కరోనా కేసులకు సంబంధించి ప్రపంచదేశాలతో పోలిస్తే భారతదేశం చాలా ముందుంది.ప్రపంచదేశాలన్నీ కరోనాభారంతో క్రుంగిపోతున్నాయి. భారత్ మాత్రం కఠిన ఆంక్షలు విధించి మంచిఫలితాలుసాధించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ప్రతి లక్ష జనాభాకు ఉన్న కరోనా కేసుల భారతదేశం ఆగ్రరాజ్యాలను అధిగమించింది. భారీగా జనాభా ఉన్నదేశాలలో భారత్ పరిస్థితి భిన్నంగా, చాలా చాాలా మెరుగ్గా ఉండటం ప్రపంచాన్ని అశ్చర్యపరుస్తున్నది.
వివిధ దేశాల కరోనా భారం ఇలా ఉంది
భారతేదేశంలో ప్రతిలక్ష జనాాభాకు 7.1 కరోనా కేసులున్నాయి. ఇది అగ్రరాజ్యాలు వూహించలేనంత తక్కువ. అంతర్జాతీయంగా ఇదే ప్రతిలక్ష జనాభాకు 60కేసులున్నాయి. అమెరికాలో ప్రతిలక్ష జనాభాకు 431 కేసులున్నాయి. దేశాధ్యక్షుడు ట్రంప్ కు ఇందుకే కంపరం పుడుతూ ఉన్నట్లుంది. ఇక రష్యాలో 195 కేసులున్నాయి.
అదే ఇంగ్లండులో ప్రతిలక్ష జనాభాకు 316 కేసులున్నాయి. స్పెయిన్ లో 494 కేసులున్నాయి. ఇటలీలో 372 కేసులుంటే, బ్రెజిల్ లో 104 కేసులున్నాయి. జర్మనీలో 210 కేసులున్నాయి. ఇక టర్కీ విషయానికొస్తే ప్రతిలక్షజనాభాకు అక్కడ 180 కేసులున్నాయ్. ఫ్రాన్స్ లో 209 కేసులు, ఇరాన్ 145 కేసులున్నాయి.
ఇక రోజు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి విడుదలయిన సమాచారం ప్రకారం, దేశంలో కరోన బాధితుల సంఖ్య 1,01, 139 చేరినట్లు
ఇందులో 58, 802 మందికి కొనసాగుతున్న చికిత్స కొనసాగుతున్నది
కరోన నుండి ఇప్పటి వరకు 39,173మంది బాధితులు కోలుకున్నారు.
కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 3,163 మంది మృతి చెందారు.
గడచిన 24 గంటల్లో 4, 970పాజిటివ్ కేసులు నమోదు కాగా 134మంది మృతిచెందారు.