(జువ్వాల బాబ్జీ)
భారత దేశాన్ని ముందు “డిజిటల్ ఇండియా”చేసి తర్వాత గ్లోబల్ లీడర్ గా ఎదగాలనే తపనతో అనేక రకాల సంస్కరణ లు ప్రవేశ పెడుతున్నారు.
ఇందులో ప్రధానంగా దేశంలో ఆన్లైన్ విద్యా వ్యవస్థ ఒకటి. ప్రస్తుత ఎన్డీయే కూటమి రెండవ సారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రధాని మోడీ మే 31/2020 న దేశ ప్రజలకు లేఖ రాశారు. అందులో బీజేపీ గెలుపు భారత ప్రజాస్వామ్య చరిత్రలో “స్వర్ణయుగం “అని అన్నట్లుగా పత్రికలు కూడా వ్రాసా యి.
నిజమేఎవరికి స్వర్ణ యుగం?దేశంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు ఎంతవరకు పరిష్కార మయ్యాయి?రైతులు ఆత్మ హత్యలు ఆగాయా? దళితుల పైన గోసంరక్షణ దళాల మూక దాడులు చేసి చంపుతున్నారు కదా అవిఆపగలిగారా ?,బ్యాంకులకు టోకరా పెట్టీ, విదేశాల్లో తలదాచుకున్న వారినీ తిరిగి దేశానికి మళ్ళీ రప్పించగలిగారా ? కోట్లు అప్పులు తీసుకుని బ్యాంకుల కు టోకరా పెట్టిన కేవలం50 మందికి లక్షల కోట్లు రద్దు ఎందుకు చేసినట్లు?
(అభిప్రాయం)
ఇంకా, ఇప్పటివరకూ సాధించిన విజయాల గురించి కూడా చెప్తూ త్వరలో”ఆత్మ నిర్భ ర్ భారత్ అభియాన్” పథకం కొత్త దిశగా అడుగులు వేయ నున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా, దేశ వ్యాప్తంగా, ఆన్లైన్లో తరగతులు చెప్పనున్నారు. ఇప్పటి వరకూ ఉన్నా,30 యూనివర్సిటీలకు పరిమితమైన ఈ విధానం ఇకనుండి100 యూనివర్సిటీ లలో అమలవ్వబోతున్నట్లు చెపుతున్నారు.
మన దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ దీనివల్ల, గ్రామీణ విద్యార్థులకు మంచి జరిగే పరిస్థితులు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీ షు బోధనా పద్ధతులు లేవు. కంప్యూటర్ క్లాసులు లేవు. దళిత, ఆదివాసులు ఇతర వెనుక పడి న వర్గాల వారు సరైన సదుపాయాలు లేక డ్రాపౌట్స్ గా ఉన్నారు. వారికి ఇండ్లలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు. తల్లిదండ్రులు కూడా నిరక్ష్య రాశులు. మరి, ఈ సమస్యలు పరిష్కారం కాకుండా, ఆన్లైన్ విద్యా వ్యవస్థ ద్వారా కోట్లాది మంది పేదలకు సరైన విద్య అందుతుంది అంటే అసంభవం.
చాలా మంది ఆదివాసులకు, గ్రామాలకు రాకపోకలు లేకుండా, కనీసం ఫోన్ సదుపాయం అందుబాటులోకి రాక రోగం సోకితే సరైన సమయంలో చికిత్స లభించని పరిస్థితుల్లో ఉన్నారు. మరి వారికి లబ్ధి చేకూరుతుందని గ్యారంటీ లేదు.భారత దేశం లో అపారమైన సహజ వనరులు ఉన్నాయి. వాటిపై ఆదివాసీలకు, దళితులకు, రైతాంగానికి హక్కులు ఉన్నప్పటికీ, వివిధ రంగాల్లో అభివృద్ధి పేరుతో పరిశ్రమలు కోసం వారి సాగులో ఉన్న భూములను బలవంతంగా తీసుకొని వారిని నిర్వాసితులను చెయ్యటం ద్వారా ,కోట్లాది మంది పేదలకు సరైన ఉపాధి అవకాశాలు లేక పట్నాల కు వలసలు పోతున్నారు.
