ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలనూ, తీసుకువచ్చిన జీవోలను న్యాయస్థానాలు తప్పుబట్టడమే కాదు రద్దుచేయడమూ వరుసగా కొనసాగుతోంది
ఇలా, ఒకటి కాదు రెండు కాదు- ఏకంగా 60కి పైగా సందర్భాలలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రాష్ట ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టింది.
హైకోర్టు తీర్పులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సందర్భాలలో కూడా ఉపశమనం లభించడం లేదంటే ప్రభుత్వ ఆలోచనాా విధానంలో లోపం ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మందబలం ఉన్నందునో, స్వప్రయోజనాల రీత్యానో పాలకులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే, కనీసం కోర్టులు తప్పుబట్టాకైనా సదరు నిర్ణయాలను ఉపసంహరించుకోవడం ఉత్తమం. కానీ, అదే ప్రయత్నాన్ని దొడ్డిదారిన కొనసాగించి తీర్పు లక్ష్యానికి తూట్లు పొడవడం ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్నది.
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు పూసే విషయంలో పాలకులు ఇలా కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేయడంతో సదరు జీవోను కొట్టివేయడంతో పాటు, కోర్టు ధిక్కరణ ప్రక్రియ గురించి కూడా న్యాయస్థానం మాట్లాడవలసి వచ్చింది.
కోర్టులు తప్పుబడతాయని తెలిసినా వందలకోట్ల ప్రజాధనం వెచ్చించి రంగులు వేయడానికి పూనుకోవడం, అవి చెప్పిన తరువాత కూడా పాలకులు తమ పంథా మార్చుకోకపోవడం విచిత్రం.
సర్కార్ కు వ్యతిరేకంగా ఏం జరిగినా.చంద్రబాబే చేయించారని ఆరోపణలు చేయడానికి ఇప్పటి వరకూ వైసీపీ నేతలు వెనుకాడేవారు కాదు. అయితే.. ఇప్పుడు ఏకంగా న్యాయవ్యవస్థపైనా చంద్రబాబు ముద్ర వేసేందుకు ప్రయత్నించడం జరుగుతున్నది. ఈ ధోరణి రాజకీయవర్గాల్లోనూ కలకలం రేపుతోంది.
ఇప్పటి వరకూ బీజేపీ నేతలు ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారు టీడీపీకి అమ్ముడుపోయారని ఆరోపించేవారు..రాజకీయంగా ఆరోపణలు చెల్లుతాయి కాబట్టి సరిపోయింది కానీ.. ఇప్పుడు..చట్ట విరుద్ధంగా.. రాజ్యాంగ విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలు కోర్టులు కొట్టి వేస్తూంటే. కోర్టులపైనా చంద్రబాబు ప్రభావం ఉందని.. ఆయన మేనేజ్ చేస్తున్నారని ప్రచారం చేయడానికి ఏ మాత్రం వెనుకాడకపోవడం. అందర్నీ విస్మయపరుస్తోంది.
డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయింది. పీపీఈ కిట్లు అడిగిన ఓ డాక్టర్‌కు ఇండియాలో ఇలాంటి గతి పట్టిందంటూ.. అంతర్జాతీయ మీడియా అంతా ప్రముఖంగా చెబుతోంది. బీబీసీ వరల్డ్ తోపాటు.. బ్రిటన్ ఇతర పత్రికలు కూడా.. ప్రచురించాయి. సుధాకర్ ఎలాంటి మాటలైనా మాట్లాడి ఉండవచ్చు.. ఎలాంటి నేరం అయినా చేసి ఉండవచ్చు కానీ పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచింది.
పోలీసులు చెబుతున్నదానికి.. అక్కడ జరిగిన దానికి తేడా ఉండటంతో.. హైకోర్టు నిజానిజాల నిర్ధారణకు ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించింది. అయితే.. దీన్ని తప్పు పడుతున్నారు ఆమంచి కృష్ణ మోహన్. ఆమంచి వ్యాఖ్యలు కోర్టును కించ పరిచడమేనని..సుమోటోగా కేసు నమోదు చేసి..చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు ఇతర పార్టీల నుంచి వినిపిస్తున్నాయి.
ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకపక్క కూల్చివేతల పర్వం కొనసాగిస్తూనే మరోవైపు అమ్మకాల పర్వం కూడా మొదలుపెట్టింది. బిల్డ్ ఏపీ పేరుతో ఆంధ్రప్రభుత్వ ప్రభుత్వానికి చెందిన మార్కెట్లు, ఉద్యోగుల క్వార్టర్లను అమ్మేయడానికి వేలం పాటలు ప్రారంభించబోతున్న ఏపీ సర్కార్. ఇప్పుడు తిరుమల శ్రీవారి ఆస్తులనూ అమ్మకానికి పెట్టింది. తమిళనాడులో 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయానికి కమిటీలు ఏర్పాటు చేసింది. ఆస్తుల విక్రయం కోసం టీటీడీ పాలకమండలిలోనే తీర్మానం చేసి మరీ 8 కమిటీలు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో.. పాలనా పరంగా అతి పెద్ద లోపం ఆర్థిక నిర్వహణలోనే కనిపిస్తోంది. ఎక్కడా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పాలన సాగుతోంది. పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నారు. ఆస్తులు అమ్ముతున్నారు. కానీ.. ఎక్కడా అభివృద్ది పనులు కనిపించడం లేదు. సంపద సృష్టి అసలు జరగడం లేదు.
ఎక్కడికక్కడ అప్పులు తీసుకొచ్చి పథకాలు అమలు చేస్తున్నా. పరిస్థితి మాత్రం దారుణంగా మారిపోతోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఖర్చులు తగ్గిపోవడమే కాదు. రెండు నెలల పాటు ఉద్యోగుల జీతాలు సగమే చెల్లించారు. కానీ కేంద్రం నుంచి మాత్రం దండిగా నిధులు వస్తున్నాయి. ప్రభుత్వాలు కట్టాల్సిన చెల్లింపులన్నీ.. తర్వాత కట్టొచ్చని ఆర్బీఐనే ఆఫర్ ఇచ్చింది. ఇవన్నీ కలసి రావడంతో.. మిగిలే డబ్బులను.. ప్రభుత్వం మరో విధంగా వాడుకుంటోంది. కానీ రేపటి పరిస్థితి మాత్రం భయంకరంగా కనిపించబోతోంది.
(Kilaru Dileep, Vijayawada LS constituency Convenor and Spokesperson APBJP)