దేశ రాజధాని కరోనా వణుకుతూ ఉంది. పాజిటివ్ కేసులు 39వేలకు చేరుకుంటే, మరణాలు 1,200 లకు చేరుకున్నాయి. ఢిల్లీ లో పరిస్థితి ఎలా ఉందో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చాలా స్పష్టం గా చెప్పారు.
ఇప్పుడు కరోనా కేసులు రెట్టింపవుతున్న వేగం ఇలా కొనసాగితే, జూలై నెలాఖరు నాటికి కరోనా కేసులు 5.5 లక్షలకు చేరుకుంటాయని, 80వేల ఆసుపత్రి పడకలవసరమవుతాయని సిసోడియా అన్నారు.
ఢిల్లీకి ఈ ఉపద్రవాన్ని తట్టుకునే పరిస్థితి ఢిల్లీకి లేదని కూడా ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
రాజధాని పరిస్థితి ఇక అంతర్జాతీయంగా భయం పుట్టించకముందే ఢిల్లీ , కేంద్ర ప్రభుత్వాలు మేలుకున్నారు. ఢిల్లీలో కరోనా మహమ్మారిని సంయుక్తంగా ఎదుర్కోవాలని నిర్ణయించాయి. ఆదివారం నాడు ఢిల్లీ కోవిడ్ భయం గురించి ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.
FLASH : జాతీయ రాజధాని ఢిల్లీలో కోవిడ్-19 పరిస్థితుల సమీక్షించడానికి హోంమంత్రి అమిత్ షా జూన్ 15 సోమవారం ఉదయం 11 గంటలకు రాజకీయ పార్టీలతో సమావేశం.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ పాల్గొన్నారు. ఢిల్లీలో కోవిడ్ -19 తీవ్రత మీద ఇలా ఉన్నత స్థాయి సమావేశం జరగడం ఇదే మొదటి సారి.
సమావేశం బాగా ఫలవంతమయిందని కేజ్రీవాల్ తర్వాత వ్యాఖ్యానించారు.
Extremely productive meeting betn Del govt and Central govt. Many key decisions taken. We will fight against corona together.
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 14, 2020
సుప్రీంకోర్టు శుక్రవారం నాడు ఢిల్లీ పరిస్థితి మీద చాలా భయంకరంగా ఉందని కొరడా ఝళిపించడంతో రెండు ప్రభుత్వాలు కదిలాయి. ఇపుడు ఆసుపత్రులలో రోగుల పడకలకు ఒకదానిపక్కటి కూరినట్లు అమర్చి ఉండటాన్ని చూసి సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యా చేసింది. వెంటనే పడకలనుపెంచి, వెంటిలేటర్లను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకురావాలని కోర్టు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది.
ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అవసరమయినన్ని పడకలు సిద్ధం చేయడం, పరీక్షలు నిర్వహించడం, ఇతర వైద్యవసతులను కల్పించడం వంటి వాటి గురించి సమావేశంలో చర్చించారు. మరొక దఫా ఈ సాయంకాలం హోం మంత్రి ఢిల్లీ లో మూడు మునిసిపల్ కార్పొరేషన్ ల మేయర్లతో సమావేశమవుతున్నారు.
ఢిల్లీలో ఎదురయ్యే కోవిడ్ కేసులను తట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 500 రైలు పెట్టెలను అందివ్వాలని నిర్ణయించింది. వీటిని అసుపత్రులుగా మారుస్తారు. వీటితో తక్షణం 8000 పడకలు అందుబాటులోకి వస్తాయి. ఈ రైలుపెట్టె ఆసుపత్రులలో కరోనా రోగుల చికిత్సకు అవసరమయిన వసతులన్నింటిని అమరుస్తారు.మొత్తంగా 20 వేల పడకలను ఏర్పాటుచేయాలనుకుంటున్నారని ఎన్డీటివి రాసింది.
ఈ విషయాన్ని అమిత్ షా ప్రకటించారు. ఢిల్లీలో కరోనా పరీక్షలు రోజుకు 7వేల నుంచి 5వేలకు పడిపోయిన సంగతి కూడా సుప్రీంకోర్టు గుర్తించింది. చెన్నై , ముంబై లో పరీక్షలు 16 వేల నుంచి 17వేలకు పెంచినపుడు మీరెందుకు తగ్గించారని సుప్రీంకోర్టు నిన్న ప్రశ్నించింది. ఢిల్లీలో ఇంటింటికి సర్వేసి కరోనా కేసులను గుర్తించాలని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.ః
ఇపుడు ఢిల్లీలో 219 కంటైన్మెంట్ జోన్లున్నాయి.
ఢిల్లీలో 80 పంక్షన్ హాళ్లను కరోనా చికిత్సాకేంద్రాలు మారుస్తారు. వీటిని సమీపంలో నర్సింగ్ హోం లతో అనుసంధానం చేస్తారుు. వీటి వల్ల 11 వేల దాకా పడకలు ఏర్పాటుచేస్తారు. ఇలాగే మరొక 40 హోటళ్లలో 4000 పడకలను ఏర్పాటుచేస్తారు.వీటన్నింటిని అక్కడి ప్రయివేటు ఆసుపత్రులకు అనుబంధం చేస్తారు.
दिल्ली सरकार के इस निर्णय से 5000 से अधिक बेड करोना के लिए उपलब्ध हो जाएँगे
अगले कुछ दिनों में हमारे अधिकारी हर नर्सिंग होम के मालिक से बात करके उनकी समस्याओं को भी दूर करेंगे https://t.co/ClXhMJRBLv
— Arvind Kejriwal (@ArvindKejriwal) June 14, 2020