దేశమంతా లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు మెల్లిమెల్లిగా. షాపులు,సూపర్ బజార్లు తెరుచుకుంటున్నాయి. బస్సులు తిరగడంమొదలు పెట్టాయి. పరిమితంగానైనా రైళ్లు విమానాలు తిరుగుతున్నాయి.
ఇవన్నీ వచే కొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో తిరుగుతాయి.బజార్లోంచి కరోనా భయం కొద్దికొద్ది గా తగ్గుతూ ఉంది. మొదట్లో మూతికి మాస్క్ వేసుకుని తిరిగిన జనం కొద్ది రోజుల్లో నిర్భయం మాస్క్ తీసేసి తిరుగుతారు. శానిటైజర్ తో చేతులు కడక్కోవడం తగ్గిస్తారు. కరోనా భయం రోడ్డు మీద మాయమవుతుంది. ఇంట్లోకి దూరుతుంది
https://trendingtelugunews.com/telugu/breaking/telangana-boy-dies-in-borewell/
కరోనా అనుమానం పెనుభూతంలాగా మన గుండెళ్లోకి ప్రవేశిస్తుంది, ఆవహిస్తుంది. గుండె దడదడ పెంచుతుంది. దగ్గినా తుమ్మినా మనల్ని వణికిస్తుంది.ఇంట్లో వాళ్లను బెదరగొడుతుంది.
ఒకరి నుంచి ఒకరికి అంటుకుని అందరిని క్వారంటైన్ కు పంపిస్తుందనేది కాదు ఈ భయానికి కారణం. కరోనా టెస్ట్ కాస్ట్ ఈ భయానికి కారణం. కరోనా టెస్ట్ కాస్ట్ మినిమిం రు. 2500 నుంచి రు. 3,500 దాకా ఉండేలా కనిపిస్తున్నది.
దీనికి టెస్ట్ సిఫార్సు చేసిన డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు, ఆపైన మందులు మాకులు కలిపితే మూడు వేల నుంచి నాలుగు వేల దాకా ఖర్చవుతుంది.
https://trendingtelugunews.com/telugu/breaking/9th-century-shiv-lingam-excavated-from-vietname-cham-temple-complex/
ఇదీ ఇకనుంచి దేశంలో ఉన్న మధ్య తరగతి కుటుంబాలను,పేద వాళ్లను భయపెట్టేది.ఇక మనలను పీడించేంది కరోనావైరస్ కాదు, కరోనా అనుమానం. కళ్ల ముందు కదిలాడే కరోనా వైద్య పరీక్షల ధర. కరోనా డాక్టర్ ఆకారం.
ఈ టెస్టులను ఆరోగ్య శ్రీ కిందికి తెస్తే కొంతమందికి ఉపశమనం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కరోనా పరీక్షలను సిజిహెచ్ ఎస్ కిందికి తీసుకువచ్చింది. రాష్ట్రాలు తమ నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. అంతదాకా కరోనా అనుమానం పీడిస్తూ ఉంటుంది.
దగ్గొచ్చినా, తుమ్మొచ్చినా, వొల్లు కొద్దిగా వేడిక్కినా ఈ నాలుగు వేల రుపాయాలు కళ్ల ముందు కదిలాడి ప్రతిమషిని పిశాచిలాగా భయపెడతాయి.
https://trendingtelugunews.com/english/features/pakka-inti-ammayi-padosan-relangi-hero-anjali-heroine/
కరోనా పరీక్ష అంటే షుగర్ టెస్టు, మలేరియా టెస్టులాంటిది కాది, షుగర్ పరీక్షని వంద కాకుంటే రెండొందలతో చేయించుకోవచ్చు. కరోనా పరీక్ష ఇలా కాదు, ధర వేలలోనే ఉంటుంది. దీనికితోడు మనిషికి దగ్గు జలుబు ఎపుడూవస్తూనే ఉంటాయి. వచ్చినపుడల్లా అది కరోనానేమో అనేభయం కూడా నీడలా వెంటాడుతుతుంది. ఇది వైద్యరంగానికిది వరప్రసాదం.
ఇండియన్ కౌన్సి ల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కరోనా టెస్ట్ మీద ఉన్న రు. 4,500 సీలింగ్ ఎత్తేసింది. కాని ధరను నిర్ణయించలేదు.
దేశం లో కరోనా టెస్టింగ్ కిట్లు తయారు కావడం లేదని, విదేశాలనుంచి ఇవి దిగుమతి చేసుకుంటున్నామని, RT-PCR (Reverse Transcriptase-Polymerase Chain Reaction) కరోనా టెస్టుకు రు. 4,500 దాకా ఇవ్వవచ్చని గతంలో ఐసిఎం ఆర్ ఈ ధర నిర్ణయించింది.
ఈ రేటే చాలా ఎక్కువని అనేక రాష్ట్రాలు గగ్గోలు పెట్టాయి.
