మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసేందుకు వీలు కల్పిస్తున్నారు.రాష్ట్రంలో బాగా పేరున్న ఆలయాలలలో మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఒకటి. ఎక్కడెక్కడి నుంచే భక్తులు తమకోర్కెలు నెరవేర్చుకునేందుకు పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటుంటారు. ఈ మధ్య భక్తులు సంఖ్య పెరుగుతూఉంది. అయితే, ఇపుడు భక్తులు కొండచుట్టూర దిగి ప్రదక్షిణలు చేసేందుకు అవకాశం కల్పించాలనుకుంటున్నారు.
ఈ దేవాలయానికి ఎగువ కొండ మీద పానకాల లక్ష్మీ నరసింహ స్వామి (పానకాల రాయుడు) దిగువన శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఉంటాయి, ఇప్పుడు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి గిరి ప్రదర్శన కోసం రోడ్డు మార్గం ప్రతిపాదన చేయడం ప్రశంసనీయం. దేశంలో గిరిప్రదక్షిణ ఉన్న ఆలయాలు బాగా చాలా తక్కువ. ఇలాంటి ఒక్క అరుణాలంలో మాత్రమే ఉంది.ఇపుడు మంగళగిరి లక్ష్మీనరసింహస్వామికి ఈ హోదా దక్కబోతున్నది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గిరి ప్రదక్షిణ కోసం రోడ్డు వేసే ప్రతిపాదన తీసుకువచ్చారు. ఆయన పట్టుబడితే అదిపూర్తయ్యే దాకా వదలరు.
Like this story? Share it with a friend!
గిరి ప్రదక్షిణ కోసం రోడ్డును వాకింగ్ ట్రాక్ లా ఉపయోగపడాలని బావిస్తున్నారు. దీనికోసం స్థల సేకరణకు ఈ రోజు ఉదయం 6.00 గంటలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడి ఎఐఐఎంఎస్ ముఖ ద్వారం నుండి కొండ చుట్టూ వున్న ప్రాంతాన్ని కాలి నడకన పరిశీలించారు.
ప్రస్తుతం అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన పార్క్ ను కూడా పరిశీలించారు.
ఈ పార్క్ లో గల మొక్కలకు నీళ్లు లేనందున మున్సిపల్ అధికారులకు రోజుకు రెండు వాటర్ ట్యాంకర్ల ను ఏర్పాటు చేయవలసిందిగా కోరారు…
అలాగే పార్క్ లోకి మగవాళ్ళు, యువకులు ఎక్కువగా వస్తున్నారు వీరితో పాటుగా మహిళలు కూడా వాకింగ్ కి రావాలన్న ఎక్కువ మంది మహిళలు రాలేని ఉంది. ఈ ప్రాంతాన్ని మహిళలలకు కూడా సురక్షితం చేసేందుకు పార్క్ లో సిసి కేమెరాలు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి నడక బాటని వెడల్పు చేసి గేట్ ఏర్పాటు చేయాలని అటవీశాఖ అధికారులను కోరారు.
ఈ ప్రాంతంలోని పర్యావరణాన్ని ఆలయ చారిత్రక ప్రాశస్త్యం కాపాడుకుంటుపే గిరి ప్రదర్శన కోసం రోడ్డు మార్గం ఏర్పాటు చేయటానికి అనవైన ,అవసరమైన స్థలం పరీశీలిస్తున్నామని అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆళ్ల చెప్పారు.
‘కొండ చుట్టూ మట్టి రోడ్డు మార్గం విస్తరింపచేయాలి. గిరి ప్రదర్శనకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం నిర్మించాలి. రోడ్డు గిరి ప్రదర్శన వేస్తున్న రోడ్డు మంగళగిరి పట్టణంలోని ప్రజానీకానికి అహ్లాదకరమైన వాతావరణం మద్య ఉదయం పూట వాకింగ్ చేయడానికి వాకింగ్ ట్రాక్ లా కూడా ఉపయోగపడుతుంది. గతంలో మంగళగిరి ప్రజలు ఈ ప్రాంతంలోనే స్వామివారికి ప్రతి సంవత్సరం పార్వేట ఉత్సవం ఘనంగా జరుపుకోనేవారు. ఎద్దుల బండ్ల తో కొండ చుట్టూ తిరిగి స్వామివారికి గిరి ప్రదక్షిణ చేసేవారు. , మళ్లీ ఇప్పుడు స్వామివారి గిరి ప్రదర్శన కోసం రోడ్డు మార్గంవేయటం ఆలయ ప్రతిష్ట పెరుగుతుంది,’ అని ఆయన అన్నారు.
ఈ పార్క్ అభివృద్ధి కొరకు మరియు గిరి ప్రదక్షణకి మార్గాన్ని ఏర్పాటు చేయడానికి అటవీశాఖ అధికారులతో మాట్లాడతానని ఎమ్మెల్యే ఆర్కే గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హేమమాలిని రెడ్డి గారు, CI శ్రీనివాసులు రెడ్డి గారు, SI నారాయణ గారు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, వైసిపి నాయకులు, వాకర్స్ అసోకేషన్ సభ్యులు పాల్గొన్నారు…