FLASH భారత రక్షణ శాఖ కార్శదర్శి కరోనా పాజిటివ్

భారత రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ కు కరోనా సోకింది. ఆయన కరోనా పాజిటివ్ అని పరీక్షలో తేలింది. దీనితో ఆయన కాంటాక్ట్ లను కనుగొనేందుకు అధికారులు పరుగులు పెడుతున్నారు.
కొద్దిగా జ్వరం రావడంతో  బుధవారం ఉదయం ఆయన  తనంతకు తానుగా  పరీక్షలు చేయించుకున్నారని హిందూస్తాన్ టైమ్స్ రాసింది. ఆయన ఆరోగ్యం నిలకడా ఉందని, ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉంటున్నారని అధికారులుచెప్పారు.
న్యూఢిల్లీరైసినా హిల్స్ సౌత్ బ్లాక్ లో ఉండే ఆయన కార్యాలయంలో దాదాపు 35 మంది ఉన్నత స్థాయి ఉద్యోగులున్నారు. అజయ్ కుమార్ పాజిటివ్ అనే తేలగానే వారందరినికి హోం క్వారంటైన్ కు పంపించారు. ఆయన ఆరోగ్యం ఈ రోజు ఎలా ఉందో తెలియడం లేదు. రక్షణ శాఖ ప్రతినిధులెవరూ మాట్లాడటం లేదు. ప్రభుత్వంలో ఉన్న అతి పెద్ద  హోదా ఉన్న అధికారి కావడంతో ఆయనను ఎవరెవరు కలిశారనేది తెలుసుకుంటున్నారు.  సెక్రెటరీ కాబట్టి ఆయన తో  ఉన్నత స్థాయి లో ఉన్నవారే సమావేశమయి ఉంటారు. వారిని కొనుగనే ప్రక్రియ మొదలయింది.
అయితే, ఆయన క్వారంటైన్ నుంచే పనిచేస్తున్నారని, పైళ్లు చూస్తున్నారని ఈ శాఖ ప్రతినిధులు చెప్పారు.