ప్రభుత్వం ప్రయివేటు ల్యాబ్స్ లో కరోనా పరీక్షలు చేయిస్తే, ఈ రేటు చెల్లించాల్సి వస్తుంది.
అందుకే చాలా రాష్ట్రాలు ప్రయివేటు ల్యాబ్స్ లో పరీక్షలు చేయించడంలేదు. ఇలాంటి వాటిలో తెలంగాణ ఒకటి.
పరీక్ష ధర రు. 4500 గా నిర్ణయిస్తూనే, ఐసిఎంఆర్ కరోనా ఉపద్రవంగా మారింది కాబట్టి పరీక్షలు ఉచితంగా చేయాలని కార్పొరేట్ ఆసుప్రతులను కోరింది.అయితే, ఏ ఆసుపత్రి దీనికి అంగీకరించలేదు.
చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయివేటు ఆసుపత్రులతో సంప్రదింపుల కరోనా ద్వారా టెస్టు ధరలను బాగా తగ్గించుకుంటే, ఐసిఎంఆర్ రు. 4500 ధర నిర్ణయించడం ఏమిటో అర్థం కాదు.
ఇపుడు టెస్టు కిట్స్ సమృద్ధిగా దొరుకుతున్నాయని, టెస్టు లు చౌక అయ్యాయని చెబుతూ అంత ధర అవసరంలేదని ఈ సీలింగ్ ఎత్తేసింది.
సీలింగ్ ఎత్తేస్తే ధర తగ్గుందని ఐసిఎంఆర్ ఐడియా. సీలింగ్ ఎత్తేసినా, ఖర్చులెక్కువయ్యాయని, క్వాలిటీ పరీక్ష జరపాలని, లాక్ డౌన్ పీరియడ్ లో భారీగా నష్టపోయాామని చెబుతూ ప్రయివేటు ఆసుపత్రులు వాళ్లు రేటు రు. 4500 కంటే ఎక్కువగా వసూలు చేసే ప్రమాదమూ ఉంది.
సీలింగ్ ఎత్తేసిన విషయాన్ని ఐసిఎంఆర్ రాష్ట్రాలకు ఒక లేఖ రాస్తూ తెలియ చేసింది. ఈ టెస్టు ధరలను ప్రయివేటు ఆసుపత్రులతో సంప్రదించి నిర్నయించుకోండని సలహా ఇచ్చింది. అవినీతిలో అగ్రభాగాన వ్యవస్థలో ఈ నిర్ణయం ప్రజలకు అనుకూలంగా ఉంటుందా. కష్టమే.
దీని మీద White Coated Corruptionపేరుతో Indian Journal of Medical Ethics లో ఒక ఆసక్తి కరమయిన వ్యాసం అచ్చయింది. ఒక సారి చదవండి.
భారతదేశంలో ప్రయివేటు వైద్య రంగం కూడా అవినీతి మయమే. అక్కడ వ్యాపారమే తప్ప నైతిక విలువల శూన్యం. చివరకు కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ ఆసుప్రతి కూడా రోగులను తెప్పించుకునేందుకుక డాక్టర్ల కు భారీగా ముడుపులు చెల్లించింది. దీని మీద ఇంత పెద్ద ఆసుపత్రికి మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నుంచి చివాట్లు పడ్డాయి.
హైాదరాబాద్ లో ఉన్న చాలా కార్పొరేట్ వైద్యశాలలు పల్లెల్లో ఆర్ ఎం పి డాక్టర్లను ఏజంట్లుగ పెట్టుకున్నాయి. రోగులను చేస్తే వాళ్లు కార్పొరేట్ ఆసుపత్రులకు తోలుతారు. దీనికి ఆసుపత్రుల దగ్గిర నుంచి కమిషన్లు తీసుకుంటారు.ఆర్ ఎం పిలకు వచ్చే ఆదాయం ఇలాంటిదే.
ఇలాంటి వాతావరణంలో ఇక ముందు నీతినియమాలు లేని డాక్టర్లు కరోనా పరీక్షలు తెగ రాసేసి కమిషన్లు కొట్టరని గ్యారంటీ ఏముంద?
ఇలాంటపుడు ఈ కరోనా టెస్టు ధరను ఎలా నిర్ణయిస్తారో అందరికి తెలిసిందే. ధర నిర్ణయించడంలో భారీగా డబ్బులు చేతులు మారతాయని అందిరికి తెలిసిందే. కనీసం ఈ అనుమానమయినా వస్తుంది. అందువల్ల టెస్టు ధర కచ్చితంగా వేల ల్లోనే ఉంటుంది.
కర్నాటక ఈ విషయంలో ఒకడుగు ముందుకేసి ఐసిఎంఆర్ కంటే ముందే RT-PCR టెస్టుధర రు.2,250 గా ఉండేలా ఒప్పందం చేసుకుంది.
