రవేశించామని చైనా సైన్యం సమర్థించుకుంది. దార్బుక్ ష్కోక్ -దౌలత్ బేగ్ ఓల్డి రోడ్ నుంచి గాల్వన్ లోయలోకి భారత్ వేయాలనుకుంటున్న రోడ్డు ఇది.
మే 24,2020
వివాదాస్పద జాగాలలో చైనా మూడు సైనిక శిబిరాలు ఏర్పాటుచేసింది. అవి- హాట్ స్ప్రింగ్స్, పెట్రోలింగ్ పాయింట్ 14, పెట్రోలింగ్ పాయింట్ 15. సుమారు వేయి మంది చైనా సైనికులు ఇక్కడ గుడారాలు వేసుకుని , భారీ వాహనాలను దించడమేకాకుండా మానింటరింగ్ పరికరాలను కూడా ఏర్పాటు చేశారు.
జూన్ 15,2020
గాల్వన్ వ్యాలీలో భారత్ చైనా సైనికుల మధ్ జరిగిన ఘర్షణలో ఒక భారతీయ కర్నల్, ఇద్దరు సైనికులు మరణించారు. సైనికులు మీద కాల్పుల జరిపలేదని, ఘర్షణ పడ్డారని, రాళ్లురప్పలు విసిరేసి చంపారని భారత్ చెప్పింది.
భారత్ చైనా మధ్య అయిదు ద్వాపాక్షిక ఒప్పందాలు జరిగాయి.
1993 సెప్టెంబర్ 7: భారత్ చైనా ల మధ్య ఉన్న ఎల్ ఎ సి మీద శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ఉండేందుకు ఒక ఒప్పందం జరిగింది.
1996 నవంబర్ 29: ఎల్ ఎ సి ప్రాంతంలో మిలిటరీ ఫీల్డ్ లో సుహృద్భావం వాతావరణం నెలకొనే చర్యల కోసం అంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చర్యల కోసం ఒప్పందం జరిగింది.
2005 ఏప్రిల్ 11 : 1996 ఒప్పందాన్ని ఎలా అమలుచేయాలని మార్గదర్శకాల ప్రొటొకోల్ కోసం జరిగిన ఒప్పందం
2012 జనవరి 17 : సరిహద్దు వివాదాల మీద జరిగే సంప్రదింపులకోసం, సమన్వయం కోసం ఒక వర్కింగ్ మెకానిజం ఏర్పాటుచేయాలని ఈ ఒప్పందం జరిగింది.