170 కి.మీ ప్రయాణించి దుబ్బాక చేరిన గోదావరి జలాలు

దుబ్బాక, మే 20 : సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం హసన్ మీరాపూర్ లో బుధవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టు 12వ ప్యాకేజీలోని డిస్ట్రిబ్యూటరీ-1, 6 ఆర్ కాలువ నిర్మాణ పనులను దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా  మాట్లాడుతూ దాదాపు 170 కిలో మీటర్ల ప్రయాణం తర్వాత గోదావరి జలాలు మన దుబ్బాక ప్రాంతానికి వచ్చాయని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
పెద్దగుండవెళ్లి కాలువ ప్రధానమైన కాలువతో పాటు హసన్ మీరాపూర్, చింతమడక, అంకంపేట, నారాయణరావుపేట గ్రామాల్లో పారే కాలువ పనులను ప్రారంభించినట్లు తెలిపారు.
హసన్ మీరాపూర్, పెద్ద గుండవెళ్లి చౌద చెరువు, దుంపలపల్లి పెద్ద చెరువు, దుబ్బాకలోని నల్ల చెరువు, రామ సముద్రం, ధర్మాజీపేటలోని పెద్ద చెరువు, చిట్టాపూర్ పెద్ద చెరువులను ప్రధానమైన పెద్ద చెరువులన్నీ ఈ కాలువ ద్వారా నిండుతాయని మంత్రి పేర్కొన్నారు.

https://trendingtelugunews.com/telugu/breaking/cab-aggregator-ola-to-fire-1400-employess-revenue-down-by-95-percent/

హసన్ మీరాపూర్, పెద్ద గుండవెళ్లి, చింత మడక, మాచాపూర్, చెల్లాపూర్, రాజక్కపేట, ముస్తాబాద్ మండలం బదనకల్, మోయిని కుంట గ్రామాల్లోని 13 వేల ఆయకట్టుకు సాగునీరు అందిస్తుందని తెలిపారు. సిద్ధిపేట రూరల్, దుబ్బాక, ముస్తాబాద్ మూడు మండలాలు, 8 గ్రామాల్లో ఈ కాలువ ప్రవహిస్తుందని వివరించారు.
 ఈ వాన కాలంలోపే మన ప్రాంత చెరువులు నింపుకుంటే  రైతులకు రెండు పంటలు పండాలన్నదే సీఏం కేసీఆర్ గారి ఆశయమని, ఇందుకు అనుగుణంగా స్థానిక సర్పంచ్ లు, ఏంపీటీసీలు, ఇతర ముఖ్యులు ముందుకొచ్చి పనులు వేగవంతం చేసేందుకు సహకరించాలని ప్రజాప్రతినిధులకు మంత్రి పిలుపునిచ్చారు.
ప్రభుత్వం ప్రతి రైతుకు సాయం అందిస్తుందని, చట్ట ప్రకారంగా రావాల్సిన ప్రతి పైసా రైతులకు త్వరితగతిన చెల్లిస్తామని రైతులకు మంత్రి భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ ఆనంద్, డీఈ రవీందర్ రెడ్డి, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

(Like this story? Please share it to a friend!)