(బొజ్జా దశరథ రామి రెడ్డి)
రాయలసీమ ప్రజలు వేలాది మంది స్వచ్చందంగా పాల్గొని సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన చేసి సరిగ్గా నాలుగేళ్ళయ్యింది. సాధారణంగా శంకుస్థాపన కార్యక్రమాలు పాలకులో, ప్రభుత్వ అధికారులో నిర్వహిస్తారు.
అలాంటిది రాయలసీమ ప్రజానీకం సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన చేశారు. పాలకుల నిర్బందాలను ఎదిరించి, ఎలాంటి ఆవేశానికి గురికాకుండా, ఆవేదనతో, శాంతియుతంగా ప్రజలే స్వచ్చందంగా అలుగు శంకుస్థాపన నిర్వహించారు. రాయలసీమ ప్రజానీకం చేపట్టిన ఈ శంకుస్థాపన రాయలసీమ అస్తిత్వ పోరాటాన్ని సమాజం ముందు ఆవిష్కరించింది.
రాయలసీమ ప్రజానీకం తమ న్యాయమైన హక్కల కొరకు పోరాటాం చేయడానికి ఈ శంకుస్థాపన స్పూర్తినిచ్చింది. అలాంటి చారిత్రాత్మక శంకుస్థాపన నాలుగవ వార్షికోత్సవంను గ్రామ గ్రామానా నిర్వహించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మే 31, 2020 న నిర్వహించడమైనది.
ఈ వార్షికోత్సవం సందర్భంగా ఈ క్రింది వివరించిన తీర్మానాలు చేయడమైనది.
✓ సిద్దేశ్వర అలుగు నిర్మాణం మరియు రాయలసీమలోని ప్రాజెక్టుల నిర్మాణం సంపూర్తిగ జరిగే వరకు, వాటికి చట్టబద్ధ నీటి హక్కులు పొందేవరకు, రాయలసీమ సాంప్రదాయ వనరులైన చెరువుల నిర్మాణానికి ప్రత్యేక ఇరిగేషన్ కమీషన్ సాధించేంత వరకు పోరాటాలను కొనసాగించాలని ఈ వార్షికోత్సవ సందర్భంగా తీర్మాణించడమైనది.
✓ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జి వో నెంబర్ 203 ను స్వాగతిస్తూ తీర్మానించడమైనది. ఈ జీ వో ప్రకారం పనులను తక్షణమే ప్రారంభించి పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రభుత్వం చేపట్టాలని తీర్మానించడమైనది.
https://trendingtelugunews.com/english/features/will-siddheshwaram-ever-become-a-reality/
✓ రాయలసీమ నాలుగు జిల్లాలలోని వివిద కేంద్రాలలో జరిగిన వార్షికోత్సవ సమావేశాలలో రాయలసీమ ప్రజా సంఘాలు చేసిన తీర్మానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాలని తీర్మానించడమైనది.
✓ ప్రతిపక్ష మరియు ఇతర రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక కార్యాచరణను ప్రకటించాలని కోరుతూ ఈ సమావేశ తీర్మానాలను ప్రతిపక్ష పార్టీల ముందుంచాలని తీర్మానించడమైనది.
✓ తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అధినాయకులను కలిసి రాయలసీమలోని సాగునీటి వాస్తవ పరిస్థితులను వారికి వివరించాలని తీర్మాననించడమైనది.
✓ వెనుకబడిన రాయలసీమ, తెలంగాణా ప్రాంతాలకు తాగు, సాగు నీరు లభించడానికి నిర్మాణాత్మక కార్యాచరణను తెలంగాణా లోని రాజకీయ పార్టీలు చేపట్టాల్సిన ఆవస్యకతను వారికి వివరించాలని తీర్మానించడమైనది.
https://trendingtelugunews.com/telugu/rayalaseema-fight-for-siddheswaram-alugu-bojja-dasaratha-rami-reddy/
✓ రాయలసీమ తాగు, సాగునీటిపై సమాచారంను, వాస్తవ పరిస్థితులను మరింత సమగ్రంగా సభ్య సమాజం ముందు ఉంచడానికి తీర్మానించడమైనది.
