తెలుగు రాష్ట్రాలలో కరోనా దాగుడు మూతలు

రెన్నెళ్లుగా మూత పడిన  రెండు   తెలుగు రాష్ట్రాలు రెండూ తెరచుకుంటున్నాయి. జనం కదలిక మొదలయింది. నిత్యావసరా షాపులు తెరవడంతో మొదలయిన జనజీవనం ఇపుడు రెగ్యులర్ రైళ్లు,బస్లుల దాకా వచ్చింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలు మొదలువుత్నాయి. దేవాలయాలు, రెస్టరాంట్లు తెరుచుకుంటున్నాయి. రాత్రి కర్ఫ్యూ కూడా తగ్గుతూ ఉంది. అయితే, కరోనా మాతం ఈ రెండు రాష్ట్రాలలో దాగుడుమూతలాడుతూ ఉంది.
మొన్నటి దాకా తగ్గు ముఖం పట్టినట్టే పట్టి ఇపుడు మళ్లీ తలెత్తుతూ ఉంది.  తెలుగు ప్రజలతో దాగుడుమూతాలాడుతూ ఉంది.  ఒక రోజు ఉన్నట్లుంది కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతాయి  మరుసటి  తగ్గుతాయి. వారం రోజులపాటు మరణాలుండవు. తర్వాత వరుసగా భయపెట్టెలా మరణాల సంఖ్య పెరుగుతుంది. ఒక దశలో కరోనా కేసులు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి. ఇపుడేమో మూడంకెల్లోకి  దూకేశాయి.
 తెలంగాణలో ఆదివారం నాడు ఇంతవరకు లేనంత స్థాయిలో  199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఒక్క‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే  ఒక్కరోజే 122 మందికి కరోనా పాజిటివ్ అని తేలడం కొద్దిగా ఆశ్చర్యమేస్తుంది. ఆందోళన కలిగిస్తుంది.
ఇక వివరాల్లోకి వెళితే,  రంగారెడ్డి జిల్లా లో 40, మేడ్చల్‌లో 10, ఖమ్మంలో 9, మహబూబ్‌నగర్‌, జగిత్యాల, మెదక్‌లో 3 వరంగల్‌ అర్బన్‌లో 2, సూర్యాపేట, నిర్మల్‌, యాదాద్రి, జనగాంలో ఒక్కో కేసు చొప్పున బయటపడ్డాయి.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో ముగ్గురికి వైరస్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ బులెటీన్  వెల్లడించింది. ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2,698 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వారిలో 1428 మంది వ్యాధి న‌య‌మై వివిధ ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,188 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  ఇప్పటివరకూ మొత్తం క‌రోనాతో మృతి చెందిన‌వారి సంఖ్య 82కి చేరింది.
దీనికి ప్రభుత్వ వివరణ ఇది:The lockdown has been relaxed sincd May 16.  “It is being observed that there is a lot of mobility and movement of people from all walks of life and all age groups…some of them are not following the basic preventive measures such as wearing a mask, maintaining safe physical distance and not over-crowding.”అని ప్రభుత్వం ప్రకటనలో పేర్కొంది.
ఇక మరొక తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్  విషయానికొస్తే అక్కడ ఆదివారం 110 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇలా నూరు కంటే ఎక్కువ కేసులు నమోదుకావడం వరుసగా నాలుగో రోజిది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3571 కి చేరింది.  ఆంధ్రకేసులలో చెన్నై కోయంబేడ్ మార్కెట్ నుచి వచ్చినవి220 కేసులున్నాయి. విదేశాలనుంచివచ్చినవి 111.
నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందగా మొత్తంగా  ఇప్పటివరకూ 62 మంది ప్రాణాలు కోల్పోయారు.
గడిచిన 24 గంట్లోల 9504 మంది నుంచి నమూనాలను సేకరించింది ఏపీ ప్రభుత్వం. 2322 మంది బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగ 1177 మంది చికిత్స (active cases) పొందుతున్నారు.
ఆంధ్రకు సంబంధించి కర్నూలు, కృష్ణా జిల్లా టాప్ రెండు స్థానాలలో ఉన్నాయి. కర్నూలు కేసులు 700 దాటితే,   కృష్ణా జిల్లా నుంచి 500 దాటాయి. గుంటూరు పరిస్థితి ఇంతే. రాష్ట్రంలోని కేసులలో ఈ మూడు జిల్లాల వాట 50 శాతం. నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వం విడుదల చేస్తున్న బులెటీన్ చెబుతున్నది.