ఎపి ఇంటర్ ఫలితాలు విడుదల, కృష్ణాజిల్లా టాప్, ప.గో 2, విశాఖ 3

ఏపీ ఇంటర్ ప్రధమ, ద్వితీయ  పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్‌ ఫలితాలను విడుదల చేశారు.
ఫలితాలు  https://bie.ap.gov.in లో అందుబాటులో ఉన్నాయి.  ఈ వెబ్ సైట్ లో హాల్ టికెట్ నెంబర్, పుట్టన తేదీలు టైపు చేసి రిజల్ట్ వైరిఫై చేసుకోవచ్చు.
ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈసారి ఒకే దఫాలో విడుదల చేశారు. విద్యార్థులు హాల్‌ టికెట్‌ నంబరు, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఫలితాలను ఆన్‌లైన్‌లోనే విడుదల చేసింది
ఉత్తీర్ణతలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాల్లో కృష్ణా జిల్లా మొదటి స్థానం ఉంది.  పశ్చిమ గోదావరి రెండవ స్థానంలో ఉండగా , విశాఖ మూడవస్థానంలో ఉంది.
ఇంటర్మీడియ్ మొదటి సంవత్సరలో 5.07 లక్లల మంది విద్యార్థుల పరీక్షలు రాగా 59 శాతం మంది ఉత్తీర్ణలయ్యారు. ఇంటర్ రెండో సంవత్సరలంలో 69 శాతం మంది పాపయ్యారు. ఈ సారి బాలురంటే బాలికలే ఎక్కువ మంది పాసయ్యారు.
దేశంలో అందరికంటే ముందే ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ప్రకటించిందని, ఈ సందర్బంగా మంత్రి ఆదిమూలం చెప్పారరు. కరోనా వల్ల అనేక ఆటంకాలు ఎదురయినా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలోనే ఫలితాలు విడుదల చేసిందని ఆయన అన్నారు.