వివిధ కేంద్రాల్లో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో కింద పేర్కొన్న రాయలసీమ ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.
హైదరాబాదు
1. హైదరాబాద్ :- రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ అభ్యదయ వేదిక, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక ప్రతినిధులు.
అనంతపురము జిల్లా
2. గుంతకల్లు :- జలసాధన సమితి అనంతపురం, న్యూ డెమొక్రసీ, అనంతపురం, OPDR- అనంతపురం
3. పుట్టపర్తి :- లోచర్ల పెద్దారెడ్డి మెమోరియల్ ఫౌండేషన్.
4. కళ్యాణదుర్గం :- రాయలసీమ సాంస్కృతిక వేదిక, కళ్యాణదుర్గం నీళ్ళ సాధన సమితి.
5. హిందూపురం :- జల సాధన సమితి
6. గోరంట్ల :- వేమన అద్యయన & అభివృద్ధి కేంద్రం
7. అనంతపురం :- జలసాధన సమితి, న్యూడెమోక్రసీ పార్టీ, రాయలసీమ యునైటెడ్ ఫోరం, రాయలసీమ ఐ.టి. ఫోరం – అనంతపురం,
8. పెనుగొండ :- రాయలసీమ సాగునీటి సాధన సమితి
9. వేపరాల :- వేపరాల గ్రామ రైతు సంఘం, గాండ్లపెంట మండలం.
10. గాండ్లపెంట :- గాండ్లపెంట సాగునీటి సాధన సమితి గాండ్లపెంట మండలం.
11. కఠారుపల్లి :- వేమన అద్యయనం & అభివృద్ధి కేంద్రం, గాండ్లపెంట మండలం.
12. తలుపుల: రూరల్ అగ్ర్రికల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ, రాయలసీమ సాగునీటి సాధన సమితి, తలుపుల
13. ఈదులపల్లి: రూరల్ అగ్ర్రికల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ, రాయలసీమ సాగునీటి సాధన సమితి, తలుపుల
14. వేపమానిపేట: రూరల్ అగ్ర్రికల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ, రాయలసీమ సాగునీటి సాధన సమితి, తలుపుల
15. మాడుకోళ్ళ పల్లి: రూరల్ అగ్ర్రికల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ, రాయలసీమ సాగునీటి సాధన సమితి, తలుపుల
16. గంజివారి పల్లి: రూరల్ అగ్ర్రికల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ, రాయలసీమ సాగునీటి సాధన సమితి, తలుపుల
17. గుర్రంవాండ్లపల్లి: రూరల్ అగ్ర్రికల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ, రాయలసీమ సాగునీటి సాధన సమితి, తలుపుల
18. నూతనకాల్వ: రూరల్ అగ్ర్రికల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ, రాయలసీమ సాగునీటి సాధన సమితి, తలుపుల
19. కొక్కంటి క్రాస్: రూరల్ అగ్ర్రికల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ, రాయలసీమ సాగునీటి సాధన సమితి, తనకల్లు
20. ఒ.డి.సి :- రూరల్ అగ్ర్రికల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ, రాయలసీమ సాగునీటి సాధన సమితి, ఒ.డి.సి
కడప జిల్లా
21. కడప :- రాయలసీమ సాగునీటి సాధన సమితి, OPDR – కడప, రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్, A.P. రజక సంఘం
22. రాయచోటి :- A.P. వడ్డెర విద్యావంతుల వేదిక, OPDR, MRPS, AISF
23. ప్రొద్దుటూరు :- వి.ర.సం.
24. మాదిరే పల్లి :- దువ్వూరు మండల రైతు సంఘం, రాయలసీమ సాగునీటి సాధన సమితి
25. కుమ్మరపల్లి :-రూరల్ అగ్ర్రికల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ, రాయలసీమ సాగునీటి సాధన సమితి, గాలివీడు
https://trendingtelugunews.com/telugu/siddheswaram-padayatra-gets-rousing-reception-along-the-way/