భారత్ లో రికార్డు స్థాయిలో నిన్న కోవిడ్ కేసులు

ఒకవైపు దేశంలో లాక్ డౌన్ నుంచి వేగంగా బయటపడుతూ ఉంటే, మరొక వైపు అంతే వేగంగా కరోనాపాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.
నిన్న ఒక్క రోజు 9,304 కేసులు నమోదయ్యాయి.ఇది ఒక రికార్డు. కరోనా పాజిటివ్ కేసులలో దేశం రోజూ రికార్డు నెలకొల్పుతూ ఉంది. ఈ రోజు నమోదయిన రికార్డు కేసులతో దేశంలో కరోన బాధితుల సంఖ్య 2,16,919 చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
దీనితో ప్రపంచంలో కరోనా బాధిత దేశాలలో భారత్ హోదా ఏడోస్థాయికి చేరింది. అమెరికా, బ్రెజిల్, రష్యా,యుకె, స్పెయిన్ , ఇటలీల తర్వాత భారత్ చేరింది. ఆసియాదేశాలలో ఈ హోదా దక్కింది ఒక్క భారత్ కే. నిజానికి ఆసియాదేశాలలో కరోనా బాగా అదుపులోకి వచ్చింది.
పశ్చిమదేశాలలో బాగా ప్రబలుతూ ఉంది. ఇపుడు ఈ దేశాలలో సరసన భారత్ చేరడం వింతగా ప్రచారమవుతూ ఉంది. లాక్ సడలిస్తున్నదేశాలలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ ఉన్నాయి. భారత్ లోనే పెరుగుతూ ఉన్నాయి.
దేశంలో కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న వార. 1,04, 106 ఇంకా చికిత్స పొందుతున్నవారు 1, 06, 737. అయితే, కోలుకుంటున్నవారి శాతం 47.99 శాతమని అధికారులు ప్రకటించారు.
బుధవారం నాడు మొత్తంగా 260 మంది చనిపోయారు. వీరిలో 122 మంది ఒక్క మహారాష్ట్రనుంచే ఉన్నారు. మిగతావారిలో 50 మంది ఢిల్లీ నుంచి, 30 గుజరాత్ నుంచి మరణించారు. ఇక మృతుల్లో తమిళనాడు (11), పశ్చిమబెంగాల్ 910),మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణలు (ఏడేసి), రాజస్థాన్ (6), ఆంధ్రప్రదేశ్ (6) బీహార్, ఛత్తీష్ గడ్, జమ్ము-కాశ్మీర్, కర్నాటక, పంజాబ్, ఉత్తరాఖండ్ (ఒకటేసి) ఉన్నాయి.