అన్న వచ్చాడు – ఆంధ్రాని అమ్ముతున్నాడు, అన్నవచ్చాడు, కరెంట్ షాక్ ఇచ్చాడు, నినాదాలతో రేపు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు, తప్పుడు నిర్ణయాల వలన రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది, రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తున్న భాారతీయజనతా పార్టీ విమర్శించింది.
రాష్ట్రంలో విపరీతంగా కరెంటు బిల్లులు పెంచినందుకు నిరసనగా బిజెపి రేపు ఆందోళన నిర్వహిస్తూ ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు,కార్యాలయ ఇంచార్జ్ తురగా నాగభూషణం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రకటనలో లేవనెత్తిన అంశాలు:
1.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ బిల్లుల స్లాబ్ లో మార్పులు చేయడం వలన రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు విద్యుత్ చార్జీలు భారీగా పెరిగాయి.
2.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను, భూములను విక్రయించి రాష్ట్ర భవిష్యత్తును బలి చేసే విధంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఈ రెండు తప్పుడు నిర్ణయాలు, ప్రజలకు,రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ స్లాబ్ మార్పు ద్వారా చార్జీల పెంపును, ప్రభుత్వ భూముల విక్రయం నిర్ణయాలను ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారి సూచన మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయాలని నాయకులు మరియు కార్యకర్తలను పిలుపునిచ్చింది.
రేపు అనగా 19.5.2020 ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు అందరూ తమ తమ నివాసాల వద్దే గంట పాటు నల్ల రిబ్బన్లు బ్యాడ్జ్ లుగా ధరించి నిరసన వ్యక్తం చేయాలి.ఈ క్రింద తెలిపిన స్లోగన్లు ప్లకార్డ్ రూపంలో పట్టుకుని నిరసన వ్యక్తం చేయాలి..
ప్రతిపక్షనాయకుడిగా ఉన్నపుడు వైసిపి జగన్ గురించి వాడిన నినాదాలకు వ్యంగంగా కౌంటర్ నినాదాలను బిజెపి రూపొందించింది.
1. అన్న వచ్చాడు – కరెంట్ షాక్ ఇచ్చాడు. సవరించిన కరెంట్ స్లాబులను వెంటనే రద్దు చేయాలి.
2. అన్న వచ్చాడు – ఆంధ్రాని అమ్ముతున్నాడు. ప్రభుత్వ భూముల విక్రయ G.O ని వెంటనే రద్దు చేయాలి.
3.అన్న రావాలి అన్నది….విద్యుత్ షాక్ ఇవ్వడానికా…? సవరించిన కరెంట్ స్లాబులను వెంటనే రద్దు చేయాలి.
4.ఒక్క అవకాశం అన్నది… భూముల్ని అమ్మడానికా..? ప్రభుత్వ భూముల విక్రయ G.O ని వెంటనే రద్దు చేయాలి.