ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్నరాయలసీమ ఎత్తి పోతల పథకానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుకట్ట వేసింది. గొవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ కు స్పందిస్తూ చెన్నై లోని సదరన్ జోన్ బెంచ్ ఈ ప్రాజక్టును చేపట్టకుండా రెన్నళ్ల పాటుతాత్కాలిక స్టే ఇచ్చింది.
శ్రీనివాస్ తరఫున న్యాయవాది కరణం శ్రవణ్ కుమార్, కోతై ముత్తు మీనల్ వాదించారు. కృష్ణా నది (శ్రీశైలం రిజర్వాయర్ ) నుంచి సంగమేశ్వరం ప్రాంతం దగ్గిర రోజుకు 3 టిఎంసిల నీటిని తోడుకునేందుకు ఏర్పాటుచేస్తున్న ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజక్టు పర్యావరణ అనుమతి లేదని పిటిషనర్ వాదించారు.విచారణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది.
ఈ ప్రాజక్టు నిర్మిస్తే, ఈ ప్రాంతంలోని జీవావరణానికి అంటే మొక్కలకు, జంతువులకు, ముఖ్యంగా ఈ ప్రాజక్టు వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలజీవనోపాధి మీద ఎలాంటి దుష్ప్రభావం చూపిస్తుందో ఒక నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కూడా పిటిషనర్ ట్రిబ్యునల్ ను కోరారు.
’ఈ ప్రాజక్టుకు పర్యావరణ అనుమతి లేదు. అయితే, పర్యావరణ అనుమతి నియమం నుంచి తప్పించుకునేందుకు లిఫ్ట్ నుంచి తక్కువ నీటి తోడుకుంటున్నట్లు లెక్కలుచూపిస్తున్నారు.నిజానికి దీని వెనక తెలంగాణ ప్రజా ప్రయోజనాలు దెబ్బతినేలా కృష్ణజాలాలను ఆంధ్రప్రదేశ్ కు తరలించుకుపోయే భారీ పథకం ఉంది,‘ అని కూడా పిటిషర్ వాదించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2104 లోని 84వ అధికరణం ప్రకారం , ఈ ప్రాజక్టుకు కృష్ణా నది మేనేజ్ మెంట్ బోర్డ్ (KRMB) అనుమతి అవసరమని, అయితే, ఆంధ్రప్రదేశ్ బోర్డు నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని కూడా పిటిషనర్ పేర్కొన్నారు.
అనంతరం సౌత్ జోన్ బెంచ్ జ్యుడిషియల్ సభ్యుడు కె రామకృష్ణ, ఎక్స్ పర్ట్ సభ్యుడు సైబాల్ దాస్ గుప్తా లు ప్రాజక్టు మీద స్టే ఇచ్చారు.
అంతేకాకుండా ఈ ప్రాజక్టు మీద ఒక నివేదికను రెనెళ్లలో సమర్పించేందుకు ఒక నిపుణుల కమిటీని కూడా నియమిచారు. ఆంధ్ర ప్రదేశ్ తరఫున మాధురి రెడ్డి ట్రిబ్యునల్ కు హాజరయ్యారు.
కోర్టు ఇచ్చిన ఉత్తర్వు లో ఇలా ఉంది:
“…in order to ascertain as to whether the Environmental Clearance (EC) is required or not and what are all the precautions to be taken to protect the environment or what prior clearances/permissions to be obtained for the purpose of implementing such schemes, whenever it relates to sharing of water between two states and whether such permissions/recommendations have been obtained or not and whether precautions taken by the State of Andhra Pradesh to implement the scheme are sufficient to protect the environment and also exploitation of social resources like water a Joint Committee is proposed.”