మొన్న కరోనా వచ్చి దేశంలో వలస కార్మికులు స్థితి గతులు ప్రపంచానికి తెలిసేలా చేసింది. సాక్షాత్తూ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరోనా సమయంలో80 కోట్లమంది తెల్ల రేషన్ కార్డులు కలిగిన వారికి ఉచిత బియ్యం యిచ్చి నట్లు చెప్పారు. అంటే వీరంతా కనీస వేతనం, సౌకర్యాలు లేని పేదలు అని ప్రభుత్వమే అంగీకరిస్తుంది.
దేశ జనాభాలో 130 కోట్ల మంది లో 80 కోట్లు పేదలు. మిగిలిన వారు 50 కోట్లు. వీరంతా ఎక్కువగా పట్నాలలో ఉంటారు. మురికి వాడ ల్లో ఉంటూ, రిక్షా కార్మికులు, పాకీ పనివారి గానూ, భవన నిర్మాణ పనులు చేస్తూ, తోపుడు బండ్లు నడుపుకుంటూ, రద్దీగా ఉండే చోట బిక్షం ఎత్తుకుంటూ జీవిస్తుంటారు. కాబట్టీ, ఆన్లైన్ విద్యా వ్యవస్థ వీరికి ఉపయోగం లేదు.
ఇంకా,16 కోట్లమంది వలస కార్మికులు న్నట్లు, వారందరినీ ఆ దు కునేవిధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మరీ, వీరెవరూ స్థిరంగా ఒక ఊరిలో, జిల్లాల్లో, రాష్ట్రంలో ఉండే అవకాశం లేదు. వీరి పిల్లలకు చదువుకునే అవకాశం లేదు. వారికిఆ ఆన్లైన్ విద్యా అందుతుందా?
వీరంతా కనీస జీవన విధానం కూడా లేక బ్రతుకు తెరువు కోసం వలసలు పోతున్నారు. కొత్తగా వచ్చిన, ప్రభుత్వం మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు కూడా ఇంగ్లీషు మీడియం చదువు కోవాలని ప్రవేశ పెడితే, ప్రతిపక్ష పార్టీలు దానిని వ్యతిరేకించటం దుర్మార్గం.
బీజేపీ నేతలు కోర్టులో కేసు వేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే పేదలు ఇంకా, ఆన్లైన్లో తరగతులు చదివే అలవాటు ఎలా చేసుకుంటారు? ఈ ఆన్ లైన్లో చదువు కావాలని పేదలు కోరలేదు. ముందు ప్రభుత్వాలు పేదల కుటుంబం గురించి ఆలోసించాలి. ఆ పిల్లలు చదువు కోవటానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. చాలినంత మంది ఉపాధ్యాయులను , పుస్తకాలు, పాఠ శాల ల్లో ఇంగ్లీషు మీడియం, కంప్యూటర్ లాబ్, మొదలగు వాటిని ఏర్పాటు చేసి ఏ ప ధకమైన అమలుచేయడం మంచిది.
ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే విధంగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు కు ఉచితంగా లాప్ టాప్, టాబ్లెట్ మరియు మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తెచ్చి నప్పుడే, డిజిటల్ ఇండియా కొత్త దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. ఆ దిశగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ప్రయత్నం చేస్తున్నారు.
ప్రైవేటు రంగం నుంచి ప్రస్తుత విద్యా వ్యవస్థ ను కాపాడాలి. మన దేశంలో మూడొంతులు మంది 35 సం. లోపు యువత ఉంది. వారిలో దాగిఉన్న శక్తులను వెలికితీసి మిగతా ప్రపంచంతో పోటీపడే ల ప్రోత్సహించాలి. మనకంటే, వెనుక స్వాతంత్ర్యం వచ్చిన చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన తీరు అర్థం చేసుకుని సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తూ సాగాలి. అప్పుడు మాత్రమే “ఆత్మ నిర్భార్ భారత్ అభియాన్”పథకం లక్ష్యాలు సాధిస్తారు.
(జువ్వాల బాబ్జీ,న్యాయవాది,ఆంధ్ర ప్రదేశ్ వ్వ వసాయ వృత్తి దారుల యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, ఫోన్. 9963323968)