ప్రయివేటు లాబ్స్, ప్రభుత్వం పంపే శాంపిల్స్ కు ఈ ధర ఉంటుంది. మరి ప్రయివేటు ఆసుపత్రులు పంపే శాంపిల్స్ ధర ఎలా ఉంటుందో కర్నాటక ఇంక ప్రకటించలేదు. కర్నాటక ఇంత తక్కువ ధరను బేరాం చేయగలిగితే, ధరని రు. 4,500 గా ఐసిఎంఆర్ ఎలా నిర్ణయిస్తుంది.
ఇక్కడే తిరకాసు ఉంది. రకరకాల కారణాల వల్ల నగరాలలో ఉండే ప్రజలు ప్రయివేటు ఆసుపత్రులకే ఎక్కువగా వెళతారు. వాళ్లే పరీక్షలు సిఫార్సు చేస్తారు. లేదా పరీక్షలు అక్కడే చేస్తారు. ప్రయివేటు ఆసుపత్రుల కరోనా పరీక్షల రేట్లు ప్రభుత్వం నిర్ణయించగలదా? కష్టం.
ఉదాహరణకు ఢిల్లీ లో ని ప్రయివేటు ల్యాబ్స్ ప్రభుత్వం నుంచి ప్రతి టెస్టుకు రు. 3,500 వసూలు చేయాలని నిర్ణయించాయి. ఢిల్లీ ప్రభుత్వానికి ఈ రేటు కు పరీక్షలు నిర్వహిస్తామని తామే చెప్పినట్లు డాక్టర్ లాల్ ప్యాథ్ లాబ్స్ ఛెయిర్మన్ అరవింద్ లాల్ హిందూస్తాన్ టైమ్స్ కు చెప్పారు.
భారతదేశంలో 428 ప్రభుత్వ ల్యాబ్ లు, 182 ప్రయివేటు ల్యాబ్ లే ఉన్నాయి. వీటి కెపాసిటీ రోజుకి కేవలం 1,40,00 పరీక్షలు మాత్రమే.
అయితే, ధరలు తగ్గిస్తే పరీక్షల క్వాలిటీ తగ్గుతుందని, అది ప్రమాదమని చెబుతూ ధరలను మరీ తగ్గించకుండా చూసేందుకు ప్రయివేటు ల్యాబ్ లు ప్రయత్నిస్తున్నాయి.
“PPE (personal protective equipment)ధరలు తప్ప టెస్ట్ కిట్స్ ధర లు ఇంకా అధికంగానే ఉన్నాయి.ఒక టెస్టు ధర రు. 1600 దాకా ఉంటుంది. భారతదేశం కిట్స్ మీద ఇంకా ప్రజల్లో నమ్మకం లేదు. అందువల్ల అంతా ఇంపోర్టెట్ టెస్టులనే వాడాలంటారు. ఇపుడు ఐసిఎంఆర్ నిర్ణయించిన రు. 4500 వల్లే మాకు లాభం లేదు. ఇక తగ్గిస్తేఎలా’ అని ఒక ల్యాబ్ ప్రతినిధి చెప్పారు.
అంటేధరలు తగ్గించడాన్ని ప్రయివేటు ల్యాబ్ సెక్టర్ వ్యతిరేకిస్తుంది. ఎక్కవ ధర ఉండాలని పట్టబడుతుంది. ప్రభుత్వాన్ని తనకు అనుకూలంగా తిప్పుకునే సత్తా ప్రయివేటు రంగానికి ఉంది.
ఇలాంటపుడు ఇంట్లో ఎవరూదగ్గినా, తుమ్మినా, వొల్లు వేడిక్కినా కరోనానేమో అనే భయం వెంటాడుతుంది ఇంట్లో వారందరిని. ఎందుకైనా మంచిది డాక్టర్ ను కలవాలనిపిస్తుంది. డాక్టర్ ఎందుకైనా మంచిది RT-PCR టెస్టు చేయించండి అంటారు. అపుడు ఎక్కడో ఉన్న ఈల్యాబ్ కు వెళ్లాలి. రక్తం, గళ్ల పరీక్షల డయాగ్నోస్టిక్ సెంటర్లలాగా ఈ ల్యాబ్ లు ప్రస్తుతానికి ఎక్కడ బడితే అక్కడ లేవు.
కాబట్టి కార్పొరేటు ఆసుపత్రులకే వెళ్లాలి. అక్కడ మూడు నాలుగు వేలు చెల్లించి పరీక్ష చేయించాలి. తర్వాత రిజల్టు నెగటివ్ వస్తే, హమ్మయ్య అనుకునినాలగయిదు వేలు ఖర్చు పెట్టుకుని నీరసంగా ఇంటికి రావలసి వస్తుంది. అందుకే ఇకనుంచి దగ్గినా,తుమ్మినా, కొద్ది వొల్లు వేడిచేసినా…కరోనాభయం, దెయ్యంలాగా పీడిస్తుంది. ఇక దీనికి సిద్ధం కండి.