కృష్ణా జల్లాలో రేపటి నుంచి మాస్క్ తప్పని సరి, లేకుంటే రు. 100 ఫైన్ (వీడియో)

ఆంధ్రప్రదేశ్  కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో మాస్కు ధరించడం తప్పని సరిచేశారు. బుధవారం నుంచి ఎవరైనా మాస్కు ధరించకుండా ప బయటకు వస్తే జరిమాన విధించాలని నిర్ణయించారు. జిల్లాలో కరోనా బాగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరికీ కలెక్టర్ ఇంతియాజ్ ఈ హెచ్చరిక చేశారు.
కరోనా సోకిన వ్యక్తి తో సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు కరోనా సోకకపోవడం తాము గుర్తించామని, దీనికి కారణమని మాస్కు ధరించడమేనని తమ అధ్యయనంలో తేలినందున ఇపుడు కృష్ణా జిల్లాలో మాస్కును కట్టడి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రతి ఒక్కరు మాస్కు తప్పని సరిగా ధరించాలని, మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే  మొదటి రెండుసార్లు రూ. 100 జరిమానా విధిస్తామని ఆయన తెలిపారు.
మూడో సారి మాస్కులు లేకుండా పట్టుబడినట్లయితే అతనిని  నేరుగా క్వారంటైన్ కు తరలిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని, ప్రతినిత్యం శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు.
కరోనా నివారణకు ఆయన SMS పాటించాలని సూచించారు. SMS అంటే  Sanitation, Mask, Social Distance.
బుధవారం నుంచి మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఎవరు తిరిగినా తక్షణమే  పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులచే జరిమానా విధించబడుతుందని, ప్రజలందరూ అనవసరంగా ఎవరూ బయటకి రావద్దని కలెక్టర్ వెల్లడించారు.