కేంద్రం విమానాలను నడిపే అవకాశాలను పరిశీలిస్తున్నపుడు మహారాష్ట్ర విమానాలు నడపడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. మహారాష్ట్రంలో మూడు పెద్ద విమానాశ్రయాలున్నాయి. ఇందులో ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ , పుణే , నాగపూర్ విమానాశ్రయాలున్నాయి. అయితే, ఇవన్నీ రెడ్ జోన్ లో ఉన్నాయి. రెడ్ జోన్ లలో ఉన్న విమానాశ్రయాలను తెరవడం వల్ల చాలా సమస్యలున్నాయని చెబుతూ ఈ విమానాశ్రయాలనుంచి రాకపోకలను అనుమతించడం సాధ్యం కాదని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ చెప్పారు.
దేశంలో కరోనా తీవ్రంగా రాష్ట్రాలో మహారాష్ట్ర నెంబర్ వన్. అందువల్ల ఈ రాష్ట్రం లాక్ డౌన్ నియమాలు సడలించేందుకు ఆచితూచి అడుగేస్తూ ఉంది.
ఇది కూడా చదవండి
ఆయుర్వేద మూలిక అశ్వగంధలో కరోనా ఔషధ గుణాలు : ఢిల్లీ ఐఐటి
“ఏదోమొక్కుబడిగా ప్యాసెంబర్లకు ధర్మల్ స్కానింగ్ చేసి పంపడం మంచిదికాదు. వచ్చే వాళ్లందరికి నేజల్ , థ్రోట్ స్వాబ్ పరీక్షలుచేయాలి. తర్వాత వచ్చే ప్యాసెంజర్లందరికి బస్సులు, టాక్సీలు , ఆటోలు నడపడం సాధ్యం కాదు,” అని దేశ్ ముఖ్ చెప్పారు.
అసలే విమానాశ్రయాలు రెడ్ జోన్ లలో ఉన్నాయి, వీటికి మరిన్ని పాజిటివ్ కేసుల తోడయిన నిర్వహణ కష్టమవుతుంది. నగరంలో ఉన్న గ్రీన్ జోన్ ల నుంచి విమానాశ్రయాల రెడ్ జోన్ లకు ప్రయాణికులను అనుమతించడమంటే వారి రిస్క్ ను పెంచడమే అవుతుంది. ఇదంత తెలివైన చర్య కాదు. అలాగనీ ఇంత పెద్ద ఎయిర్ పోర్టో లలో కరోనా వైరస్ నియంత్రణ స్కానింగ్ ఏర్పాట్లు చేసేందుకు చాలా మంది సిబ్బంది కావాలి. దీని వల్ల కోవిడ్ రిస్క్ పెరుగుతుంది, అని దేశ్ ముఖ్ చెప్పారు.
మే 19న లాక్ డౌన్ ను పొడిగిస్తూఇచ్చిన జివొలో మార్పు లేదని ఆయన చెప్పారు. ఆ జివొ ప్రకారం, ఎమర్జీన్సీ సర్వీస్ లు, అంబులెన్స్ సర్వీసులు మాత్రమే అంగీకరించాల్సి ఉంది.